ఆర్ ఆర్ ఆర్ గురించి ఎవ్వరికి తెలియని షాకింగ్ నిజాలు చెప్పిన రాజమౌళి

మన తెలుగు సినిమా ఖ్యాతి బాహుబలి సినిమాతో ఏ స్థాయిలో వెళ్లిందో ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు,ప్రపంచం నలుమూలల మన తెలుగు సినిమా ప్రతిభ ఎలాంటిదో అందరికి తెలిసేలా చేసింది ఈ సినిమా,ఈ సినిమా తర్వాత మన తెలుగు సినిమాలు అంటే ఇతర బాష కి చెందిన ప్రేక్షకులు ఇప్పుడు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు, వాళ్ళ ఆసక్తి ని దృష్టిలో పెట్టుకొనే మన తెలుగు సినిమా దర్శక నిర్మాతలు ఇప్పుడు ప్రతి తాము నిర్మించబోయ్యే ప్రతి సినిమాని పాన్ ఇండియన్ సినిమా గానే తెరకెక్కిస్తున్నారు, తెలుగు సినిమా స్థాయిని ఈ స్థాయిలో పెంచిన ఘనత కచ్చితంగా రాజమౌళి కే దక్కుతుంది.

ఇక బాహుబలి వంటి సంచలన విజయం తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమా తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండే అంచనాలు ఎవ్వరు ఊహించని స్థాయికి చేరుకుంది,ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆ అంచనాలను పదింతలు చేసాయి,ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీత రామ రాజు గా మరియు జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

కేవలం రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది అని ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ బైక్ మీద వెళ్తున్న పోస్టర్ ని విడుదల చేసి అధికారికంగా తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే,ఇప్పటికే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వారి పాత్రలకు రెండు బాషలలో డబ్బింగ్ కూడా పూర్తి చేసారు అట, మిగిలిన భాగంగా త్వరగా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది అక్టోబర్ 13 వ తేదీన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అట,ఇక ఇటీవల విడుదల చేసిన పోస్టర్ కి సోషల్ మీడియా నుండి కనివిని ఎరుగని రెస్పాన్స్ వచ్చింది, అయితే ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి వెళ్తున్న బైక్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ బైక్ ని బాగా పరిశీలించి చూస్తే జల్సా సినిమా లో పవన్ కళ్యాణ్ ఇదే బైకుని సినిమాలో వాడుతాడు,ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ లో ఉన్న బైక్ ని చూస్తే అచ్చు గుద్దినట్టు జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన బైక్ ని వాడినట్టు తెలుస్తుంది, వాస్తవానికి ఈ సినిమాలో కొమరం భీం వాడే బైక్ కోసం రాజమౌళి ఎన్నో పరిశోధనలు చేసారు అని, అన్ని చూసాక ఆయన జల్సా సినిమా లో పవన్ కళ్యాణ్ వాడిన బైక్ ఆయనకీ ఎంతగానో నచ్చింది అని దీనితో అచ్చు అలాంటి బైక్ ని రాజమౌళి ప్రత్యేకముగా తయారు చేయించాడు అని ఫిలిం నగర్ నుండి వినిపిస్తున్న గుసగుసలు.

ఇది ఇలా ఉండగా ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకి ముందే ట్రేడ్ పరంగా అద్భుతాలు సృష్టిస్తుంది, ఈ సినిమా థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కలిపి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయిల బిజినెస్ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం,ఇక ఈ సినిమా అవుట్ పుట్ అయితే చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడు భావోద్వేగానికి లోను అయ్యే విధంగా ఉంటుంది అట, ముఖ్యం గా ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు మరియు ప్రేక్షకులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి అట,రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఇటీవల ఈ సినిమా చూసి ఒక్క ఇంటర్వ్యూ లో భావోద్వేగానికి గురి అవుతూ మాట్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే.

నాకు ఈ సినిమా చూసినప్పుడు ఎలాంటి అనుభూతి అయితే కలిగిందో, అలాంటి అనుభూతి ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది అనే నమ్మకం నాకు ఉంది అని రాజమౌళి తండ్రి తెలిపారు,కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండడం తో ఈ సినిమా ని అక్టోబర్ 13 వ తేదీన విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు అట, ఇటీవల విడుదల చేసిన పోస్టర్ లో కూడా అక్టోబర్ 13 వ తేదీ అనే ఉంది, ఒక్క కరోనా మూడవ వేవ్ ప్రారంభం అయితే ఈ సినిమా మల్లి వాయిదా పడే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.