కోరిక తీర్చడం కోసం దేవుడిగా మారనున్న స్టైలిష్ స్టార్

మరోసారి ‘గెస్ట్’ గా రాబోతున్న అల్లు అర్జున్
జులాయిలో నవ్వులు పండిస్తూ సీరియస్ యాక్షన్ చేయాలన్నా, అలా వైకుంఠపురంలో వెరైటీ యాక్షన్ తో ఆకట్టుకోవాలన్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కే సొంతం. సినిమాల్లోకి ఎంటరైనప్పటి నుంచీ ఎప్పటికప్పుడు తన నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ ఎదిగిన కష్టఫలి బన్నీ. వివిధ రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు. రుద్రమదేవిలో గెస్ట్ రోల్ లోనూ ఎంతగానో ఆకట్టుకున్న బన్నీ ఇప్పుడు మరోసారి అతిథిగా కనిపించనున్నారు.
అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా విజయ్ సేతుపతి ముఖ్యపాత్రలో నటించిన ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్‌లో అల్లు అర్జున్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారని ఫిల్మినగర్ టాక్‌. విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించే ఈ తెలుగు రీమేక్‌ను పీవీపీ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మించనున్నాయి. తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్. విజయ్‌ సేతుపతి దేవుడి పాత్ర చేశారు. తెలుగులో ఆ పాత్రను అల్లు అర్జున్‌ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ‘రేసు గుర్రం’లో అల్లు అర్జున్‌ ‘దేవుడా..’ అంటూ అదో రకమైన స్టయిల్‌లో చెప్పడం అందర్నీ ఆకట్టుకుంది. ఆ సినిమాలో బన్నీ ఎన్నో సన్నివేశాల్లో దేవుడా.. అంటూ దేవుడ్ని తలచుకున్నాడు. అందుకేనేమో దేవుడు వేషం వరించిందనే టాక్ వినిపిస్తుంది. అంతేకాదు, గోపాలా గోపాలా సినిమాలో దేవుడు వేషంలో పవన్ కళ్యాణ్ కనిపించి, అందరినీ మురిపించారు. మరి, ఇప్పుడు ఈ రీమేక్‌లో అల్లు అర్జున్‌ కూడా అంతే మురిపిస్తారా? అనేది వేచి చూడాలి.