ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రారంభ తేదీని ప్రకటించిన ఎన్టీఆర్ !

తెలుగు సినీ ఇండస్ట్రీ లో బడా హీరోలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరు అద్భుతమైన నటనతో అదిరిపోయే డాన్స్ తో పాటు డైలాగ్, ఫైట్స్ ఇలా అన్నిట్లోనూ రాణిస్తున్నాడు అల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్, ఈ క్రమంలోనే హోస్ట్ గా బుల్లితెర పై సైతం ఎంట్రీ ఇచ్చారు,అక్కడ కూడా తనదైన స్టైల్ యాంకరింగ్ తో అదరకొట్టాడు సుదీర్ఘ విరామం తరువాత ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో చేయబోతున్నాడు తాజాగా దీనికి సంబందించిన కీలక విషయాలు బయటకి వచ్చాయి, హిందీ లో చాలా కాలంగా కౌన్ బనేగా క్రోరోపతి అనే పేరుతో క్విజ్ గేమ్ తో ఒక షో ప్రసారం అవుతుంది దీనినే తెలుగు లో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే పేరుతో షో ప్రారంభించాడు ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ షో ఇప్పటికి నాలుగు సీసన్ లు విజయవంతంగా పూర్తిచేసుకుంది.

ఇందులో మొదటి 3 సీసన్ నాగార్జున, నాలుగో సీసన్ ని మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసారు. తెలుగు లో మీలో కోటీశ్వరుడు షో ఏంటో ఆదరణ దక్కించుకుంది అయినప్పటికీ నాలుగు సీసన్ లు పూర్తయిన తరువాత ఎందుకనో దీని మల్లి ప్రసారం చేయలేదు, ఈ మధ్య నే చాలా గ్యాప్ తరువాత ఈ షో ని తీసుకొస్తున్నారు అయితే ఈసారి దీనికి ఎవరు మీలో కోటీశ్వరులు అనే టైటిల్ మార్చారు అంటే కాదు ఈసారి ఈ షో జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది అనే విష్యం తెలిసిందే, ప్రేక్షకులు మెచ్చిన ఈ షో ప్రసారం కబోతున్న ప్రోమో ని ఆ మధ్య విడుదల చేసారు అందులో నిర్వాహకులు దీని ప్రస్థానం గురించి వివరణ ఇచ్చారు అంటే కాదు మీ జీవితాలని మార్చే గేమ్ షో మీ ఆశలు అన్ని నిజం చేసే గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు త్వరలో మీ జెమినీ టీవీ లో రాబోతుందని సిద్ధం గా ఉండండి అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రటించారు.

గతం లో అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి నడిపించిన ఈ షో ని ఇపుడు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడు గతంలో బిగ్ బాస్ షో ని సక్సెస్ చేసిన అతడు ఇపుడు ఎవరు మీలో కోటీశ్వరులు షోని కూడా అదే రీతిలో నడిపించేందుకు రెడీ అవుతున్నారు కొద్దీ రోజుల క్రితం విడుదలైన తారక్ పరిచయమైనా ప్రోమో లో తన పేరు రామారావు అని చెప్పి షో పై అంచనాలు పెంచేశారు ఎవరు మీలో కోటీశ్వరులు షో కి సంబందించిన ప్రోమో విడుదలయి చాలా కాలం అవుతుంది అయినప్పటికీ కరోనా కారణం ఈ షో ప్రసారం కావడం మాత్రం వీలు కాలేదు అదే సమయంలో ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు దీనితో ఎవరు మీలో కోటీశ్వరులు షో ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవు అనే టాక్ వినిపించింది దీనితో జెమినీ షో ఉంటుందని ఇటీవల ప్రకటించింది.

తాజాగా ఈ షో కి సంబందించిన కొన్ని వివరాలు బయటకి వచ్చాయి ఇప్పటికి ఈ షో కోసం నిర్వాహకులు ఆడిషన్స్ నిర్వించారు, ఇక వచ్చే వారం నుంచి షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం ఈ షెడ్యూల్ కి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నారు ఇందుకోసం ఇప్పటికే ఈ షో నిర్వాహుకులు డేట్స్ కూడా కేటాయించాడు అని తెలిసింది వచ్చే వారం నుంచి షో షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ ప్రసారం మాత్రం చాలా ఆలస్యం ఆయె అవకాశాలు ఉన్నట్లు ఒక న్యూస్ బయటకి వచ్చింది అయితే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ పై కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసిన తరువాత ఎడిటింగ్ పని ప్రారంభిస్తారు, ఆ తరువాత వీటిని ప్రసారం చేసి మల్లి తారక్ తో షూటింగ్ చేస్తారు మొత్తం గా ఇది ఆగష్టు నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయ్ అని తెలుస్తుంది ఈ షో కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.