ఎవరికి తెలియని సింగర్ యశస్వి లవ్ స్టోరీ..10 ఏళ్ల వయసు నుంచే జానుతో ప్రేమ !

గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం గారు 40,000 పైగా పాటలు పాడి తెలుగు పాటకు ఎన్నడూలేని కీర్తి తెస్కుకోచ్చాడు, ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎంతోమంది యువ గాయకులను చిత్ర పరిశ్రమకి అందించాడు బాలు గారు, పాడుతా తీయగా కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎన్నో టీవీ షోలు మన ముందుకి వచ్చాయి.ఈటీవీ నిర్వహించిన షో మాత్రమే అత్యధిక ప్రజాదరణ పొందింది.ఇపుడు జీ తెలుగు ఛానల్ లో వస్తున్న సరిగామప ది సింగింగ్ ఐకాన్ షో కూడా ఆ స్థాయి అంత ఆదరణ పొందుతుంది.ఈ షో కూడా ఎంతోమంది యువ గాయకులను ప్రేక్షకులకు అందిస్తుంది వాళ్ల అభిమానాన్ని పొందుతున్నారు యువ గాయకులు. ఇపుడు అందరికి యశస్వి కొండేపూడి అంతే ఫేవరేట్ గా నిలిచారు.

ఈ షో లో ముఖ్యం గా యశస్వి కొండేపూడి, అనన్య భాస్కర్, చైతన్య, పవన్, తేజ్, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతోమంది యువ గాయకులు ప్రేక్షకులను తమ గానం తో మైమరిపిస్తునారు వీరిలో ముఖ్యం గా యశస్వి కొండేపూడి అనే యువకుడు కొద్దీ రోజుల క్రితం శర్వానంద్ హీరో గా నటించిన జాను సినిమాలో లై అఫ్ రామ్ అనే పాట అతని ఓవర్నైట్ సెన్సేషన్ గా మార్చేసింది. ఎంతల అంతే ఇపుడు సంగీత ప్రియులు సినిమాలో పాడిన సింగర్ ప్రదీప్ కన్న ఇపుడు అందరు యశస్వి పాటనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఇపుడు ప్రతిచోట కాలర్ట్యూన్, రింగ్‌టోన్ లో కూడా పెట్టుకున్నారు. ఆ పాట ఇపుడు బాగా వైరల్ అవుతుంది.ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ కూడా సాధించి దూసుకుపోతుంది.

యశస్వి కొండేపూడి పాడిన పాట లైఫ్ అఫ్ రామ్ పాట విని అతని అభిమాని గా మారిన అమ్మాయి అదే షో లో అతనికి ప్రపోజ్ చేసింది, ఈపాట విన్న శర్వానంద్ యశస్వి ని మెచ్చుకుంటూ ట్వీట్ కూడా చేసారు దీనితో మరింత గుర్తింపు కూడా వచ్చింది. యశస్వి పాడిన మరో పాట పవన్ కళ్యాణ్ నటించిన త్వరలో రాబోతున్న వకీల్ సాబ్ సినిమాలో లో “మగువ మగువ” పాట అది చూసి అది ఒరిజినల్ పాడిన సీడ్ శ్రీరామ్ యశస్వి ని మెచ్చుకున్నాడు సాధారణంగా ఇలాంటి కంటెస్టెంట్స్ పాడిన పాటలని జడ్జెస్ మెచ్చుకోడం సహజం కానీ ఈ పాట ఒరిజినల్ సింగర్ మెచ్చుకోడం అనేది యశస్వి విషయంలోనే ప్రత్యేకం.

యశస్వి కొండేపూడి పుట్టి పెరిగింది కాకినాడ స్వగ్రామం లో అతనికి ముద్దుగా శాన్వి అని పిలుస్తారు,భాష్యం స్కూల్ లో చదుకువకున్నాడు, చదువులో లో ముందు ఉంటూ పాటలు పడటంలో కూడా బాగా పాడేవారు.అతని తండ్రి శేఖర్ తల్లి శ్రీదేవి చిన్న తనం నుంచి కీబోర్డ్ సంగీతం అంతే చాలా ఇంటరెస్ట్ తో ఇవ్వని నేర్చుకుంటూ పాటలు పాడటం నేర్చుకున్నాడు, ఇక తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉద్యోగం చేస్తూ ఉంటారు.ఒకసారి చిన్నతనంలో బాలు గారు పాట పడుతుంటే యశస్వి ఏ కీబోర్డ్ ప్లే చేసేవాడు. బాలు గారి చేతుల మీదగా అవార్డు తీసుకున్నాడు నీకు మంచి భవిషత్తు ఉంటుంది అని బాలు గారు ఆనాడే దీవించేసారు.ఇంకా యశస్వి కి డ్రైవింగ్ అంతే చాలా ఇష్టం.ముఖ్యం గా అతను ఆంధ్ర కాలేజీ లో మెడిసిన్ పూర్తిచేస్తునాడు ,వచ్చే ఏడాది డాక్టర్ గా అవనున్నారు, అతని చెల్లి కూడా డాక్టర్ చదువుతుంది.

యశస్వి వై.కే బ్యాండ్ అనేది స్టార్ట్ చేసి అనేక ఈవెంట్స్ చేస్తున్నారు వీళ్ల కుటుంబం, ఇంకా వాళ్ల చెల్లి కూడా సింగర్ గా ఇటు సంగీతం నేర్చుకుందిఆమె కూడా కొన్ని పాటలు పాడుతూ .ఇంకా 2009 శ్రీ ఝాన్సీ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు యశస్వి కాకినాడ లో వీళ్ల ఇద్దరు ఒకటే స్కూల్ లో చదువుతూ అక్కడ నుంచి వీరి మధ్య ప్రేమ మొదలైంది ఆమె కూడా పలు వెబ్ సిరీస్ ,షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.ఝాన్సీ సింగర్ అండ్ యాక్టర్ గా మంచి పేరు సంపాదించింది. ఝాన్సీ బిఫార్మ్ చదువుతుంది వచ్చే ఏడాది వీళ్ల ఇద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి.యశస్వి ని చేసుకోడం ఎంతో అదృష్టం అని చాలా మంది అంటున్నారు.