ఉప్పెన మరియు జాతి రత్నాలు మూవీ మూడు రోజుల కలెక్షన్స్ మధ్య తేడా చూడండి

2021 వ సంవత్సరం తెలుగు చలన చిత్ర పరిశ్రమకి గోల్డెన్ ఇయర్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, క్రాక్ సినిమాతో ఘనంగా ప్రారంభం అయినా మన టాలీవుడ్ జైత్ర యాత్ర నేడు జాతి రత్నాలు సినిమా వరుకు కొనసాగుతూ ముందుకి దూసుకుపోతుంది,గత ఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలుగు సినీ పరిశ్రమ, 2021 వ సంవత్సరం లో వచ్చిన ఈ అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కానక వర్షం తో కళకళలాడిపోతుంది, ముఖ్యంగా సంక్రాంతి కానుకగా విడుదల అయినా క్రాక్ సినిమా 40 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ గ్రోస్సర్ నిలిచింది, ఇక ఆ సినిమా తో పాటు విడుదల అయినా తమిళ హీరో విజయ్ మాస్టర్ సినిమా అలాగే హీరో రామ్ నటించిన రెడ్ సినిమా మంచి విజయాలు సాదించాయి, ఇక డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న అల్లుడు అదుర్స్ సినిమా కి కూడా మంచి వసూళ్లు వచ్చాయి,దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మన తెలుగు ప్రేక్షకులు థియేటర్ లో సినిమాలు చూడడానికి ఎంతలా ఆసక్తి చూపిస్తున్నారు అనేది.

ఇక సినిమా ఇండస్ట్రీ కి అన్ సీసన్ గా భావించే ఫిబ్రవరి నెలలో విడుదల అయినా ఉప్పెన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మాస్ మహా రాజా రవితేజ క్రాక్ సినిమాని ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది,ఒక్క మీడియం బడ్జెట్ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు వస్తాయా అని టార్డ్ పండితులను సైతం ఆశ్యర్యానికి గురి చేసింది ఈ చిత్రం, ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిల షేర్ కి పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్ లో మాత్రం ఆశించిన స్థాయి లో వసూళ్లను రాబట్టడం లో విఫలం అయ్యింది,దానికి కారణం ఓవర్సీస్ మార్కెట్ డౌన్ అవ్వడం వల్లే అని అందరూ అనుకున్నారు, కానీ ఇటీవల నవీన్ పోలిశెట్టి హీరో గా నటించిన జాతి రత్నాలు సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో ప్రభంజనం సృష్టించింది అనే చెప్పొచ్చు, కేవలం మూడు రోజ్జుల్లోనే 5 లక్షల డాలర్స్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 1 మిలియన్ కొట్టే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా, కోవిద్ తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన ఏకైక ఇండియన్ చిత్రం ఘా జాతి రత్నాలు సరికొత్త రికార్డుని నెలకొల్పింది.

ఇక ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో కూడా జాతి రత్నాలు సినిమా అదే స్థాయి వసూలు రాబడుతూ కేవలం మూడు రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్ కి కాసుల కనక వర్షం కురిపించింది , కేవలం మూడు రోజుల్లోనే 12 కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని కేవలం మూడు రోజుల్లోనే రికవర్ చేసింది, ఇక ఉప్పెన సినిమా కూడా అంతే కేవలం మూడు రోజుల్లో 22 కోట్ల రూపాయిల వసూళ్లను సాధించి ప్రీ రిలీజ్ బిజినెస్ ని కేవలం మూడు రోజుల్లో రికవర్ చేసి సరికొత్త హిస్టరీ ని సృష్టించింది, ఇలా ఈ రెండు మీడియం బడ్జెట్ సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ కి కాసుల కనక వర్షం కురిపించి డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా కాలం తర్వాత కళ్ళు చెదిరే లాభాల్ని చూపించింది,ఇక జాతి రత్నాలు సినిమా ఫుల్ రన్ లో ఊపిన సినిమా కలెక్షన్స్ ని కూడా దాటేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి, మరి ఫుల్ రన్ లో జాతి రత్నాలు సినిమా ఎంత వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.