ఎవరు ఏమి అనుకున్న.. ఆ పిల్లతోనే వరుణ్ పెళ్లి చేస్తా

గత ఏడాది డిసెంబర్ నెలలో మెగా అభిమానులకు పండగ వాతావరణం ఏర్పడింది, మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారిక కొణిదెల పెళ్లిని ఎంత ఘనంగా జరిపాడో మనం అందరం చూసాము, మెగా ఫామిలీ కి సంబంధించిన హీరోలు అందరూ హాజరు అయినా ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన వీడియోలు మరియు ఫోటోలు ఇప్పటికి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి,మెగా ఫామిలీ మినహా టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు ఎవ్వరు ఈ వివాహానికి హాజరు కాకపోయినా కూడా ఇప్పటికి ఈ పెళ్లి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే అర్థం చేసుకోవచ్చు ఈ పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో, నిహారిక పెళ్లి అయినా వెంటనే వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేసేస్తాను అని నాగబాబు అప్పట్లో పలు ఇంటర్వూస్ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి, ఒక్కసారి ఆయన ఏమి మాట్లాడాడో ఇప్పుడు మనం చూద్దాము.

నాగబాబు మాట్లాడుతూ ‘నేను అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు నిహారిక కి పెళ్లి చేసిన తర్వాత నా జీవితం లో ఉన్న ప్రధాన బాధ్యత పూర్తి అయ్యింది, ఇప్పుడు వరుణ్ బాబు కి కూడా త్వరలోనే పెళ్లి చేసేస్తాను, వాడు వాడి సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు, ప్రస్తుత ఒప్పుకున్నా సినిమాలు అన్ని పూర్తి అయినా వెంటనే వరుణ్ పెళ్లి కూడా చేసేస్తాను, సంబంధాలు చూస్తున్నాము, తగిన మ్యాచ్ ఇంకా దొరకలేదు,ఈ ఏడాది లోనే వాడి పెళ్లి కూడా చేసేయాలి అని చూస్తున్నాము,ప్రేమ వివాహం అయినా నాకు పర్వాలేదు, వాడిని అర్థం చేసుకుంటూ జీవితాంతం సంతోషం గా ఉంటె అదే చాలు నాకు, నాకు తెలిసి ఇప్పటి వరుకు వాడు ఎలాంటి లోయ రేలషన్ షిప్ లో లేదు, ఒక్కవేల ఉంటే వాళ్ళిద్దరి పెళ్లి చెయ్యడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుండి వరుణ్ ఛాయస్ ఎప్పుడు బెస్ట్ గానే ఉంటుంది, వాడి లైఫ్ పార్టనర్ విషయం లో కూడా బెస్ట్ నిర్ణయం తీసుకుంటాడు అనే నమ్మకం నాకు చాలా గట్టిగ ఉంది’ అంటూ నాగబాబు ఈ సందర్భంగా స్పందించాడు.

ఇక టాలీవుడ్ లో వరుస విజయాలతో ముందుకి దూసుకుపోతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో కలిసి ఎఫ్ 3 సినిమా తో పాటు, బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఘని అనే సినిమా కూడా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇందులో ఎఫ్ 3 సినిమా ఈ ఏడాది ఆగస్టు నెలలో విడుదల కాబోతుండగా,ఘని సినిమా జులై 21 వ తేదీన విడుదల కాబోతుంది, ఈ రెండు సినిమాల్లో విక్టరీ వెంకటేష్ తో ఆయన చేస్తున్న ఎఫ్ 3 సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి, ఎందుకంటే 2019 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదల అయినా ఎఫ్ 2 సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా ఎఫ్ 2 సీక్వెల్ గా రాబోతుంది, ఇక బాక్సింగ్ నేపథ్యం లో రాబోతున్న ఘని సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి, ఈ సినిమా లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఒక్క కీలక పాత్ర పోషిస్తున్నాడు, మరి వరుస హిట్స్ తో ముందుకి దూసుకుపోనున్న వరుణ్ తేజ్ , రాబొయ్యే సినిమాలతో కూడా తన విజయ యాత్ర ని కొనసాగిస్తాడు లేదా అనేది చూడాలి.