ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలుసా ?

తెలుగు బుల్లితెర పై ఎన్నో రకాల షోలు వస్తుంటాయి పోతుంటాయి కానీ కొన్నిటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి బారి స్థాయిలో స్పందన వస్తుంది, అలాంటి వాటిలో మీలో ఎవరు కోటీశ్వరులు షో ఒక్కటి చాలా ఏళ్లగా హిందీ లో ప్రసారం అవుతున్న ” కౌన్ బనేగా క్రోరోపతి” అనే షో ఆధారంగా వచ్చిన ఈ షో కి తెలుగు లో కూడా మంచి ఆదరణ లభించింది, ఇక త్వరలోనే ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో మరో సీజన్లో ప్రారంభం కాబోతుంది ఈ షోని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు తాజాగా ఈ షో కి వచ్చే ఫస్ట్ గెస్ట్ వివరాలు బయటకి వచ్చాయి, సామాన్యులను కోటీశ్వరులు చేయాలనీ ఉదేశ్యం తో మొదలైన షో మీలో ఎవరు కోటీశ్వరుడు ఎన్నో అంచనాలు పెట్టుకుని వచ్చిన ఈ షో ఇప్పటికే నాలుగు సీసన్ లు విజయవంతంగా పూర్తీ చేసుకుంది, ఇందులో మూడు సీసన్స్ ని అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేసారు.

ఇక నాలుగోవ సీసన్ ని మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసారు ఇవ్వని ఒకదానికి మించి ఒకటి సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయి మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి విజయం సాధించిన నాలుగు సీసన్ లు పూర్తయిన తరువాత ఎందుకనో దీని ఆపేసారు మల్లి ప్రసారం చేయలేదు ఈ నేపథ్యం లో చాలా సంవత్సరాలు తరువాత ఈ షో ని మల్లి తీసుకొస్తున్నారు అయితే ఈసారి దీనికి ” ఎవరు మీలో కోటీశ్వరులు” అనే టైటిల్ మార్చారు అంటే కాదు ఈసారి ఈ షో ని స్టార్ మా లో కాకుండా జెమినీ టీవీ లో ప్రసారం చేయబోతున్నారు, ప్రేక్షకులు మెచ్చిన షో గా ప్రసారం కాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రోమో ని ఆ మధ్య విడుదల చేసారు మీ జీవితాలను మార్చే గేమ్ షో మీ ఆశలను నిజం చేసే గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధం గా ఉండండి అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ఆ తరువాత కోవిద్ సెకండ్ వేవ్ రావడం తో షో ని ప్రారంభించలేదు, ఈ షో ని గతం లో అక్కినేని నాగార్జున, చిరంజీవి నడిపించక ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడు ఇప్పటికే బిగ్ బాస్ సీసన్ 1 ని సక్సెసఫుల్ గా రాణించిన ఎన్టీఆర్ ఇపుడు ఎవరు మీలో కోటీశ్వరులు షో ని కూడా అదే రీతిలో నడిపేందుకు రెడీ అవుతున్నారు, పరిచయ ప్రోమో లో తన పేరు రామ రావు అని చెప్పి షో పై అంచనాలు పెంచేశారు ఎన్టీఆర్, ఇటీవలే షూట్ లో కూడా పాలుగోన్నారు కోవిద్ సమయం లో ఎవరు మీలో కోటీశ్వరులు షో కి సంబందించిన కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియను కొనసాగించారు ఈ క్రమంలోనే షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్ కూడా లుక్ టెస్ట్ లో పాలుగోన్నారు, ఇక త్వరలోనే పూర్తీ స్థాయిలో షో కోసం షూటింగ్ కి రాబోతున్నాడు. ఇక 15 ఎపిసోడ్ కి ఒకసారి షూట్ జరగనుంది.

ఇందుకోసం ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎవరు మీలో కోటీశ్వరులు షో ని వీలు అయినంత త్వరగా ఆగష్టు లో ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది అందుకే ఇప్పటికే షూటింగ్ తప్ప అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసారని సమాచారం ఇక ప్రస్తుతానికి ఈ షో కి ఎన్టీఆర్ డేట్స్ కూడా ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యం లో తాజాగా ఈ షో కి వచ్చే మొట్ట మొదటి గెస్ట్ గురించి వివరాలు బయటకి వచ్చాయి, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి గెస్ట్ గా రాబోతున్నారట దీనికి సంబందించిన షూటింగ్ ని కూడా ఈ 2 ,3 రోజులోనే జరగబోతుందని సమాచారం అంటే కాదు ఆ వెంటనే ఈ ప్రోమో ని విడుదల చేసి ఎవరు మీలో కోటీశ్వరులు షో ని గ్రాండ్ గా మొదలు పెడతారని టాక్ కూడా బాగా వినిపిస్తుంది.