ఆచార్య ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ ఆనందం లో రామ్ చరణ్ అభిమానులు

రాజకీయాలో బిజీగా ఉన్న మెగాస్టార్ దాదాపు 10 సంవత్సరాలు సుదీర్ఘ విరామం తరువాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు.. బాక్స్ ఆఫీస్ రికార్డులతో చెడుగుడు ఆదుకున్నారు అయిన బాహుబలి సినిమా తరువాత తొలి 100 కోట్ల రూపాయలతో కొట్టిన హీరోగా చరిత్రలోకి ఎక్కారు మెగాస్టార్, ఇక 60 ఏళ్ళ వయసు లో సైరా నరసింహ రెడ్డి వంటి సినిమా చేసి అభిమానుల చేత ప్రేక్షకుల చేత శబాష్ మెగాస్టార్ అనిపించేలా చేసారు… నటన ఇంకా సైరా సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో ఆచార్య సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు తన సొంత నిర్మాణ సమస్త కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు,ఇప్పటికే దాదాపు 70 % పైగా షూటింగ్ అయిపోయింది..

ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి…. అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలెట్ గా నిలవడం ఏ కాకుండా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో నిలిచిపోయే విదంగా ఉంటుంది.. ఈ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంలో చిరంజీవి తో పాటు మరో హీరో కూడా నటించే అవకాశం ఉంది, ఆ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా వెండితెర పై కనిపించే అభిమానులకు ప్రేక్షలుకు ఒక రేంజ్ లో ఉంటుంది, ఈ పాత్ర ని రామ్ చరణ్ తో చేపించాలని తొలి నుంచి దర్శక నిర్మాతలు ప్రయత్నం చేసారు, రామ్ చరణ్ అప్పటికే రాజమౌళి తో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు, ఆచార్య సినిమాకి డేట్ లు సద్దుబాటు చేయడం చాలా కష్టం అయింది..

రాజమౌళి ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ఈ పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ని సంప్రదించాలని కొరటాల శివ భావించారు.. మహేష్ బాబు కూడా ఆ పాత్ర చేయడానికి ఆసక్తి చూపించారని కొరటాల శివ చెప్పారు. ఇక మహేష్ బాబు ఆచార్య సినిమాలో నటించడం దాదాపు ఖరారు అనే వార్తలు వచ్చాయి అయితే మధ్యలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడం షూటింగ్ అన్ని ఆగిపోవడం వాళ్ళ మహేష్ బాబు కి కూడా డేట్లు ఆరెంజ్ కాలేదు తరువాత సినిమాకి దీనితో రాజమౌళి ని ఒప్పించి ఆచార్య లో ఆ పాత్ర చేయడానికి రామ్ చరణ్ ముందుకి వచ్చారు.. నిన్న అయిన అభిమానులు ఆచార్య సినిమాలోని రామ్ చరణ్ కి సంబందించిన లుక్ తో పోస్టర్ ని డిజైన్ చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ పోస్టర్ ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..

జనవరి నెలలో చిరంజీవి కి సంబందించిన సన్నివేశాలు చిత్రీకరణ మొత్తం పూర్తిఅవుతుంది, ఫిబ్రవరి నుంచి రామ్ చరణ్ కి సంబందించిన షూటింగ్ జరుగుతుందని ఫిలింనగర్ లో టాక్ మొదలైంది, అయితే రామ్ చరణ్, చిరంజీవి మధ్య వచ్చే కొన్ని ప్రత్యేకమైన సీన్స్ ఒక పాట చిత్రీకరణ ఉందట.. ప్రస్తుతం కరోనా సోకి క్వారంటైన్ లో ఉన్నారు రామ్ చరణ్ ఇంకా పూర్తిగా కోలుకున్నాక ఆచార్య సినిమా సెట్స్ లో వస్తారు ఇంకా సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా పూజ హెగ్డే ని కన్ఫర్మ్ చేసారు, మెగాస్టార్ చిరంజీవి కి జోడిగా కాజల్ నటిస్తుంది.. ముందు చరణ్ పాత్ర కేవలం అతిధి పాత్ర గా తీసుకున్నాం అనుకున్నారు కానీ కధలో రామ్ చరణ్ స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఒక గంట ఉండేలా రామ్ చరణ్ పాత్రని బాగా పెంచి ఆచార్య సినిమాకి కాస్త రామ్ చరణ్, చిరంజీవి మల్టీ స్టార్రర్ గా సినిమానే మార్చేశారు ఈ పాత్ర రామ్ చరణ్ కెరీర్ లో గుర్తుండిపోయేలా ఉంటుంది…