కాజల్ అగర్వాల్ హనీమూన్ పై నెటిజన్లు కామెంట్స్ అసలు నిజాలు బయట పెట్టిన కాజల్..

సౌత్ ఇండియా అందాలా తార చెందమామ కాజల్ అగర్వాల్ గత ఏడాది చివరిలో బిసినెస్ మెన్ గౌతమ్ కీచులు ని పెళ్లి చేసుకుంది వాళ్లిద్దరికీ సంబందించిన ఫోటోలు పెళ్లి ఫోటోలు , హనీమూన్ ఫోటో లు సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యాయి. మాల్దీవులు లో ఇద్దరు హానీమూన్ విశేషాలు సోషల్ మీడియా లో హాల్ చల్ చేసాయి. సముద్రం లోపల కూడా ఇద్దరి రొమాన్స్ అంత గ్రాండ్ గా హనీమూన్ చేసుకోడం పై నెటిజన్లు కూడా చాలా వరకు కామెంట్ చేసారు, ఈ మధ్య కాజల్ హనీమూన్ మీద సెపరేట్ గా ట్రోలింగ్ కూడా నడిచింది. కాజల్ పెళ్లి అక్టోబర్ 30న జరిగింది కానీ వాటికీ సంబంధించిన వార్తలు విశేషాలు మాత్రం వారం రోజులు వైరల్ అయ్యాయి.

నేషనల్ మీడియా సైతం కాజల్ పెళ్లి విశేషాలను లైవ్ లో అందించింది వారం రోజుల పాటు వీళ్ల ఇద్దరి పెళ్లి వార్తలు సాగాయి .. మన నటులు అందరు కూడా అన్‌లాక్ ప్రకటన తరువాత మాల్దీవులు కి వెళ్లారు అందులో భాగంగానే కాజల్ , గౌతమ్ కూడా తమ హనీమూన్ కి అక్కడ సెలెబ్రేట్ చేసుకున్నారు ఈ కొత్త జంట చేసిన రచ్చ కి సోషల్ మీడియా షేక్ అయిందనే చెప్పాలి.. మొత్తానికి కాజల్, గౌతమ్ కొత్త వ్యాపారిలోకి కూడా అడుగుపెట్టారు.. కాజల్ తన బ్రాండ్ విలువ తో కొత్త బిసినెస్ విస్తరించేలా ఉంది.. కొత్తగా కాజల్ అగర్వాల్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది.

లైవ్ లో ఎవరు ఎలాంటి ప్రశ్నలు అయిన అడగండి సమాధానం చెబుతా అని కాజల్ చెప్పింది.. అలా కాజల్ ఛాన్స్ ఇవ్వడం తో ఒక్కొక్కరు రకరకాల ప్రశ్నలు అడిగారు సినిమాలు వదిలేస్తావా , నీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరు, గౌతమ్ కిచ్లు గురించి చెప్పు , నీ ఫోన్ లో వాల్ పేపర్ ఏంటి ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగారు అభిమానులు ఇంకా మార్నింగ్ లేవగానే చేసే పనులు ఏంటి అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు కాజల్ అగర్వాల్ క్రేజీ సమాధానం ఇచ్చింది.. నా ఉదయ్యాని కృతజ్ఞత తో ప్రారంభిస్తాను పసుపు అల్లం తో కూడిన ఆపిల్ సీడ్ వెనిగర్ ని వేడి నీరు తో మంత్రాలను జెపిస్తాను , థ్రెడ్మీల్ మీద 30 నిమిషాలు వర్కౌట్ చేస్తాను.

ఇక కచ్చితంగా నా భర్తకు మాత్రం రోజు కౌగిలింత ఇస్తాను అంటూ సరదాగా కామెంట్ చేసింది.. మొత్తానికి కాజల్ చేసిన కామెంట్ గురించి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది నెటిజను అడిగిన ప్రశ్నకి కాజల్ అంటే క్రేజీ గా సమాధానం ఇచ్చింది అని అందరు అంటున్నారు.. ఇపుడు ఇద్దరు తమ వ్యాపారాలతో సినిమాలతో బిజీ గా ఉన్నారు. గౌతమ్ కూడా తన వ్యాపారంలో బిజీ అయిపోయారు ఇక సినీ ఇండస్ట్రీ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా కాజల్ కూడా నిర్మాణ సమస్త బాధ్యతలు చూసుకోబోతుంది అని టాక్ వస్తుంది. మొత్తానికి కాజల్ సినిమాలో బిజీ ఉంటూ మరో పక్క ఆమె భర్త తో నిర్మాణ రంగం లోకి రావాలని ప్లాన్ వేస్తుందని ఇటు బాలీవుడ్ మీడియా లో కూడా వార్తలు వస్తున్నాయి.