ఒకపుడు చిరంజీవితో నటించిన హీరోయిన్ కానీ ఇపుడు ఎలా ఉన్నారో తెలుసా?

మన టాలీవుడ్ లో కొన్ని కలయికలు చాలా విచిత్రంగా ఉంటాయి ఒకపుడు హీరో, హీరోయిన్లు గా నటించిన వాళ్ళు కొన్ని ఏళ్ల తరువాత అదే కాంబినేషన్ లో అన్న చెల్లెలు గా నటించడం, తల్లి కొడుకులుగా నటించడం మనం ఎన్నో చూసాం ఉదాహరణకి అలనాటి మహానటి శ్రీదేవి బాల నటిగా శ్రీ నందమూరి తారక రమవు గారికి బడిపంతులు అనే సినిమాలో మానవరాలిగా నటించింది, ఇక 10 ఏళ్ల తరువాత అదే శ్రీదేవి తో కలిసి దాదాపు 15 సినిమాలకు పైగా హీరోయిన్ గా నటించింది, ఇక ఎన్టీఆర్ మరియు సావిత్రి కాంబినేషన్ కి అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పకర్లేదు వీళ్ల ఇద్దరు దేవత అనే సినిమాలో అన్న చెల్లెలు గా నటించారు ఆ తరువాత వీళ్ల ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలో హీరో, హీరోయిన్స్ గా నటించారు. ఇలా చెప్పుకుంటూపొతే కృష్ణ, అక్కినేని నాగేశ్వర్ రావు, శోభన్ బాబు ఇలా అందరు ఇలాంటి ప్రయోగాలు చేసారు.

ఇక గత జనరేషన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇలాంటి ప్రయోగాలు చేసారు చిరంజీవి మరియు అలనాటి స్టార్ హీరోయిన్ సుజాత కలిసి ప్రేమతరంగాలు అనే సినిమాలో హీరో , హీరోయిన్లు గా నటించారు, ఆ తరువాత వీళ్ల ఇద్దరు కలిసి సీతాదేవి అనే సినిమాలో అన్న చెల్లెలు గా నటించారు.ఇక చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగిన తరువాత బారి అంచనాలు తో విడుదలైన బిగ్ బాస్ సినిమాలో మెగాస్టార్ కి తల్లికి గా నటించారు సుజాత గారు ఇక చిరంజీవి మరియు జయసుధ కలిసి అప్పట్లో మగధీరుడు, ఇది కథ కాదు మరియు ఆలయం శిఖరం వంటి సినిమాలో హీరో హీరోయిన్లు గా నటించారు ఇక వీళ్ల ఇద్దరు కొన్ని ఏళ్ల తరువాత రిక్షావాడు సినిమాలో ఇద్దరు తల్లి కొడుకులుగా నటించారు.ఇలా చెప్పుకుంటూ పొతే టాలీవుడ్ లో ఎన్నో కంబినేషన్స్ అప్పట్లో ప్రేక్షకుల మందికి వచ్చేవి అప్పట్లో నటీనటులు కేవలం పాత్రలనే చూసేవాళ్ళు.

నేటి జనరేషన్ మాత్రం హీరో, హీరోయిన్లు కానీ అలాంటి ప్రయోగాలు చేయడానికి సాహసం చెయ్యట్లేదు దానితో ఈ జనరేషన్ ఆడిషన్స్ కి అలాంటి కలయికలు చుస్తే అదృష్టం ఇప్పటివరకు కలగలేదు అనే చెప్పాలి, ఈ జనరేషన్ లో అలాంటి ప్రయోగాలు చేయాలంటే హీరో డ్యూయెల్ రోల్ చేస్తేనే సాధ్యం అవుతుంది. ఇక బ్లాక్ బస్టర్ హిట్ బాహుబలి సినిమాలో కూడా అనుష్క ప్రభాస్ కి తల్లిగా నటించింది కానీ ఆమె భర్త పాత్రకు కూడా ప్రభాస్ ఏ నటించారు అలా అయితేనే ఈ జనరేషన్ లో అలాంటి ప్రయోగాలు చేయగలరు అనే చెప్పచు అప్పట్లో పాత్ర నచ్చితే చాలా ముందు వెనక ఆలోచించకుండా నటించే వాళ్ళు యాక్టర్స్ వాటిని ప్రేక్షకులు కూడా ఆదరించేవారు కానీ ఇపుడు జనరేషన్ ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అనే భయం అటు నటీనటుల్లో మరియు ఇటు దర్శక నిర్మాతల్లో కూడా ఉంది.

ఉదాహారానికి మెగాస్టార్ చిరంజీవి మరియు విజయశాంతి కాంబినేషన్ అప్పట్లో ఎంత పెద్ద సంచలనం అనేది ప్రత్యేకంగా చెప్పకర్లేదు వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి దాదాపు గా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కానీ చిరంజీవి ఆచార్య సినిమా తరువాత చేయబోయే లూసిఫెర్ సినిమా రీమేక్ లో చిరంజీవి సోదరి పాత్రలో నటించడానికి ఆ చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నం చేయగా అందుకు విజయశాంతి సున్నితంగా తిరస్కరించారు, ఒకవేళ ఆమె ఒప్పుకుని ఈ సినిమా చేసి ఉంటె అలనాటి కాంబినేషన్ చూడటానికి ప్రేక్షకులు చాలా సంతోషపడేవారు. ఇక ఇపుడు జనరేషన్ లో హీరోలు డబల్ రొలెస్ చేయడం కామన్ అనే చెప్పాలి. ప్రస్తుతం చిరంజీవి గారు ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా కోసం మెగా ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.