జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోతో క్రేజ్ సంపాదించుకుని బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ నేపథ్యంలో అవినాష్ సడెన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు షాకిచ్చాడు. అనూజ అనే అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు అవినాష్ తెలిపాడు. ఈ మేరకు ఆమెతో జరిగిన తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఆలస్యం చేయడం ఎందుకు… చాలా మంది చాలా సార్లు నా పెళ్లిపై ప్రశ్నలు వేశారు. అతి త్వరలో నా అనూజతో ఒక్కటి కాబోతున్నా. మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా మీ అనుజా అవినాష్ అంటూ అతడు పోస్ట్ చేశాడు. దీంతో చాలామంది అవినాష్‌కు ఒకవైపు శుభాకాంక్షలు తెలుపుతూనే.. మరోవైపు అరియానా గురించి ప్రశ్నలు వేశారు.
ఎందుకంటే గత ఏడాది ప్రసారమైన బిగ్‌బాస్ షోలో అవినాష్, అరియానా కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టాస్కులలో భాగంగా క్లోజ్‌గా మూవ్ అవుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకునేవారు. ఒకరు ఏడిస్తే మరొకరు కన్నీరు పెట్టుకునేవారు. ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఆడేవారు. దీంతో వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లోనే సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. బయటకు వచ్చిన తరువాత కూడా వీళ్లిద్దరూ చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. తరచూ కలిసి మెలిసి పలు ఈవెంట్లలో పాల్గొనడం.. గోవా ట్రిప్‌లకు వెళ్లిన వీడియోలు చేయడంతో వీరు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారంటూ కామెంట్లు వినిపించాయి. అయితే తాజాగా అవినాష్ ఎంగేజ్మెంట్ ఫోటోలను పోస్ట్ చేయడంతో అరియానా కూడా స్పందించింది. తమ మధ్య ఏదో ఉందని చాలా రూమర్లు వచ్చాయి కానీ అలాంటిది ఏమీ లేదని.. అవినాష్‌కి పెళ్లి ఫిక్స్ కావడం తనకు చాలా హ్యాపీగా ఉందని అరియానా చెప్పింది. అవినాష్ ఎప్పుడూ పెళ్లి పెళ్లి అంటూ ఉంటాడని.. తనకు అవినాష్ మంచి ఫ్రెండ్ అని.. తను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ క్లారిటీ ఇచ్చింది. తాను కూడా డబ్బు బాగా సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుంటానని.. ఇప్పట్లో అయితే తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది బిగ్‌బాస్ బ్యూటీ అరియానా.