అకిరా నందన్ సినీ ఇండస్ట్రీ లో ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్ !

రేణుదేశాయ్ తెలుగు రాష్ట్రలో ప్రజలకు అసలు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఇది అంతలా ఈమె కొంతకాలంగా హాట్ టాపిక్ అవుతున్నారు సినిమా నటిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయినా ఈమె ఆ తరువాత పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్నారు విడాకులు తీసుకోవడం వాటితో హైలెట్ అయిపోయారు. ఇక ఈ మధ్య తరచూ ఏదొక పని చేస్తూ వార్తలో నిలుస్తున్నారు, ఈ క్రమంలోనే కొందరు ఫాన్స్ ఆమెకు కొడుకు అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నించారు దీనిపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు రేణుదేశాయ్ అందులో అద్భుతమైన నటనతో అక్కటుకున్న రేణుదేశాయ్ ఆ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిపోయారు అపుడు జేమ్స్ పండు అనే తమిళ చిత్రంతో పాటు తెలుగులో జానీ సినిమాలో నటించారు.

ఆ తరువాత కొద్దీ రోజులకు వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయిపోయారు నటిగా చేసింది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ రేణు దేశాయ్ మంచి గుర్తింపు అందుకున్నారు యాక్టింగ్ కు దూరం అయినప్పటికీ పలు విభాగాలో పని చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసిన ఆమె కొన్ని పాటలకు డిజైనర్ గాపని చేసారు తద్వారా సినిమా ఆల్ రౌండర్ గా గుర్తింపు ని కూడా అందుకున్నారు పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తరువాత కొన్ని ఏళ్ల పాటు పూణే లో ఉన్నారు.. ఈ క్రమంలోనే ఇష్క్ వాలా లవ్ అనే మరాఠీ సినిమాకి డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ గా తెరకు ఎక్కించారు. ఈ సినిమా నిరాశపరిచింది దీనితో రేణు దేశాయ్ డైరెక్షన్ వదిలేసారు కానీ కొన్ని వెబ్ సిరీస్ లు తో పాటు సినిమాలు నిర్మించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు.

కొద్దీ రోజుల క్రితం రేణు దేశాయ్ తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు ఆ సమయంలోనే పలు షోలకు జడ్జి గా పని చేసారు అలా టెలివిషన్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసారు. ఈ క్రమంలోనే ఇటీవల మొదలైన డ్రామా జూనియర్స్ ది నెక్స్ట్ సూపర్ స్టార్ పేరుతో 5వ సీసన్ లో ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణ రెడ్డి , సింగర్ సునీతలతో కలిసి రేణు దేశాయ్ జడ్జిగా వ్యవరిస్తున్నారు సోషల్ మీడియా లో రేణు దేశాయ్ ఏంటో యాక్టీవ్ గా ఉంటారు అనే విష్యం తెలిసిందే అందులో ఆమె పర్సనల్ విషయాలతో పాటు కెరీర్ కి సంబందించిన విషయాలను విశేషాలను తరచు ప్రస్తావిస్తూ ఉంటారు అలాగే తరచూ ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు దీనితో ఆమెను ఫాలో ఆయె సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది, రేణు దేశాయ్ ఇప్పటికే కొన్ని లక్షల ప్రేక్షకులను అక్కటుకుని ఫాలోయర్స్ ని సంపాదించుకున్నారు.

తెలుగు రాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం బారిగా పెరగడంతో ఏదైనా సమస్య ఉంటె తన దృష్టికి తీసుకొస్తే ఏదొక సహాయం చేస్తాను అని రేణు దేశాయ్ ఇటీవల ప్రకటించారు అందుకు అనుగుణంగానే పలువురు బాధితులు గురించి సోషల్ మీడియా లో పోస్ట్స్ పెడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమెకు కొందరు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నిస్తున్నారు. అకిరా సినీ ఎంట్రీ పై రేణు దేశాయ్ మాట్లాడుతూ ప్రస్తుతం నా పిల్లలు కరోనా నుంచి కాపాడుకోవడం కోసం ఇంట్లోనే ఉంటున్నారు అందరు అదే పని చేయండి అలాగే అకిరా సినీ ఎంట్రీ గురించి చెప్పే సమయం ఇది కాదు కోవిడ్ గురించి అందరు భయపడుతున్న పరిస్థితిలో నేను ఈ విష్యం గురించి ఏమి చెప్పలేను కానీ సమయం వచ్చినపుడు కచ్చితంగా చెబుతాను అంటూ రేణు దేశాయ్ వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ ఫాన్స్ అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.