అమెరికా లో ప్రభంజనం సృస్టించియాన్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం గురించి మాట్లాడుకోవడం ఇటీవల మనం గమనిస్తూనే ఉన్నాము, ఎందుకంటే ఈమధ్య విడుదల అయినా వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ సృష్టించిన ప్రభంజనం లాంటిది మరి, కేవలం ఆన్లైన్ లోనే కాదు థియేటర్స్ లో కూడా ఈ ట్రైలర్ ఒక్క ప్రభంజనం సృష్టించిన సంగతి మన అందరికి తెలిసిందే,దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్నా సినిమా కావడం తో దిల్ రాజు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు, అందుకే ఈ సినిమా ట్రైలర్ ని కూడా యూట్యూబ్ లో విడుదల చెయ్యబోయే అరగంట ముందే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 100 కి పైగా థియేటర్స్ లో విడుదల చేసారు,విడుదల చేసిన ప్రతి ఒక్క థియేటర్ లో జనాలు కనివిని ఎరుగని రీతిలో హాజరు కావడం తో థియేటర్స్ యాజమాన్యాలు కూడా అదుపు చేయలేకపోయాయి, కేవలం ట్రైలర్ విడుదల కి మొదటి రోజు సినిమాలు చూడడానికి ఎంత మంది అయితే వస్తారో, దానికి పదింతలు ఎక్కువ జనాలు వచ్చారు, వకీల్ సాబ్ ట్రైలర్ ప్రదర్శన కి వచ్చిన జనాలను నేషనల్ మీడియా కూడా తమ చానెల్స్ లో ప్రసారం చేసింది.

ఇది ఇలా ఉండగా వకీల్ సాబ్ చిత్రం బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా అమితాబ్ బచ్చన్ పింక్ సినిమాకి రీమేక్ గా వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రని తమిళ్ లో అజిత్ చేసాడు, రెండు భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది, ఇక తెలుగు లో అదే సినిమాని పవన్ కళ్యాణ్ వంటి హీరో చేస్తున్నాడు అనే వార్త రావడం తో, తొలుత ఆయన అభిమానులు కంగారు పడ్డారు, ఎందుకంటే పింక్ వంటి సినిమాలు తమిళ్ మరియు హిందీ వంటి బాషలలో ఆడొచ్చు కానీ , తెలుగు లో ఆడటం కష్టం అనేది ట్రేడ్ పండితుల అంచనా, అందులోనూ పవన్ కళ్యాణ్ వంటి మాస్ హీరో చేస్తే కచ్చితంగా ఆడాడు అని తొలుత అందరూ అనుకున్నారు, కానీ టీజర్ దగ్గర నుండి ట్రైలర్ డతఁగ్గర వరుకు ఇప్పటి వరుకు ఈ సినిమాకి సంబంధించిన వీడియోలు అన్ని పవన్ కళ్యాణ్ ఇమేజి కి తగట్టు ఈ సినిమాని తీశారు అనేది అర్థం అయ్యింది, పవన్ కళ్యాణ్ మార్క్ హీరోయిజం మిస్ అవ్వకుండా అలాగే, సినిమాలోని కంటెంట్ ఏ మాత్రం దెబ్బతినకుండా డైరెక్టర్ వేణు శ్రీ రామ్ ఈ సినిమాని తెరకెక్కించాడు.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాని తమిళ్ లో తీసిన హీరో అజిత్ ఇటీవల విడుదల అయినా వకీల్ సాబ్ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు,పవన్ కళ్యాణ్ మరియు అజిత్ కి కామన్ ఫాన్స్ అటు తమిళనాడు లోను ఇటు ఆంధ్ర ప్రదేశ్ లోను ఎంతోమంది ఉన్నారు అనే విష్యం మన అందరికి తెలిసిందే, అజిత్ కూడా పలుమార్లు నాకు తెలుగు లో ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే, పవన్ కళ్యాణ్ కూడా కొన్ని ఇంటర్వూస్ లో అజిత్ గురించి మంచిగా మాట్లాడాడు, ఇప్పుడు ఆయన వకీల్ సాబ్ సినిమా గురించి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో సంచలనం గా మారింది, ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది, ఈ సినిమా ఆయన ఇమేజి నూటికి నూరు పాళ్ళు సరిగ్గా సెట్ అవుతుంది, ఇటీవల విడుదల అయినా ట్రైలర్ ని చూసాను, డైరెక్టర్ ఇక్కడ ఇంకా కొన్ని మార్పులు చేసి తమిళ్ మరియు హిందీ కంటే అద్భుతంగా తీసినట్టు అనిపించింది, సినిమా ఘానా విజయం సాధించాలి, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఆయన ఈ సందర్భంగా మాట్లాడాడు.