ఎన్టీఆర్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తరువాత డాక్టర్ల గురించి ఎం చెప్పారంటే !

మొదటి దశతో పొలిస్తే ఇపుడు కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాల పై విపరీతంగా చూపిస్తుంది దీనితో ఎంతోమంది మహమ్మారి బారిన పడుతున్నారు అదే సమయంలో ప్రాణాలను సైతం కోలుపోతున్నారు, ఇక ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమపై కోవిడ్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుంది తద్వారా చాలా మంది ఆర్టిస్టులు, టెక్నిషన్లకు, సినీ కార్మికులకు యూనిట్ లో చాలామందికి పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం కోవిడ్ బారిన పడ్డారు అయితే తాజాగా అతడు ఒక శుభవార్తను చెప్పారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలు చిన్న ఆర్టిస్ట్ లతో పాటు స్టార్ హీరోలు సైతం కరోనా బారిన పడిన విష్యం తెలిసిందే మొదటి దశలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య వంటి వాళ్ళు కోవిడ్ తో పోరాడి విజయం సాధించారు.

ఇక సెకండ్ వేవ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నివేత థామస్ లాంటి స్టార్లు ఈ మహమ్మారితో పోరాటం చేసి కోలుకున్నారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్టార్ హీరోలు ఒకొకరిగా కరోనా వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఈ క్రారంలోనే మే10వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ కి కూడా పాజిటివ్ అని తేలింది.ఈ మేరకు తన ట్విట్టర్ లో ” నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది నేను బాగానే ఉన్నాను దయచేసి మీరు ఎవ్వరు బాధ పడకండి నాటో కుటుంబ సభ్యులు కూడా ఎవరికి వారే ఐసొలేషన్ లో ఉన్నాము అని తెలిపారు ” జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కోసం అతని అభిమానులు ఎప్పటినుంచో ఏర్పాట్లు చేస్తూ వచ్చారు వాస్తవానికి నెల రోజుల నుండి ట్రెండ్ సృష్టించాలని వారంతా పుట్టిన రోజున సోషల్ మీడియా లో రచ్చ చేయాలని సిద్ధం అయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఎన్టీఆర్ కి కరోనా పాజిటివ్ అని తెలియడంతో అభిమానులు నిరాశగా ఉండిపోయారు.

కరోనా సోకినా తరువాత ఎన్టీఆర్ తన ఆరోగ్యం గురించి తరచూ అప్డేట్ ఇస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా అతడి ఆరోగ్యం గురించి మాట్లాడారు. ఈ విషయాన్ని స్వయం గా ట్వీట్ చేసారు అయినా అందులో ఏముంది అంటే తారక్ తో మాట్లాడాను అతడితో పాటు అతని కుటుంబ సభ్యులు అంత ఆరోగ్యం గానే ఉన్నారు, ఎవరు ఆందోళన చెందకండి అంటూ వెల్లడించారు పుట్టినరోజు సందర్బంగా అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసారు ఎన్టీఆర్ ఈ సందర్బంగా కరోనా నుంచి కోలుకుంటున్నాను అని రెండు, మూడు రోజులో నెగటివ్ రావచ్చు అని తెలిపారు అందుకు అనుగుణంగానే తాజాగా తారక్ కరోనా నుంచి కోలుకున్నారు, తాజాగా జరిపిన పరీక్షలో హీరో ఎన్టీఆర్ కి నెగటివ్ రిపోర్ట్స్ వచ్చాయి తననే స్వయంగా ప్రకటించారీ తనకి కరోనా నెగటివ్ వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వార వెల్లడించారు.

ఈ మేరకు ట్విట్టర్ లో ఈ విషయాన్ని చెబుతునందుకు సంతోషంగా ఉంది నాకు కరోనా నెగటివ్ వచ్చింది. ఈ సందర్బంగా నాకోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్న అలాగే నాకు చికిత్స చేసిన డాక్టర్లకు ,ల్యాబ్ కి సైతం థంక్ యు అంటూ అందులో పేరుకొన్నారు. కరోనా వైరస్ పై ఎలా పోరాడాలో చెబుతూ కోవిద్ 19 ని ప్రతి ఒక్కరు సీరియస్ గా తెసుకోవాల్సిన అవసరం ఉందని కానీ సానుకూల ధృవీకరణ తో పాటు సులువైన జాగ్రతలు తీసుకోవడం ద్వారా దాని అరికట్టవచ్చు మరి ముఖ్యంగా కరోనాతో చేసే పోరాటంలో మీ సంకల్పం ఏ అతిపెద్ద ఆయుధం అని గుర్తించాలి దైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించండి అంటూ చెప్పారు మన హీరో అయితే ఈ విష్యం గురించి అందరు నిజంగా ఎన్టీఆర్ చేపినట్టు తగిన జాగ్రత్తలు పాటిస్తే అందరు చాలా ఆరోగ్యం గా ఉంటారని ఫాన్స్ కూడా కోరుకుంటున్నారు.