బుల్లితెర యాంకర్లలో అనసూయ, రష్మి తర్వాత హాట్ యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది విష్ణుప్రియ అని ఎవరైనా చెప్పేస్తారు. విష్ణుప్రియ ఒకప్పుడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింస్‌లో నటించేది. అక్కడ ఆమె మంచినటిగా పేరుతెచ్చుకుంది. దీంతో విష్ణుప్రియ యూట్యూబ్ నుంచి బుల్లితెరకు షిఫ్ట్ అయిపోయింది. ఈటీవీ ప్లస్ ఛానల్లో ‘పోవే పోరా’ అనే షో లో సుధీర్ కలిసి యాంకరింగ్ చేస్తూ పాపులర్ అయ్యింది. మరోవైపు విష్ణుప్రియ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులతో తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటుంది. అలా తన క్రష్ గురించి కూడా విష్ణుప్రియ చెప్పగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. విష్ణుప్రియ తన యూట్యూబ్ ఛానెల్లో మా వంట మీ ఇంట అనే కార్యక్రమాన్ని చేసింది. ఈ ప్రోగ్రాంకు సుడిగాలి సుధీర్ మరదలు రమ్య ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా రమ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా విష్ణుప్రియ తన పెళ్లిపై నోరు విప్పింది.
తనకు అక్కినేని అఖిల్ అంటే ప్రేమ అని గతంలో ఎన్నో సందర్భాల్లో విష్ణుప్రియ చెప్పింది. అయితే ప్రస్తుతం మాత్రం రమ్య అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అఖిల్ అక్కినేని ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది. అఖిల్‌నే తాను పెళ్లి చేసుకుంటానని ఖరాఖండిగా చెప్పింది. ఇప్పుడు ఈ మాటలు ఆయన ఫ్యాన్స్ వింటే.. నన్ను ఏసుకుంటారని, నీ మొహానికి ఆయన అవసరమా? అని అంటారని విష్ణుప్రియ పేర్కొంది. అఖిల్ పోస్ట్‌లకు తాను కామెంట్ చేస్తేనే.. మా అయ్యగారిని వదలవా? అని ఫ్యాన్స్ ఆడుకుంటారని తెలిపింది. అయితే తనకు దేవుడు లాంటి మంచి మనిషి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. ‘అఖిల్‌కు మంచి అమ్మాయి రావాలి.. దేవత లాంటి అమ్మాయి రావాలి.. ఆ దేవతను నేనే కావాలి’ అంటూ ఇలా తన మనసులోని కోరికను విష్ణుప్రియ బయటపెట్టేసింది. పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్లి రెండేళ్లు అక్కడే ఎంజాయ్ చేయాలని ఉందంటూ విష్ణుప్రియ ఆశాభావం వ్యక్తం చేసింది.
అయితే ఇటీవల సుమ యాంకరింగ్ చేసే క్యాష్ ప్రోగ్రామ్‌కు వచ్చిన శ్రీముఖి.. విష్ణుప్రియ గురించి చెప్పిన విశేషాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. విష్ణుప్రియకు నవదీప్ అంటే పిచ్చి అని.. అతని ఇంటికి కూడా వెళ్లిందని శ్రీముఖి చెప్పింది. నవదీప్ అంటే క్రష్ అని విష్ణుప్రియ కూడా చెప్పడంతో ఆమె నవదీప్‌తో ప్రేమలో ఉందా అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. తాజాగా అక్కినేని అఖిల్‌ను పెళ్లి చేసుకుంటానని విష్ణుప్రియ అనడంతో ఆమె కన్ను అయ్యగారి మీద పడినట్లుందని.. ఆమె కోరికలు మాములుగా లేవని పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు తాను ప్రస్తుతం ఏ టీవీ షో చేయకపోయినా యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయం వస్తుందని విష్ణుప్రియ తెలిపింది. ఒక్క వీడియో ఏదైనా చేస్తే.. అందులో ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేస్తే బాగానే డబ్బులు ఇస్తున్నారని పేర్కొంది. కొందరు లక్ష రూపాయలు కూడా ఇస్తారని, అలా బ్రాండ్లను ప్రమోట్ చేయడం, ఇన్‌స్టాగ్రామ్‌లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం ద్వారా కూడా డబ్బులు వస్తున్నాయని విష్ణుప్రియ తన ఆదాయం గురించి వివరించింది.