ఇది ఆరంభం మాత్రమే అంటున్న మెగాస్టార్ సంతోషం లో జనసైనికులు

మెగా ఫామిలీ హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే, రాజకీయాలకు పనికి రారు అని నిన్న మొన్నటి వరుకు వినిపించిన వార్త, కానీ మెగా ఫామిలీ నుండి అసలైన రాజకీయం ప్రారంభం అయ్యింది అనేది నేడు వినిపిస్తున్న వార్త, సుమారు మూడు దశాబ్దాల తన సుదీర్ఘ సినీ రంగ ప్రస్థానం ని పక్కన పెట్టి,మెగాస్టార్ చిరంజీవి గతం లో ప్రజారాజ్యం పార్టీ ఎంత ఘనం గా లాంచ్ చేసాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అప్పట్లో చిరంజీవి రాజకీయా అరంగేంట్రం అధికార ప్రతిపక్ష పార్టీలకు వెన్నులో వణుకు పుట్టించేలా చేసింది,ఎన్ని కుట్రలు చేసిన 18 సీట్లు సాధించి 75 లక్షల ఓటు బ్యాంకుని సాధించింది ప్రజా రాజ్యం పార్టీ,ఆ తర్వాత కొన్ని వత్తిడుల కారణంగా ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసాడు చిరంజీవి,ఆ తర్వాత పాపం ఆయన ఎన్ని విమర్శలు ఎదురుకొన్న,ఈ కుళ్ళు రాజకీయాల్లో మనం తట్టుకోలేము అని రాజకేయాలకు దూరంగా ఉంటూ సంతోషం గా సినిమాలు చేసుకుంటున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కెరీర్ పీక్స్ స్టేజి లో ఉన్నప్పుడు జనసేన పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసాడు, తొలుత ఆయన టీడీపీ మరియు బీజేపీ పార్టీలకు మద్దతు పలికి 2014 వ సంవత్సరం లో ఆ కూటమి అధికారం లోకి రావడానికి ప్రధాన కారణం అయ్యాడు, ఆ తర్వాత 2019 వ సంవత్సరం లో ప్రత్యక్షం గా సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఘోరమైన పరాజయం ని చవి చూసిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా ఒక్కసారి పంచాయితీ ఎన్నికలలో జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉందొ పూర్తి విశ్లేషణలోకి వెళ్తే మొదటి ఫేస్ లో ఎవ్వరు ఊహించని విధంగా 250 కి పైగా పంచాయితీ స్థానాలు మరియు 18 శాతం ఓటు బ్యాంకుని సాధించిన జనసేన, రెండవ దశలోనూ అదే స్థాయి పంచాయితీ స్థానాలను సాధించి 22 శాతం ఓటు బ్యాంకు ని కైవసం చేసుకుంది,ఇక మూడవ దశలో అయితే ప్రతిపక్ష టీడీపీ పార్టీ కి చావు దెబ్బ కొట్టింది జనసేన, ముఖ్యంగా కృష్ణ జిల్లాలో అయితే తెలుగు దేశం పార్టీ కంటే ఎక్కువ స్థానాలను సొంతం చేసుకొని ఆ పార్టీ అధినాయకుడి కంటి మీద కునుకు లేకండా చేసింది, ఇక జరగబొయ్యే నాల్గవ దశలో ఎక్కువ శాతం గోదావరి జిల్లాల్లో ఎన్నికలు జరగబోతుండడం తో ఇక్కడ జనసేన కి మరోసారి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం, మరి నాల్గవ ఫేస్ లో కూడా జనసేన అదే స్థాయిలో రాణిస్తుందో లేదో చూడాలి.