అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వకీల్ సాబ్ ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా?

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ మేనియా నే కనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అంటేనే ఒక్క జాతర లా ఉంటుంది, అలాంటిది మూడేళ్ళ తర్వాత మళ్ళీ వెండితెర మీద కనపడబోతుంటే ఇక ఏ స్థాయిలో ఉంటుందో మొన్న థియేటర్స్ లో విడుదల అయినా ట్రైలర్ కి జరిగిన హుంగామ చూసి చెప్పేయొచ్చు, అభిమానులు తాము మొదటి రోజు ఎలాంటి హుంగామ చెయ్యబోతున్నామో ఒక్క ట్రైలర్ గా మొన్న జరిగిన వకీల్ ట్రైలర్ లాంచ్ సంబరాలను చూపించారు,ఇక ఈ సినిమా విడుదల రోజు ఎలా ఉండబోతుందో మనం ఊహించడం కూడా కష్టమే, ఇక ఈ సినిమా కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు హైదరాబాద్ లో తెరిచినా సంగతి మన అందరికి తెలిసిందే, ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ తెరిచారు, అయితే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ప్రస్తుతం ఎలా ఉంది, కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వకీల్ సాబ్ ఎంత వసూలు చేసింది అనే దాని పై ఇప్పుడు మనం ఈ స్టోరీ లో మాట్లాడుకోబోతున్నాము.

వకీల్ సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 65 షోస్ కి నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా, 65 షోస్ కి గాను 61 షోస్ నిమిషాల వ్యవధిలోనే హౌస్ ఫుల్ అయిపొయ్యి సరికొత్త చరిత్ర సృష్టించింది,సాధారణంగా తొలుత హౌసేఫుల్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకునే థియేటర్స్ ని అడ్వాన్స్ బుకింగ్స్ కి వదులుతుంటారు డిస్ట్రిబ్యూటర్స్, వకీల్ సాబ్ కి కూడా హైదరాబాద్ లో తొలుత హౌస్ ఫుల్ ఆలస్యం గా అయ్యే థియేటర్స్ ని ఎంచుకొని వాటిని అడ్వాన్స్ బుకింగ్స్ కి వదిలారు, ఈ షోస్ విడుదల ముందు రోజుకి గాను హౌస్ ఫుల్ అవ్వవు, అలాంటిది వకీల్ సాబ్ సినిమాకి మాత్రం విడుదల అయినా క్షణాల వ్యవధిలోనే ఈ స్థాయి బుకింగ్స్ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం, దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో చెప్పడానికి, ఇక రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని అద్భుతాలకు దరి తీస్తుందో తెలియాలి అంటే మరి కొద్దీ రాజులు ఏవైచి చూడాల్సిందే.

ఇక అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వకీల్ సాయిబు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల నాల్గవ తారీఖున శిల్ప కళా వేదిక లో ఘనంగా జరగనుంది, తొలుత ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని హైదరాబాద్ లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో నిర్వహించాలి అని అనుకున్న, రోజు రోజుకి పెరుగుతన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ సభలకు అనుమతి నిరాకరించే ప్రక్రియ లో భాగంగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అనుమతిని ఇవ్వలేదు ప్రభుత్వం, దీనితో నిర్మాతలు శిల్ప కళా వేదిక లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతిని తెచ్చుకున్నారు,ఏప్రిల్ నాల్గవ తేదీన జరగబొయ్యే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కనివిని ఎరుగని రీతిలో జరగనుంది,మరికొద్ది గంటల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి, మరి భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఏప్రిల్ 9 వ తారీఖున ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.