కెజిఫ్ 2 సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు అందుకుంది అసలు విష్యం ఏంటి?

టాలీవుడ్ లో కన్నడ రాక్ స్టార్ యష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన కెజిఫ్ చాప్టర్ 1 ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే సౌత్ ఇండియా ప్రేక్షకులనే కాదు భారత సినీ అభిమానులను అందరిని కూడా అక్కటుకుంది,ఈ సినిమా విభిన్నమైన కాన్సెప్ట్ తో మాస్ ఎలివేషన్స్ తో బారి సెట్టింగ్స్ ఇలా ప్రతి విష్యంలోను ఏ మాత్రం తగ్గకుండా సినిమాని తెరకు ఎక్కించారు పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు వర్షం కురిపించింది హీరో యాష్ కి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది త్వరలో ఈ సినిమాకి సీక్వెల్ కెజిఫ్ చాప్టర్ 2 కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇప్పటికే కెజిఫ్ 2 టీజర్ చూసి సినిమా పై అంచనాలు బాగా పెరిగాయి టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యింది ఈ రేంజ్ లో ఉంటె సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందని ప్రతి ఒక్కరు టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది అన్ని పరిస్థితిలో అనుకూలిస్తే ఈ ఏడాదికి జులై 16 న కెజిఫ్ 2 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది అయితే విడుదలకి ముందు ఈ సినిమా రికార్డుల సునామి క్రీయేట్ చేస్తుంది, ఇప్పటికే టీజర్ తో పలు రికార్డులు సాధించింది కెజిఫ్ 2 తాజాగా మరో అరుదైన రికార్డు సాధించింది ఈ సినిమా విడుదల కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనే విషయాన్ని ఒక ఆసక్తి విష్యం తాజాగా బయట పెట్టింది, ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాటుఫార్మ్ బుక్ మై షోలో ఈ సినిమాని చూసేందుకు దాదాపు 3 లక్షల మందికి పైగా జనం ఆసక్తి చూపిస్తున్నారు దీనితో గతంలో ఏ సినిమా సాధించని రికార్డు ని కెజిఫ్ 2 సాధించింది దీనిబట్టి చుస్తే ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందొ అర్ధం అవుతుంది. కెజిఫ్ చాప్టర్ 1ముగిసిన సందర్భం నుంచి రెండవ చాప్టర్ లో కథ ప్రారంభం అవుతుంది.

ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు సంజయ్ దుత్త విల్లన్ గా నటిస్తున్నాడు, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్,రావు రమేష్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.రవి బాసృర్ ఈ సినిమాకి సంగీతం వహిస్తున్నారు.కెజిఫ్ 1 సినిమాకి 250 కోట్లు దాక వాసులు చేసింది, ఇక కెజిఫ్ 2 ఎలా ఉండబోతుంది అని అందరు చాలా ఎదురు చూస్తున్నారు, ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన పూర్వీకుల నుండి సాంకేతిక నిపుణులను భువన్‌గౌడ సినిమాటోగ్రఫీని నిర్వహించాడు మరియు రవి బస్రూర్ సౌండ్‌ట్రాక్ మరియు చిత్ర నేపథ్యం కోసం సంగీతాన్ని చేసాడు. ఈ సినిమా 100 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ఖరీదైన కన్నడ చిత్రం కావడంతో ఇది 2021 జూలై 16 న కన్నడలో మరియు తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ భాషల డబ్బింగ్ వర్సిన్ లో థియేటర్ లో రిలీజ్ అవ్వబోతుంది.

యాష్ కెజిఫ్ 1 చాప్టర్ కి బెస్ట్ యాక్టర్ స్టైల్ ఐకాన్ అఫ్ సౌత్ ఇండియా గా సీమ అవార్డు మరియు ఫిలిం ఫేర్ అవార్డు గెల్చుకున్నారు. యాష్ 2017 లో తన భార్య రాధిక పండిట్‌తో కలిసి ఒక సంస్థను స్థాపించి దానికి యాషి మార్గ ఫౌండేషన్ అని పేరు పెట్టారు, ఇది సమాజ శ్రేయస్సు కోసం వారి సహకారాన్ని సూచిస్తుంది. మొదటి దశగా, కర్నాటకలోని కొప్పల్ జిల్లాలో నీటి సంక్షోభ సమస్యను ఫౌండేషన్ చేపట్టింది, సరస్సుల డీశాలినేషన్ కోసం 4 కోట్లు పెట్టుబడి పెట్టి, కరువు ప్రభావిత ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరిగింది.యాష్ ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ లో మోస్ట్ టాప్ రేటెడ్ హీరో గా నిలిచారు అందరికన్నా అత్యధిక పారితోషకం తీసుకుంటున్నారని ఫాన్స్ మరియు నెటిజన్లు అనుకుంటున్నారు ఇక కెజిఫ్ 2 సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి కెజిఫ్ 1ని మించి హిట్ అవుతుందా లేదో చూడాల్సిందే.