అభిమానులకు కోలుకోలేని షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

సుమారు మూడేళ్ళ సుదీర్ఘ విర్మాణ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్లి సినిమాల్లోకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు దూరమైనా పవన్ కళ్యాణ్ తన పూర్తి ద్రుతిని కేవలం రాజకీయాలపైనే కేంద్రీకరించాడు, అయితే మధ్యలో కాస్త సమయం దొరకడం తో వరుసగా సినిమాలను ఓకే చేస్తున్నాడు, ఇటీవల ఆయన నటించిన వకీల్ సాబ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి అద్భుతమైన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇక సినిమా విడుదల అయినా తర్వాత పవన్ కళ్యాణ్ కి కరోనా సోకడం,అప్పటి నుండి ఇప్పటి వరుకు ఆయన మీడియా కి కనపడకపోవడం అనేది అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేసింది.

ఇక రాజకీయ పరంగా కూడా ఆయన ఏ అంశం పైన కూడా గత రెండు నెలల నుండి బహిరంగంగా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, దీనితో అభిమానుల్లో తమ లీడర్ ఏమి అయ్యాడు అంటూ ఆందోళనకు గురి అయ్యారు,వాస్తవానికి పవన్ కళ్యాణ్ కి కరోనా చాలా తీవ్రమై ఎఫెక్ట్ ఇచ్చింది అని చెప్పొచ్చు, ఈ కరోనా వల్ల ఆయన ఊపిరి తిత్తులు బాగా దెబ్బ తిన్నాయి, డాక్టర్లు ఇచ్చిన మెరుగా వైద్యం వల్ల ఆయన నెల రోజుల తర్వాత కోలుకున్నారు,కానీ కరోనా నుండి పూర్తిగా కోలుకున్నప్పటికీ కచ్చితంగా రెండు నెలల పాటు సంపూర్ణమైన విశ్రాంతి అవసరం అని, ఎలాంటి మానసిక వత్తిడికి గురి కాకూడదు అని డాక్టర్లు కచ్చితంగా చెప్పడం తో ఆయన సంపూర్ణంగా రెండు నెలల పాటు విరామం తీసుకున్నారు, ఇందువల్లే పవన్ కళ్యాణ్ అన్ని కార్యకలాపాలకు దూరం అయ్యాడు అని జనసేన పార్టీ నాయకులూ తెలిపారు.

ఇది ఇలా ఉండగా గత రెండు రోజుల నుండి జనసేన పార్టీ విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ జులై మొదటి వారం లో విజయవాడ లో పర్యటించనున్నారు అని, ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి రాష్ట్రం లో నెలకొన్న అన్ని సమస్యలపై మరియు ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతారు అని సమాచారం, దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన జనసేన పార్టీ నుండి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు, అయితే సోషల్ మీడియా లో మరో వార్త అభిమానులను నిరాశ కి గురి చేస్తోంది, అది ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తానూ ఒప్పుకున్నా మూడు సినిమాల తర్వాత ఆయన సినిమాలకు పూర్తిగా దూరం అవ్వనున్నారు అనే వార్త గట్టిగ వినిపిస్తుంది.

2024 ఎన్నికలలో కచ్చితంగా పార్టీ కి మెరుగైన ఫలితాలు రావాలి అంటే పార్టీ నిర్మాణం పై సంపూర్ణ ద్రుష్టి పెట్టాలి అని, అందుకే 2022 వ సంవత్సరం ఏప్రిల్ లోపు ఉన్న సినిమాలు అన్ని పూర్తి చేసి ఆ తర్వాత జనసేన పార్టీ ని గట్టిగ జనాల్లోకి తీసుకొని వెళ్లే కార్యాచరణ లో నిమగ్నమవబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి, ఈ వార్త జనసేన పార్టీ మద్దతు దారులకు కాస్త సంతోషం ని కలిగించే విషయమే అయినా పవన్ కళ్యాణ్ సినీ అభిమానులకు మాత్రం చేదు వార్త అని అనడం లో ఎలాంటి సందేహం లేదు, అయితే పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల తర్వాత కచ్చితంగా మల్లి సినిమాలు చేస్తాడు అనే నమ్మకం తో చాలా మంది అభిమానులు ఉన్నారు, మరి ఏమి జరుగుతుందో చూడాలి.

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన వకీల్ సాబ్ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరిహరవీర మల్లు అనే సినిమాని చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా తో పాటు రానా తో కలిసి అయ్యప్పనం కోషియం అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు, ఈ రెండు సినిమాల తర్వాత ఆయన గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో మరో సినిమా చేయనున్నాడు,ఈ చిత్రం ఈ ఏడాది చివరి లోపు రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోనున్నాయి.

ఇక కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో విజృంభించడం వల్ల సినిమాల షూటింగ్స్ అన్ని తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడం తో మళ్ళీ షూటింగ్ అన్ని ప్రారంభం కానున్నాయి, పవన్ కళ్యాణ్ మరియు రానా కలిసి చేస్తున్న సినిమా షూటింగ్ కూడా ఈ నెల 12 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.