ఏ హీరోయిన్ చేయలేని రికార్డు కాజల్ దక్కించుకుంది ఎం చేసిందో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీ లో తండ్రి కొడుకులుతో నటించిన హీరోయిన్లు చాలా అరుదుగా కనిపిస్తారు, బాలీవుడ్ లో అయితే ఇలాంటివి చాలా జరిగాయి కానీ టాలీవుడ్ చిత్రసీమలో చాలా అరుదైన ఫీట్ అనే చెప్పాలి.. ఈ జెనరేషన్ లో ఆ ఫీట్ అందుకోవడం చాలా కాస్త సాధ్యం కానీ టాలీవుడ్ లో చందమామ కాజల్ అగర్వాల్ మాత్రం ఈ ఫీట్ ని అందుకుంది అలా హీరోయిన్ గా రికార్డు కి ఎక్కింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడే లో కూడా నటించింది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి రి – ఎంట్రీ ఇచ్చిన ఖైదీ no .150 చిత్రంలో చిరంజీవి తో కూడా నటించి స్టెప్పులు వేసింది అదే సినిమాలో తండ్రి కొడుకులతో చిరంజీవి మరియు రామ్ చరణ్ తో కలిసి అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ పాటలో కాజల్ స్టెప్పులు వేసింది. తాజాగా ఇపుడు చుస్తే ఆచార్య సినిమాలో చిరంజీవి కి జోడి కట్టింది అయినా తనయుడు చెర్రీ సిద్ధ గా ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు.

ఇక ఫీట్ ని అయితే అందుకున్న భామగా కాజల్ అగర్వాల్ రికార్డు బ్రేక్ చేసింది, ఇక మరోవైపు చుస్తే అక్కినేని కుటుంబం లో అక్కినేని హీరో నాగచైతన్య తో దడ సినిమాలో నటించింది కాజల్ అగర్వాల్ తాజాగా నాగ చైతన్య తండ్రి నాగార్జున సినిమాలో కాజల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది దీనితో అక్కినేని ఫ్యామిలీ లో కూడా తండ్రి కొడుకులతో కలిసి నటించింది. మొత్తానికి ఈ జెనరేషన్ లో ఒకప్పటి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అక్కినేని నాగార్జున, నాగ చైతన్య వంటి తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ రికార్డు కొట్టింది. ఇక మరో హీరోయిన్ లావణ్య త్రిపార్టీ అక్కినేని నాగార్జున తో కలిసి సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో నటించింది అలానే నాగచైతన్య తో చుస్తే యుద్ధం శరణం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక తమన్నా ఈమె కూడా చిరంజీవి తో సైరా సినిమాలో పాత్రలో నటించింది. ఇక రామ్ చరణ్ తో కలిసి రచ్చ సినిమాలో కూడా నటించింది.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ రారండోయి వేడుక చూద్దాం సినిమాలో నాగ చైతన్య తో నటించింది అలానే అక్కినేని నాగార్జున తో మన్మధుడు 2 లో కూడా నటించింది. ఈ జెనరేషన్ లో నటించిన హీరోయిన్ ల లిస్ట్ లో కాజల్ అగర్వాల్ మాత్రం టాప్ పోసిషన్ లో ఉండనే చెప్పాలి అయితే ఒక్కపాటి టాప్ హీరోయిన్ శ్రీదేవి అందరి హీరోస్ తో నటించింది అయితే అక్కినేని నాగేశ్వర్ రావు గారి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అలానే అక్కినేని నాగార్జున తో హీరోయిన్ గా కూడా నటించింది. ఆర్తి అగర్వాల్ కూడా ఎన్టీఆర్ కుటుంబం తో నటించింది అటు బాలకృష్ణ తో పలనాటి బ్రహ్మనాయుడు అలానే జూనియర్ ఎన్టీఆర్ తో అల్లరి రాముడు లో నటించింది. నయనతార కూడా నందమూరి ఫ్యామిలీ తో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ తో నటించింది. హీరో వెంకటేష్ తో లక్ష్మి, తులసి, రాధ,బాబు బంగారం లో నటించింది ఇక రానా, బాలకృష్ణ, ఎన్టీఆర్ తో నటించింది.

ఒకప్పటి టాప్ హీరోయిన్ త్రిష బాలకృష్ణ తో లయన్ సినిమాలో నటించింది అలానే జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము సినిమాలో నటించింది. ఇక సమంత అత్తారింటికి దారేది, సన్ అఫ్ సత్యమూర్తి, ఈ రెండు సినిమాలకి దర్శకుడు త్రివిక్రమ్ అలానే రామ్ చరణ్ తో రంగస్థలం.. ఇక ఇలియానా జల్సా లో పవన్ కళ్యాణ్ తో నటించి అలానే అల్లు అర్జున్ తో జులాయి సినిమాలో నటించింది.ఇక అనుష్క అరుంధతి, బాహుబలి లో దేవసేన పాత్రలో అద్భుతమైన యాక్టింగ్ తో అదరకొట్టింది అయితే దగ్గుబాటి ఫ్యామిలీ వెంకటేష్ తో చింతకాయల రవి, నాగవల్లి అలానే రానా తో రుద్రమదేవి లో నటించి. శృతి హస్సన్ మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్ ,పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో నటించింది. జెనీలియా కూడా రానా తో నా ఇష్టం లో నటించింది అలానే వెంకటేష్ తో సుభాష్ చంద్రబోస్ లో నటించింది. ఇక ఛార్మి కూడా బాలకృష్ణ ,ఎన్టీఆర్ తో నటించింది. శ్రేయ కూడా బాలకృష్ణ ,ఎన్టీఆర్ తో నటించింది.