ఇంటికివచ్చిన లాస్యకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గంగవ్వ షాక్ లో లాస్య…

మై విల్లెజ్ షో గంగవ్వ తెలుగు రాష్ట్రలో ఈ పేరు తెలియని వారు ఉండరు గంగవ్వ చాలా తక్కువ కాలం లో తెలుగు ప్రేక్షకులకు దెగ్గర అయిన సహజ నటి 58 ఏళ్ల గంగవ్వ తెలంగాణ యాసలో మాట్లాడుతు అందరిని ఆకట్టుకుంటుంది. ఇంకా టాప్ యూట్యూబ్ స్టార్ లో ఒక్కరిగా రాణిస్తుంది గంగవ్వ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ అయితే తెలుగు వారు ఉన్నారో వాళ్ల అందరికి దెగ్గర అయింది, గంగవ్వ కి చదువు లేదు నటనలో శిక్షణ ఏ మాత్రం లేదు కానీ ఏ పాత్రలో అయిన నిలమైపోయి యాక్టింగ్ ఇరగదీస్తోంది. 20-30 ఏళ్ల అయిన అనుభవం ఉన్న సీనియర్ నటులతో సమానం గా గంగవ్వ నటిస్తుంది అంటే ఆమె దైర్యవంతురాలో తెల్సుకోవచ్చు జీవితం లో ఎన్నో కష్టాలు చూసింది ఆమె కానీ ఈ నటనతో ఇపుడు ఆ కష్టాలన్ని మర్చిపోతుంది.

సోషల్ మీడియా లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్న గంగవ్వ బిగ్ బాస్ 4 సీసన్ లో ఎంట్రీ ఇచ్చి ఒక కంటెస్టెంట్ గా అద్భుతమైన అట ప్రదర్శన ఇచ్చింది అసలు చివరి వరకు ఉంటె టైటిల్ విన్నర్ గంగవ్వ అవుతుందేమో అనిపించింది ప్రతి ఒక్కరికి అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రారంభం అయిన బిగ్ బాస్ 4 సీసన్ ఎంతో అద్భుతంగా జరిగింది. గంగవ్వ పార్టిసిపేషన్ వాళ్ళ చాలా మంచి క్రేజ్ వచ్చింది,ఈ నాలుగో సీసన్ లో దాదాపు అందరు కొత్త వాళ్లే ఇంకా ఎంతో ఉత్సాహంగా షోలోకి అడుగు పెట్టిన గంగవ్వ అక్కటుకునే పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకుల నుంచి మంచి పేరు దక్కించుకుంది, వోట్ లు కూడా ఆమెకు బాగానే వచ్చాయి అయితే రోజు మట్టి వాసనా తో ఊరిలో తిరిగే గంగవ్వ అక్కడ హౌస్ లో ఉండలేక పోయింది వయసు పై పడటం బిగ్ బాస్ లో ఉండలేక పర్మిషన్ తీసుకుని 4 వారలు ఉంది 5 వ వారం వెళ్లిపోయింది.

ఇంకా బయటకి వచ్చిన తరువాత ఎంతో హుషారు గా కనిపించింది గంగవ్వ తన సొంత ఊరిలో లంబాడిపల్లి లో నివాసం ఉంటుంది గంగవ్వ ని జోరుద్దార్ సుజాత కలిసి ముచ్చట్లు కూడా పెట్టారు ఇంకా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చిన లాస్య తన భర్తతో ఊరు లంబాడిపల్లి వెళ్లి గంగవ్వ ని కలిసింది, ఈ సందర్బంగా యూట్యూబ్ ఛానల్ లాస్య టాక్స్ లో వీడియో ని పోస్ట్ చేసింది, గంగవ్వ ఇంటికి చేరుకున్న తరువాత ఆమె మామూలుగానే చీర కట్టుకుని ఆమెతో కలిసి ఇంటి పనులు చేసింది సరదాగా పొల్లం లో వెళ్లి అంత ముచ్చటించారు అన్ని పనులు చేసి పొల్లం లో పని చేస్తే కష్టం ఎలా ఉంటుందో తెలుసుకుంది లాస్య ,భోజనం చేసి అదరకొట్టింది లాస్య.

ఇక గంగవ్వ తో లాస్య పొల్లాలో తిరుగుతూ నాట్లు వేయడం ఇద్దరు కళ్లజోడులు పెట్టుకుని తిరుగుతు లాంటివి చేస్తూ హాల్ చల్ చేసారు ఇంకా బిగ్ బాస్ కి సంబంధించి ముచ్చట్లు పెట్టారు ఇంట్లో చేసిన పనులు గురించి కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకున్నారు,లాస్య బిగ్ బాస్ హౌస్ లో ఎవరు గెలుస్తారని అడిగితే గంగవ్వ తెలివిగా నాకు ఇంట్లో అందరు ఇష్టం ఎవరు గెలిచినా సంతోషం అని సమాధానం ఇచ్చింది,ఇక నేను బయటకి వచిన్నపుడు బాధ పడ్డవా అంటే నేను బాధపడలేదు ఉన్నంత కలం ఉన్నావు బయటకి వచ్చాక బాబు తో సంతషం గా ఉన్నావ్ గా అంటూ సరదాగా చెపింది, జరిగిన సంఘటనలు గురించి ఎవరు గెలుస్తారో ఇంకా గంగవ్వ అఖిల్ అంటే చాలా ఇష్టం దద్దతు తీసుకుంటాను అనడం అలాంటివి ముచ్చట్లు చేస్తా ఉన్నారు,అఖిల్ విన్నర్ అయితే చూడాలని కోరుకుంటుంది,ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.