కొత్త రికార్డ్ సృష్టిస్తున్న కేజియఫ్ టీజర్ సీరియల్ యాక్టర్ నుండి నేషనల్ స్టార్ గా ఎదిగిన యాష్..

కన్నడ సినిమా కేజియఫ్ ని మొదట ఒక ప్రాంతీయ చిత్రం గా భావించారు అంతే కాదు పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. 2018 లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని ఎంతలా షాక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆ సినిమాలో పాటలు ఫైట్స్, డైలాగులు, ఒక రేంజ్ లో దూసుకుపోయాయి.. రి – రికార్డింగ్ అయితే ఇంకా అది మరో రేంజ్ ప్రజలు తెగ చూసారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో కన్నడ యువ హీరో యాష్ ప్రధాన పాత్ర ఇచ్చిన ఈ సినిమా ఇటు మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ని తెగ అక్కటుకుంది దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషలో అదిరిపోయే వాసులను సాధించింది అదే ఊపు మీద ఉంది చిత్ర బృందం..

ప్రస్తుతం కేజియఫ్ సినిమా కి సీక్వెల్ గా కేజియఫ్ 2 తెరకు ఎక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికి చాప్టర్ – 2 కి సంబంధించి ఫస్ట్ లుక్ కి విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా యాష్ పుట్టిన రోజు సందర్బంగా కేజియఫ్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజర్ కూడా మాములుగా హిట్ అవ్వలేదు.. ఈ టీజర్ లో డైలాగ్ , సీన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయ్ దీనితో కేజియఫ్ టీజర్ యూట్యూబ్ లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. విపరతిమైన లికెస్ కామెంట్స్ లు వస్తున్నాయి.. పక్క మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకు ఎక్కిస్తున్న పాన్ ఇండియా సినిమాను టీజర్ ను మేకర్స్ యాష్ పుట్టినరోజు సందర్బంగా ఒకరోజు ముందే రిలీజ్ చేసారు..

ఈ రోజు తన 35 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ టీజర్ ని నిన్న రాత్రి 9 గంటలకు విడుదల చేసింది చిత్రబృందం. కేవలం 79 నిమిషాల్లో 1 మిలియన్ లైక్ లతో ఏకంగా సెన్సషనల్ వరల్డ్ రికార్డు సెట్ చేసినట్టు సమాచారం.. 10 గంటల వివిధలోనే 15 మిలియన్ వ్యూస్ తో కేక పెట్టిస్తున్నారు టీజర్ మరోవైపు 1.8 మిలియన్ లైక్స్ తో మరో సెన్సషనల్ రికార్డును టీజర్ మరోసారి తన కాటాలో వేసుకుంది. కేజియఫ్ టీజర్ ఏ ఇలా ఉంటె ట్రైలర్ ఏలా ఉంటుందో అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.. యాష్ పర్సనల్ విషయానికి వస్తే యాష్ అసలీ పేరు నవీన్ కుమార్ గౌడ తన తండ్రి అరుణ్ కుమార్ కేఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లో మరియు తర్వాత బీఎంటీసీ లో పని చేసారు.. సినిమాలో రాకముందు సీరియల్ లో నటించారు.

యాష్ సినిమాలో రాకముందు ఈటీవీ కన్నడ లో ప్రసారం అయిన “నంద గోకుల” సీరియల్ తో పాటు అనేక టీవీ సీరియల్ లో కనిపించదు.. 2008 లో శశాంక్ దర్శకత్వం వహించిన మొగ్గిన మనసులో లో నటించాడు అక్కడ అతను నంద గోకుల సహాయనటుడు రాధికా పండిట్ తో కలిసి సహాయ పాత్రలో నటించాడు.ఈ చిత్రం తనకి ఫిలింఫేర్ అవార్డు ని గెలిచాడు.. ఆ తరువాత చాలా సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందారు చాలా నేషనల్ అవార్డు లు పొందారు హీరోయిన్ రాధికా పండిట్ ని ప్రేమించి వివాహం చేసుకున్నారు.. ఇపుడు ఇద్దరు టాప్ రేటెడ్ సెలబ్రిటీ లిస్ట్ లో ఉన్నారు వీళ్ల ఇద్దరికీ చాలా క్రేజ్ ఉండనే చెప్పచు…

ఇండియా లోనే ఏ సినిమాకు ఇవ్వని రేంజ్ రెస్పాన్స్ ఇపుడు కేజియఫ్ చాప్టర్ 2 కి వచ్చింది.. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల విషయానికి వస్తే యాష్ తో పాటు మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అదిరా లుక్ లో అదరకొడుతున్నాడు, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా శక్తివంతమైన మహిళా గా కనిపించబోతుంది. హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి రవి బసరుర్ సంగీతం అందించారు ఈ సినిమా రిలీజ్ కోసం ఫాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు