కమిడియన్ బ్రహ్మానందం గారికి ఎన్ని కోట్లు అష్టి ఉందొ తెలిస్తే ఆశ్చర్యపోతారు !

సినిమాలో కమీడియాన్స్ కి చోటు ఉంటుంది కానీ బ్రహ్మానందం లేకపోతే ఆ సినిమాకి వెళ్లడం అనవసరం అనేంతగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న కమిడియన్ బ్రహ్మానందం ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు బ్రహ్మానందం తేరా పై కనిపిస్తే చాలు నవ్వుకునే ఆడియన్స్ చాలామంది ఉన్నారు అంతలా తన హాస్యం తో అందరిని నవ్విస్తూ స్టార్ కమిడియన్ అయ్యారు, తాజాగా జాతిరత్నాలు సినిమాతో మల్లి ప్రేక్షకులకు కనిపించారు, ఇతడిని బ్రహ్మి, జఫ్ఫా బ్రహ్మి అని కూడా పిలుస్తారు. 1956 సంవత్సరం ఫిబ్రవరి 1న కన్నెగంటి నాగలింగ చారి, లక్ష్మి నరసింహ దంపతులకు 7వ సంతానంగా జన్మించారు ఇపుడు ఆయనకి 65 ఏళ్ల వయసు. పడవ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. ఎం.ఏ తెలుగు చేసిన బ్రహ్మానందం పెద్దల ఆశీర్వాదంతో లక్ష్మి తో పెళ్లి అయ్యింది వీరికి రాజా గౌతమ్, సిద్ధార్ధ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

బ్రహ్మానందం తండ్రి నాటకాలు వేయడం వలన ఇతనికి కూడా నాటకాలు అంటే ఇష్టం ఉండేది స్నేహితుల ముందు కామెడీ చేసేవారు దూరదర్శన్ లో పక పక అనే ప్రోగ్రాంలో చేసారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన “ఆహా నా పెళ్ళంటా ” సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం ఆ సినిమాలో అరగుండు బ్రహ్మానందం పాత్రలో బాగా నటించాడు, 1987 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది, తొలి సినిమా తోనే మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు, ఈ సినిమాకి ఆరు వేల రూపాయలు రెమ్యూనిరేషన్ అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కి బ్రహ్మానందం క్యారెక్టర్లు నచ్చడం తో పసివాడి ప్రాణం సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. 1994 సంవత్సరంలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు, బెస్ట్ మేల్ కమిడియన్ గా బ్రహ్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ప్రస్తుతం కోట్లలో రెమ్యూనిరేషన్ అందుకుంటున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున బ్రహ్మానందం కి ఇష్టమైన హీరోలు, మహానటి సావిత్రి ఇష్టమైన హీరోయిన్ ఇక తన కొడుకు గౌతమ్ కూడా నటుడు పల్లకిలో పెల్లికుత్తురు, మను వంటి చిత్రాల్లో నటించాడు. ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు దానితో సినిమాలకి దూరం అయ్యాడు, ఆ తరువాత వివాహం చేసుకున్నాడు మరియు ఒక కుమారుడు ఉన్నాడు. 2019 లో ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో బ్రహ్మానందం విజయవంతంగా హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అతను ప్రస్తుతం గిన్నిస్ రికార్డ్‌ను సజీవ నటుడిగా అత్యధిక స్క్రీన్‌గా పేర్కొన్నాడు, ఇప్పటివరకు 1,000 కి పైగా చిత్రాలలో నటించాడు. 2009 లో భారతీయ సినిమాకు చేసిన కృషికి ఆయనను పద్మశ్రీతో సత్కరించారు. భారతదేశంలోని అత్యుత్తమ హాస్య నటులలో ఒకరిగా బ్రహ్మానందం పరిగణించబడ్డాడు ముఖ్యంగా అతని కామిక్ వ్యక్తీకరణలకు ప్రసిద్ది చెందారు.

భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన హాస్య నటులలో ఒకరైన బ్రహ్మానందం 6 రాష్ట్ర నంది అవార్డు, 1 ఫిల్మ్ ఫేర్ అవార్డు సౌత్, 6 సినిమా అవార్డు మరియు 3 సౌత్ ఇండినా ఇంటర్నేషనల్ మూవీ అవార్డులను పొందారు. 2009 సంవత్సరంలో భారత ప్రభుత్వం కళకు చేసిన కృషికి నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అనే బిరుదును బ్రహ్మానందానికి ప్రదానం చేసింది, అయినా నటించిన మన్మధుడు సినిమాకి బెస్ట్ కమిడియన్ గా ఫిలిం ఫేర్ అవార్డు గెల్చుకున్నాడు అలానే సజీవ నటుడిగా అత్యధిక స్క్రీన్ క్రెడిట్ పొందిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్. గెల్చుకున్నాడు బ్రహ్మానందం కి మూడు ఖరీదైన కార్లు ఉన్నాయ్ దాదాపు 350 కోట్లు ఉన్నాయ్ హైదరాబాద్ మణికొండలో పంచాయతీ ట్రావెల్స్ లో దాదాపు 7 కోట్ల విలువైన విల్లా లో ఉంటున్నాడు. దీని బట్టి ఆయనకి చాలా కోట్లలో ఆస్తులు ఉన్నాయ్ అని తెలుస్తుంది.