క్వారంటైన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా ఉన్నదో చూడండి

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత వెండితెర మీద దర్శనం ఇచ్చిన పవన్ కళ్యాణ్ కి తెలుగు ప్రజలు కరోనా వణికిస్తున్న సమయం లో కూడా అడుగడుగునా నీరాజనాలు పలికారు,ఒక్క పక్క కరోనా మహమ్మారి విజృంబం ని తట్టుకొని మంచిగా రన్ అవుతున్న ఈ సినిమాకి, మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రోజుకో అడ్డంకి పెడుతూ పవన్ కళ్యాణ్ ని మరియు వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్స్ ని ఎంతలా ఇబ్బంది పెట్టాలని చూసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ప్రభుత్వం ఎన్ని విధాలుగా అడ్డంకులు పెట్టాలని చూసిన అరా చేతితో సూర్యుడిని ఆపేలేము అని పెద్దలు చెప్పిన శ్లోకం ని గుర్తు చేస్తూ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చేస్తున్న విద్వంసం గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది.

ఇక వకీల్ సాబ్ సినిమా హిట్ అవ్వడం తో మంచి ఊపు మీద ఉన్న అభిమానులకు ఇటీవల వచ్చిన ఒక్క వార్త అభిమానులందరినీ షాక్ కి గురి చేసింది, ఇక అసలు విషయం లోకి వెళ్ళితే , పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో పని చేసే కొంతమందికి ఇటీవలే కరోనా పాజిటివ్ అని తేలడం తో తమ అభిమాన హీరో కి కూడా పాజిటివ్ వచ్చింది ఏమో అని అందరూ ఆందోళనకు గురి అయ్యారు, కానీ పవన్ కళ్యాణ్ కి కరోనా టెస్ట్ చెయ్యగా ఫలితం ఫలితం నెగటివ్ వచ్చింది అని, అభిమానులు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు అని, పవన్ కళ్యాణ్ గారు ముందు జాగ్రత్తగా హోమ్ క్వారంటైన్ అయ్యారు అని జనసేన పార్టీ నాయకులూ ఈ సందర్భంగా తెలిపారు,ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎవ్వరిని కలవడం లేదు అని, తన జనసేన పార్టీ కార్యక్రమాలు అన్ని కూడా రద్దు చేసుకున్నారు అని, త్వరలోనే జరగబొయ్యే నాయుడుపేట బహిరంగ సభ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోవడం లేదు అని ఈ సందర్భంగా జనసేన నాయకులూ తెలిపారు.

ఇక ఈ చిత్రం వసూళ్ల విషయానికి వస్తే మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా బెన్ఫిట్ షోలను అకస్మాత్తుగా క్యాన్సిల్ చేయించి , 2012 మరియు 2013 లో కొనసాగిన టికెట్ రేట్స్ ని అమలు చెయ్యాలి అని అప్పటికి అప్పుడు ఆదేశాలు జారీ చేసిన కూడా మొదటి రోజు ఈ సినిమా 32 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ ఏందో, ఆయన మీద జనాలకి ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలిసేలా చేసాడు, ఇక మొదటి రోజు హై కోర్టు నుండి మూడు రోజుల వరుకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు అని అధికారికంగా ఆదేశాలు కూద జారీ చేసింది, కానీ అక్కడ కూడా తగ్గని ప్రభుత్వం హై కోర్ట్ లో మరోసారి పిటిషన్ వేసింది,సినిమా నడుస్తున్న ప్రతి చోట థియేటర్ యాజమాన్యాల పై అధికార పార్టీ లీడర్స్ తీవ్రమైన వత్తిడిని పెట్టడం ప్రారంభించారు, అన్ని ఇబ్బందులు పెట్టిన కూడా రెండవ రోజు ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.

ఇప్పటి వరుకు బాహుబలి పార్ట్ 2 తప్ప మన తెలుగు లో ఒక్క సినిమా కూడా రెండవ రోజు ఈ స్థాయి వసూళ్లను రాబట్టలేదు,మూడవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లను రాబట్టి కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా 64 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి సరికొత్త చరిత్ర కి శ్రీకారం చుట్టింది, ఇక మొదటి సోమవారం కోడోత్ మంచి వసూళ్లను రాబట్టి 100 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యబోతున్న తోలి పవన్ కళ్యాణ్ సినిమాగా నిలవబోతుంది వకీల్ సాబ్,మరి రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.