ఆర్ ఆర్ ఆర్ నుండి లీక్ అయినా ఈ సన్నివేశం చూస్తే మెంటలెక్కిపోతారు

బాహుబలి వంటి సంచలన విజయం తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ తో ఆర్ ఆర్ ఆర్ అనే ముల్టీస్టార్ర్ర్ సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇద్దరు మాస్ ఇమేజి ఉన్న హీరోలు, రాజమౌళి వంటి సెన్సషనల్ డైరెక్టర్ తో సినిమా చేస్తూండబట్టి ఈ మూవీ పై అంచనాలు షూటింగ్ ప్రారంభించిన తేదీ నుండే ఏ స్థాయిలో ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇప్పటి వరుకు ఈ సినిమాకి సంబంధించిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ టీజర్స్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, పోయిన ఏడాదే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ ఏడాది అక్టోబర్ 13 వ తేదీన విడుదల కాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క వీడియో సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ అవుతుంది.

రామ్ చరణ్ కి సంబంధించిన ఒక్క పోరాట సన్నివేశం సోషల్ మీడియా లో కొంత కాలం క్రితం లీక్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే, అయితే లీక్ అయినా ఆ వీడియో ని ఎక్కడ వైరల్ కాకుండా ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ పలు జాగ్రత్తలు తీసుకోగా ఆ వీడియో ని అప్లోడ్ చేసిన వెబ్ సైట్స్ అన్ని బ్యాన్ చెయ్యబడ్డాయి, అయితే రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకీ బహుమతి గా ఆయన అభిమానులు రామ రాజు గెటప్ లో చేసిన ఒక్క ఎడిటెడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారింది, గుర్రం మీద స్వారీ చేస్తూ నిప్పుల మధ్య నుండి వస్తున్నా రామ్ చరణ్ వీడియో ని చూడగానే రోమాలు నిక్కపొడుచుకునేలా తీర్చి దిద్దారు రామ్ చరణ్ అభిమానులు, ఇక్కడ అసలు విష్యం ఏమిటి అంటే గతం లో లీక్ అయినా వీడియో కి,రామ్ చరణ్ ఫాన్స్ చేసిన యానిమేటెడ్ వీడియో కి అక్కడక్కడా పోలికలు ఉండడం విశేషం,ఈ వీడియో తో పాటు గతం లో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు కూడా సోషల్ మీడియా లో లీక్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం రామ్ చరణ్ కి సంబంధించిన సరికొత్త లుక్ ని విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఆ లుక్ ని మీరు క్రింద ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు,సినిమాలో రామ్ చరణ్ పాత్ర ని కనివిని ఎరుగని రేంజ్ లో ఎంతో పవర్ ఫుల్ గా చూపించాడు అట డైరెక్టర్ రాజమౌళి, నిన్న మొన్నటి వరుకు అల్లూరి సీతారామరాజు పాత్ర అంటే మనకి వెంటనే సూపర్ స్టార్ కృష్ణ గారు గుర్తుకు వచ్చేవారు, ఈ సినిమాలో ఆయన నటించాడు అని అనడం కంటే జీవించాడు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, తరతరాలు గుర్తు ఉండిపొయ్యే విధంగా అల్లూరి సీతారామరాజు పాత్ర లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఆలా ఒదిగిపోయారు, అయితే ఈ గీరేషన్ లో అల్లూరి సీతారామరాజు పాత్ర ని రామ్ చరణ్ తప్ప మరో హీరో వెయ్యలేదు అనే విధంగా రాజమౌళి రామ్ చరణ్ పాత్రని తీర్చి దిద్దాడు అట, ఇప్పటియూకె మగధీర లో కాల భైరవ మరియు రంగస్థలం లో చిట్టి బాబు పాత్రల ద్వారా నటుడిగా తనలోని సత్త ని చాటుకున్న రామ్ చరణ్ కి ఈ అల్లూరి సీతారామ రాజు పాత్ర చరిత్రలో మిగిలిపొయ్యే విధంగా ఉండబోతుంది అట.