చాందిని చౌదరిని మోసం చేసి సినిమాలకి దూరం చేసాడు ఆ నిర్మాత ఎవరో తెలుసా ?

ప్రతి రంగం లో మంచి ఎంత ఉంటుందో చేదు అంటే ఉంటుంది చూసేవారి దృష్టిని బట్టి నడిచేవారు బాటను అనుసరించి అవి నిర్ణయించబడతాయి.. ఇక గ్లామర్ క్రేజీకు కేర్ఆఫ్ అయిన సినీ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కొంతమంది సినిమా పేరులు చెప్పి చాలా మంది అమాయకులను మోసం చేస్తుంటారు.. అలా మోసపోయిన వారిలో నేను ఒకదాన్ని అంటుంది హీరోయిన్ చాందిని చౌదరి , 2015 లో చేసిన కేటుగాడు, మను వంటి సినిమాలో నటించిన ఈ బామ్మా కి అనుకున్నంత గుర్తింపు దక్కలేదు.. ఇటీవలే ఆహా ప్లాటుఫార్మ్ ద్వారా రిలీజ్ అయిన కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది..ఆ సినిమాలో తాను చేసిన నటనకు చాలా ప్రసంశలు వచ్చాయి..

ఇపుడు మంచి అవకాశాలను అందుకుంటుంది. అయితే కెరీర్ ప్రారంభం లో చాందిని ని ఒక నిర్మాత చాలా ఇబ్బంది పెట్టారట ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని తెలియ చేసింది .. చాందిని ఆ నిర్మాత పేరు చెప్పలేదు కానీ అయిన సినిమాలో నటించేటప్పుడు మరో సినిమాలో నటించకూడదు అని అగ్రిమెంట్ మీద సైన్ చేపించారట అయితే ఆ సినిమా చేయడానికి చాలా సమయమే పట్టింది ఏకంగా 3 ఏళ్ల సమయం పట్టింది.. అగ్రిమెంట్ మీద సైన్ పెట్టాక చాందిని సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది..ఈ సినిమా చేయడానికి ఎలాగో సమయం పడుతుంది మరో సినిమా చేసుకుంటాను అని చాందిని చేపినప్పటికీ ఒప్పుకోలేదట. ఈ విష్యం లో చాలా గొడవలు అయ్యాయి చివరకు ఇక చేసేది ఏమి లేక 3 ఏళ్ల వరకు చాలా ఇబ్బందులు పడింది వచ్చిన అవకాశాలు వదులుకున్నారని చెప్పింది ..

చాందిని కి యాక్టింగ్ అంటే ఇంటరెస్ట్ తో ముంబై లో కోర్స్ నేర్చుకుని షార్ట్ ఫిలిమ్స్ లో నటించేది.. ఎమ్. అర్ ప్రొడక్షన్ లో ది వీక్ అనే షార్ట్ ఫిలిం లో నటించింది అలా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది.. ఆ తరువాత రాజ్ తరుణ్ తో కలిసి ప్రేమ ప్రేమ, ట్రూ లవ్, ది బ్లైండ్ డేట్, లవ్ అటు ఫస్ట్ సైట్ వంటి షార్ట్ ఫిలిమ్స్ చేసి చాలా ఫేమస్ అయింది వీళ్ల ఇద్దరు కలిసి నటించిన ది బ్లైండ్ డేట్ ఎంతో సక్సెస్ అయింది. ఆ తరువాత మధురం సాంబార్ ఇడ్లీ , లక్కీ ,రోమియో జూలియట్, ఇలా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది .. ఆ తరువాత సినిమాలో ఛాన్స్ కోటేసింది.. 2012 లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, లో నటించింది, మధురం షార్ట్ ఫిలిం లో చాందిని నటన చూసి డైరెక్టర్స్ కే. రాఘవేంద్ర రావు గారు కుందనపు బొమ్మ అనే సినిమాలో లీడ్ రోల్ లో ఛాన్స్ ఇచ్చారు..

కేటుగాడు సినిమాతో ఇండస్ట్రీ కి గుర్తింపు వచ్చింది.. మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో ఒక చిన్న రోల్ లో నటించింది.అలా చిన్న పాత్రలో చేస్తూ పెద్ద సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రోల్ లో శమంతకమణి, లై సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది, హోరా బ్రిడ్జి, మను , కలర్ ఫోటో ద్వారా ఫేమస్ అయింది.. ఈ సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది.. చాందిని చౌదరి కొన్ని వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేసింది.. జీ 5 లో గాడ్స్ అఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్ చేసింది.. ఇటీవలే ఆహా ప్లాటుఫార్మ్ లో మస్తీ అనే వెబ్ సిరీస్ లో నటించింది.ఈ కావురిఫొటో సినిమా లో చేసిన నటన వల్ల తనకి మంచి ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి అని తనకి మంచి ఫ్యూచర్ ఉంటుందని ఫాన్స్ కోరుకుంటున్నారు..