ఆచార్య సినిమా తరువాత రాబోయే సినిమా గురించి లీక్ చేసిన చిరు ఆనందం లో మెగా ఫాన్స్ !

మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం రాజకీయాలకు విరామం ఇచ్చి వరసగా సినిమాలతో బిజీ గా ఉన్నారు అందులో భాగంగా కొరటాల శివ దర్శకత్వం లో తన 152వ చిత్రం చేస్తున్నారు అనే విష్యం మనకి తెలిసిందే అయితే ఆచార్య పేరుతో తెరకు ఎక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 80% కి పైగా షూటింగ్ పూర్తీ చేసుకుంది, ఈ చిత్రం లో రామ్ చరణ్ ఒక మాజీ నెక్సలేట్ గా కనిపిస్తారని సమాచారం అంటే కాదు దాదాపు 30 నిముషాలు ఉండే ఆ పాత్ర సినిమాకి హైలెట్ గా ఉంటుందట, ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజినా మెగాస్టార్ తో డాన్స్ వేసిందట దీనికి సంబంధించి .ఆ పాటని ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసింది చిత్ర బృందం, ఈ సినిమాను రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఇద్దరు కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ మాటినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఆచార్య షూటింగ్ లో ఉండగానే చిరంజీవి గారు మరో 3 సినిమాలకి లో నటించడానికి ఒప్పుకున్నాడు, ఒక మలయాళం సినిమాకి రీమేక్ చేస్తున్నారు మలయాళం లో ఏడాది క్రితం వచ్చిన లూసిఫెర్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది, మోహన్లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ ఒక విజయం సాధించింది అనే చెప్పాలి అయినా కెరీర్ కి ఒక మంచి హిట్ సినిమా మరియు మంచి క్రేజ్ తెచ్చింది, ఈ సినిమాని తెలుగు లో ఇపుడు చిరంజీవి గారితో రీమేక్ చేయాలనీ ఉదేశంతో రామ్ చరణ్ హక్కులను సొంతం చేసుకున్నారు అయితే ఈ సినిమాని మొదట సుజీత్ దర్శకత్వం చేస్తారు అన్నారు ఆ తరువాత వినాయక్ పేరు వినపడింది కానీ చివరకి మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారని చిత్రబృందం ఓఫిషల్ గా అనౌన్స్ చేసింది.. తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారు.

ఇక లూసిఫెర్ చిత్రం లో మంజు వర్రిర్ హీరో కి చెల్లి పాత్రలో నటించింది, ఇపుడు తెలుగు లో ఈ పాత్రలో సుహాసిని కనిపించబోతుంది, ఈ సినిమాలో హీరోయిజం ఎలేవేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలెట్ గా ఉండేలా మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా తెరకు ఎక్కించాలని చూస్తున్నారట దర్శక నిర్మాతలు మోహన్ రాజా గతంలో చాలా రీమేక్ సినిమాలను దర్శకత్వం వహించారు, తెలుగు లో హనుమాన్ జంక్షన్ డైరెక్ట్ చేసింది అతడే ఆ తరువాత తమిళ్ లో చాలా సినిమాలకి దర్శకత్వం వహించారు అంతే కాదు రామ్ చరణ్, ధ్రువ ఒరిజినల్ వెర్షన్ కి డైరెక్ట్ చేసింది మోహన్లాల్ ఇక ఆ సినిమాతో పాటు చిరంజీవి తమిళ్ హిట్ మూవీ వేదలమ్ రీమేక్ లో కూడా నటించబోతున్నారు అజిత్ హీరో గా 2015 లో వచ్చిన వేదలమ్ సినిమా తమిళ లో బారి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సినిమాలో అజిత్ రోల్ అక్కడ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది. ఆ పాత్రకి తాను సూట్ అవుతారని భావించిన మెగాస్టార్ ఈ సినిమాలో రీమేక్ లో అయినా నటిస్తున్నారు.

ప్రస్తుతం ప్లాపులతో సతమతవుతున్న డైరెక్టర్ మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు టాక్ వస్తుంది, ఇక అదే సినిమాలో కీర్తిసురేష్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తుంది దీనిపై ఓఫిషల్ ప్రకటన రావాల్సి ఉంది, ఇక ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ ఈ సినిమా పూర్తయ్యాక తరువాత ముందుగా తమిళ వేదలమ్ రీమేక్ ని మొదలుపెడతారు, ఈ సినిమాను ఏ.కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం, సుంకర సపార్పణలో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ 2 సినిమాలతో పాటు బాబీ దర్శకత్వం లో ఒప్పుకున్నాడు చిరు, ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది తాజాగా ఉప్పెన ప్రీ- రిలీజ్ వేదికకు హాజరు అయినా చిరంజీవి ఈ సందర్బంగా లీక్ చేసారు అయినా మాట్లాడుతూ తన సినిమా కూడా ప్రతిష్టాత్మక బ్యానర్ లో బాబీ దర్శకత్వం లో రావడం సంతోషం గా ఉందని క్లారిటీ ఇచ్చారు దీనితో చిత్ర దర్శక నిర్మాతలు షాక్ అయ్యారు, ఇదివరకు కూడా ఒక ఫంక్షన్ లో కూడా సినిమా పేరు ఆచార్య అని ఓఫిషల్ ప్రకటన రాకముందే లీక్ చేసారు, ఆచార్య సినిమా మే 14న రిలీజ్ కాబోతుంది అభిమానులకు పండగే అని చెప్పాలి.