ఆపద్బాంధవుడు సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా తయారు అయ్యిందో చూస్తే ఆశ్చర్యపోతారు

మెగాస్టార్ చిరంజీవి అంటేనే కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు, ఒక్కే మూస వెళ్తున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమకి సరికొత్త కమర్షియల్ టచ్ ని పరిచయం చేసిన నటుడు ఆయన, అలాంటి కమర్షియల్ హీరో తన పంధా ని మార్చి కేవలం నటన కి ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చాలానే చేసాడు, అలా ఆయన అద్భుతమైన నటనని కనబర్చిన సినిమా ఆపద్బాంధవుడు, ఈ సినిమా కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా కూడా మెగాస్టార్ లోని అద్భుతమైన నటన ని మరోసారి అందరికి తెలిపేలా చూసింది, చిరంజీవి సినిమాల్లో అద్బుతమగా నటించిన టాప్ 5 చిత్రాల లిస్ట్ ని తీస్తే అందులో కచ్చితంగా ఆపద్బాంధవుడు సినిమా కూడా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి శేషాద్రి ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు, ఈ సినిమాలో ఈ అమ్మాయి చేసిన నటన కి అవార్డులు కూడా వచ్చాయి,అయితే ఆపద్బాంధవుడు సినిమానే ఆమెకి తెలుగు లో మొట్టమొదటి సినిమా అలాగే చివరి సినిమా కూడా, ఆ సినిమా తర్వాత ఆమెకి బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు రావడం తో అక్కడ బోలెడన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి టాప్ స్టార్ గా ఎదిగింది, అలాంటి ఈమె గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

మీనాక్షి శేషాద్రి 1983 వ సంవత్సరం లో బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్ హీరో గా పరిచయం అవుతూ చేసి హీరో అనే సినిమా లో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది, తొలి సినిమానే భారీ విజయం సాధించడం తో మీనాక్షి రాత్రికి రాత్రే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది,ఇక ఆ తర్వాత ఈమెకి వరుసగా ఫ్లాప్స్ వచ్చిన కూడా తట్టుకొని నిలబడి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించింది, అప్పట్లో ఈమె తమిళ్ లో రజిని కాంత్ తో కలిసి రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది, కానీ తెలుగు లో మాత్రం ఆమె చేసిన ఏకైక సినిమా మెగాస్టార్ తో చేసిన ఆపద్బాంధవుడు సినిమానే, ఇక ఈమె 1995 వ సంవత్సరం లో హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలుగుతున్న సమయం లోనే హరీష్ అనే బ్యాంకు ఉద్యోగి ని పెళ్ళాడి సినిమాల నుండి శాశ్వతంగా తప్పుకుంది, ఈమెకి ఒక్క పాప మరియు ఒక్క బాబు ఉన్నారు, అయితే ఆమె చాలా కాలం తర్వాత 2016 వ సంవత్సరం లో బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన గాయాల ఒన్స్ అగైన్ అనే సినిమాలో నటించింది, ఇప్పుడు మల్లి ఆమె వెండితెర మీద రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం, అయితే ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

1

2

3

4

5

6

7

8