ఉప్పెన మూవీ క్లోసింగ్ కలెక్షన్లు ఎక్సక్లూసివ్ గా మీ కోసం

ఈ ఏడాది లో యూత్ లో ఒక్క సెన్సేషన్ సృష్టించి బాక్స్ ఆఫీస్ ఆఫీస్ వడ కాసుల కనక వర్షం కురిపించిన సినిమాలలో మనం ప్రధానం గా మాట్లాడుకోవాల్సింది ఉప్పెన సినిమా గురించి,సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ తేజ్ హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన ఈ సినిమా దేవి శ్రీప్రసాద్ అందించిన బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ వల్ల విడుదలకి ముందే అద్భుతమైన హైప్ ని సంపాదించుకుంది,అలా భారీ అంచనాలతో విడుదల అయినా ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని ట్రేడ్ పండితులు నోరెళ్లబెట్టే రేంజ్ ఓపెనింగ్స్ ని సాధించి మీడియం బ్యడ్జెట్ చిత్రాలలో ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా నిలిచింది, మొదటి రోజు దాదాపుగా 8 కోట్ల 50 లక్షల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం, రెండవ రోజు మూడవ రోజు కూడా కనివిని ఎరుగని వసూళ్లను రాబడుతూ సరికొత్త చరిత్ర సృష్టించింది, ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర కొనసాగించిన ఈ చిత్రం వసూళ్లు ఇప్పుడు క్లోసింగ్ కి వచ్చింది, ఇప్పటి వరుకు ఈ సినిమా ఎంత వసూలు చేసిందో ఏరియా వారీగా ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము.

ఈ చిత్రం ఒక్క ఓవబెర్సెల్స్ లో మినహా రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్క స్టార్ హీరో కి ఎలాంటి వసూళ్లు అయితే వస్తాయో , అలాంటి వసూళ్లను రాబట్టింది, ముఖ్యం మొదటి వరం లో 38 కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఈ సినిమా రెండవ వారం లో 10 కోట్ల రూపాయిలు వసూలు చేసింది, ఇక ఆ తర్వాత ఫుల్ రన్ లో మరో 5 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యగా, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 50 కోట్ల రూపాయిల వరుకు వసూలు చేసింది, ఇక ఏరియా వారీగా వసూలు వివరాల్లోకి వెళ్ళితే నైజాం ప్రాంతం లో 15 కోట్ల 50 లక్షల రూపాయిలు వసూలు చేసిన ఈ సినిమా, రాయలసీమ లో 8 కోట్లు ,ఉత్తరాంధ్ర లో 8 కోట్ల 70 లక్షల రూపాయిలు వసూలు చేసింది, ఇక ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది ఈస్ట్ గోదావరి జిల్లాలో 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం వెస్ట్ గోదావరి లో 3 కోట్ల కు పైగా వసూలు మొత్తానికి రెండు జిల్లాలో కలిపి 8 కోట్ల రూపాయలకు పైగానే వసూలు చేసి మీడియం బడ్జెట్ సినిమాలలో సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇక గుంటూరు జిల్లాలో మూడు కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రం, కృష్ణ జిల్లాలో కూడా అదే స్థాయి వసూళ్లను రాబట్టింది, ఇక నెల్లూరు జిల్లాలో అయితే ఈ సినిమా దాదాపుగా ఒక్క కోటి 80 లక్షల రూపాయిలు వసూలు చేసి అక్కడి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది, తెలుగు రాష్ట్రాలలో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం మన టాలీవుడ్ కి అతి పెద్ద మార్కెట్ అయినా ఓవర్సీస్ లో మాత్రం కేవలం ఒక్క కోటి రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది, అక్కడ కరోనా ప్రభావం ఎక్కువ ఉండడం వల్లే సరిగా ఆడలేదు అని అందరూ అనుకున్నారు, కానీ ఇటీవల విడుదల అయినా జాతి రత్నాలు సినిమా మాత్రం అక్కడ సెన్సేషన్ సృష్టించింది, కేవలం మూడు రోజుల్లోనే 5 లేఖల డాలర్స్ ని వసూలు చేసిన ఈ చిత్రం 1 మిలియన్ మార్క్ ని అందుకునే దిశగా పరుగులు తీస్తుంది, మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కలుపుకొని ఈ ఉప్పెన సినిమా ఇప్పటి వరుకు 52 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల అంచనా.