బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన ఉప్పెన మొదటి వారం కలెక్షన్లు

ఇటీవల కాలం లో విడుదల కి యూత్ లో భారీ అంచనాలను నెలకొల్పి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించిన సినిమాలలో ఒక్కటి ఉప్పెన, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ సినిమాకి విడుదల కి ముందు ఈ స్థాయి హైప్ రావడానికి ముఖ్య కారణం దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన కారణం అని చెప్పొచ్చు, సినిమాలో కూడా ఆయన ఇచ్చిన సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు,ఇక సినిమాలో ఉన్న ప్రధానమైన ట్విస్ట్ విడుదలకి ముందే సోషల్ మీడియా లో లీక్ అవ్వడం, ఆ ట్విస్ట్ ని కళ్లారా థియేటర్స్ లో చూడడానికి ప్రేక్షకులు ఎంతో అత్యుత్సాహం చూపించారు అనే చెప్పాలి, దానికి తగ్గట్టు గానే మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి మొదటి రోజు వచ్చిన వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు, ఇప్పటికే వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ గురించి ఇప్పుడు ఈ విశ్లేషణ లో చూద్దాము.

మొదటి రోజు ఏకంగా ఈ సినిమా 9 కోట్ల 50 లక్షల రూపాయిలు షేర్ ని వసూలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, మీడియం రేంజ్ హీరోలలో ఈ స్థాయి కలెక్షన్లు అంటే మాములు విషయం కాదు,రెండవ రోజు 7 కోట్ల 30 లక్షల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం,మూడవ రోజు అయితే ఏకంగా 8 కోట్ల రూపాయిల 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఆల్ టైం టాప్ 5 మూడవ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో ఒక్కటిగా నిలిచింది,ఇలా అద్భుతమైన వీకెండ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, నాల్గవ రోజు నుండి కూడా అదే స్థాయి వసూళ్లను కనబరుస్తూ మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి మీడియం బడ్జెట్ సినిమాలలో ఆల్ టైం ఫస్ట్ వీక్ రికార్డు కలెక్షన్స్ సాధించిన చిత్రం గా చరిత్రకి ఎక్కింది, మాములుగా ఫిబ్రవరి సీజన్లో ని ఇండస్ట్రీ లో అన్ సీసన్ అని అందరూ అంటూ ఉంటారు, కానీ అలాంటి అన్ సీసన్ కూడా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ ముందుకి దూసుకుపోతుంది ఉప్పెన సినిమా.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నా , ఓవర్సీస్ లో మాత్రం రావట్లేదు అనే చెప్పాలి, అక్కడ థియేటర్స్ ఇంకా పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడం, మరియు కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పటికి తగ్గకపోవడం తో అక్కడి ప్రేక్షకులు థియేటర్స్ వైపు కదిలే సహాయం చెయ్యట్లేదు,ఒక్కపాటి ఓవర్సీస్ మార్కెట్ పరంగా అయితే ఉప్పెన సినిమా మొదటి వారం లోనే 50 కోట్ల రూపాయిలు వసూలు చేసేది అని, ఓవర్సీస్ మార్కెట్ సరిగా సహకరించకపోవడం తో 38 కోట్ల రూపాయిల వద్దే ఆగిపోయింది అని ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్త, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబొయ్యే పెద్ద సినిమాలు అయినా వకీల్ సాబ్ మరియు ఆచార్య సినిమాల పరిస్థితి ఏమిటి అని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు, కానీ ఇప్పటి వరుకు మేదియూ రేంజ్ హీరోల సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయి అని, పెద్ద హీరోల సినిమాలు విడుదల అయితే కచ్చితంగా ఓవర్సీస్ లో మంచి వసూళ్లు వస్తాయి ట్రేడ్ పండితుల నుండి వినిపిస్తున్న వార్త, మరి రాబొయ్యే వకీల్ సాబ్ సినిమాతో అయినా ఓవర్సీస్ మార్కెట్ పుంజుకుంటుందో లేదో చూడాలి.