అకిరా నందన్ మొదటి సినిమా గురించి రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫామిలీ కి ఎలాంటి స్థానం ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చిరంజీవి , పవన్ కళ్యాణ్ తో పాటు ఈ ఫామిలీ నుండి వచ్చిన అల్లు అర్జున్ , రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ మరియు వైష్ణవ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరు ఒక్క రేంజ్ లో సక్సెస్ అయ్యారు, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినప్పటికీ తన సొంత టాలెంట్ తో అన్నయ్య ని ఏ మాత్రం అనుసరించకుండా, తనకంటూ ఒక్క ప్రత్యేకమైన స్టైల్ ని ఏర్పరుచుకొని, యూత్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, హిట్స్ మరియు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఒక్క రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తున్న ఏకైక టాలీవుడ్ ఎవరు అంటే , అది పవన్ కళ్యాణ్ మాత్రమే అని కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు,అలాంటి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే తన నట వారసుడు అకిరా నందన్ ని టాలీవుడ్ లో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే పవన్ కళ్యాణ్ తన కొడుకు అకిరా నందన్ ని గ్రాండ్ గా లాంచ్ చేయించే బాధ్యతలు మొత్తం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అప్పగించాడు అట, రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తన త్రండ్రి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ని ఖైదీ నెంబర్ 150 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేసాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,అలాగే మెగాస్టార్ తో సై రా నరసింహ రెడ్డి వంటి చిత్రాన్ని కూడా నిర్మించి అందరి చేత శబాష్ అనిపించుకున్నాడు,ఇంత చిన్న వయసులోనే ఇన్ని బాధ్యతలు సమర్థవతంగా నిర్వహించిన రామ్ చరణ్ మాత్రమే అకిరా నందన్ ని గ్రాండ్ గా లాంచ్ చెయ్యగలడు అని భావించి ఆ బాధ్యతలు మొత్తం రామ్ చరణ్ మీదనే వేసాడట పవన్ కళ్యాణ్, నా తమ్ముడు అకిరా నందన్ ని లాంచ్ చేసే అవకాశం ఇస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఏ హీరో వారసుడు ఇవ్వనటువంటి గ్రాండ్ డెబ్యూ మూవీ ని అకిరా నందన్ కి ఇచేలా ప్లాన్ చేస్తాను అంటూ గతం లో పలు ఇంటర్వూస్ లో రామ్ చరణ్ తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఇప్పుడు స్వయంగా పవన్ కల్యాణే తన కొడుకు డెబ్యూ మూవీ ని లాంచ్ చేసే బాధ్యతలు రామ్ చరణ్ కి ఇవ్వడం తో రామ్ చరణ్ అకిరా నందన్ ని గ్రాండ్ గా లాంచ్ చెయ్యడానికి ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసాడు అట, ఇందులో కోసం టాలీవుడ్ లో ఒక్క సెన్సషనల్ డైరెక్టర్ తో అకిరా నందన్ కోసం ఒక్క స్క్రిప్ట్ ని సిద్ధం చేయిస్తున్నాడు అట, ఈ ఏడాది చివరి లోపు ఈ స్క్రిప్ట్ సిద్ధం అవ్వబోతున్నట్టు సమాచారం,తోలి సినిమా తోనే ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టే రేంజ్ స్టోరీ తో అకిరా నందన్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసేందుకు రామ్ చరణ్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు అట, అయితే అకిరా నందన్ మొదటి సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అతని పుట్టిన రోజు నాడు తెలిపే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం, మరి పవర్ స్టార్ వారసుడు ఎంట్రీ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.