చిరంజీవి అలా పిలుస్తే ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారు కోపడ్డారు అంటూ ఎమోషనల్ అయినా చిరు !

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారి 75 వ జయంతి సందర్బంగా పలువురి సినీ ప్రముఖులు బాలసుబ్రమణ్యం గారితో ఉన్న అనుభందాని గుర్తుచేసుకుంటూ కన్నీటి నివాళి అర్పిస్తున్నారు బాలసుబ్రమణ్యం గారి జయంతి సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ఎమోషనల్ వీడియో ని సోషల్ మీడియా లో షేర్ చేసారు అందులో బాలసుబ్రమణ్యం గారితో ఆయనకి ఉన్న అనుభందాని తెలుపుతూ ఒక సంఘటను వివరించారు ఒక సందర్భంలో నేను ఎస్.పి.బాలు గారు అని సంబోధిస్తే అయినా ఏంటో బాధపడ్డారు ఎప్పుడు అన్నయ అని అనేవాడివి ఇవాళ బాలు గారు అంటూ మర్యాదగా పిలిచి నన్ను దూరం చేస్తున్నావా అంటూ కోపం ప్రదర్శించేవారు మీ ఔన్నత్యం తెలిసాక మీలాంటివారిని ఏకవచనంతో సంబోదించడటం సరికాదు అనుకుంటున్నాను అని చెప్పడంతో అలా పిలిచి నన్ను దూరం చేయకు అయ్యా అన్నారు.

ఇవాళ మనందరికీ అన్యాయం చేసి అయినా దూరం అయ్యారు అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు అంటే కాదు ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారి సోదరి ఎస్.పి.వసంత ఆలపించిన ఒక పాటని కూడా పొందుపర్చారు, మనందరినీ శోక సముద్రంలో ముంచి ఇంట త్వరగా విడి వెళ్లిన ఆ గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారికి కన్నీటి నివాళి అంటూ చిరంజీవి ట్వీట్ చేసారు దాదాపు 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో తిరుగులేని గాయకుడిగా వెలుగు పొందాడు గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారు అద్భుతమైన గాత్రంతో ఎన్నో ఏళ్ల పాటు సంగీత ప్రియులను అలరించిన అయినా సుమారు 40,000 పైగా పాటలను పాడారు ఒకటి కాదు రెండు కాదు దేశంలోని ఎన్నో భాషలో అయినా గొంతుని వినిపించాడు, ఈ క్రమంలోనే ఎన్నో మెయిలు రాళ్లను చేరుకోవడం తో పాటు ఎన్నో అవార్డు లు, రికార్డులను సొంతం చేసుకున్నారు.

ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారు 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కొనేటమ్మ పిటా గ్రామంలో సమమూర్తి, శాకుంతల అమ్మ దంపతులకు జన్మించారు ఈయనకి నలుగురు చెల్లెలు అందులో గాయని ఎస్.పి.శైలజ, ఎస్.పి. వసంత కూడా తెలుగు వాళ్ళకి పరిచయం ఉన్నవాళ్లే ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారి వివాహం సావిత్రి తో జరిగింది ఆయనకి పల్లవి, ఎస్.పి. చరణ్ పిల్లలు ఉన్నారు. 1966 సంవత్సరంలో శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు ఆరంభంలోనే ఎంతగానో అక్కటుకున్న మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ ఇతర భాషలో వెలది పాటలు పాడారు సింగర్ గా కొన్ని వేల పాటలు పాడిన ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను మంచి గుర్తింపు అందుకున్నారు మన్మధ లీలై చిత్రంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటారు.

సుదీర్ఘమైన ప్రయాణంలో కమల హస్సన్,రజనీకాంత్, విషువర్ధన్, సల్మాన్ ఖాన్, అనిల్ కుమార్, గిరీష్ కర్నాధ్, జెమినీ గణేషన్, అర్జున్ సర్జ, రాఘవన్ వంటి నటులకు డబ్బింగ్ చెప్పారు. 1969లో వచ్చిన పెళ్లంటే నూరేళ్ల పంట అనే చిత్రం ద్వారా ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారు నటుడిగా తన ప్రస్థానాన్ని కూడా ప్రారంభించారు. ఆ తరువాత ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలను పోషించాడు,ఈ క్రమంలోనే పలుమార్లు ఉత్తమ సహాయ నటుడిగా నిలిచాడు. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో గొప్ప గొప్ప పాత్రలను చేసారు చివరిగా అయినా దేవదాస్ చిత్రం లో నటించారు మంచి టాలెంట్ ఉంది అవకాశాలు దొరకిన ఎంతోమందికి మార్గాన్ని ఇవ్వాలనే అనే లక్ష్యం లో బుల్లితెర పై పలు పాటల కార్యక్రమాలు సైతం ప్రారంభించారు ఎస్.పి. బాలు గారు. ఈ క్రమంలోనే తన శిషులుగా ఎంతోమందిని తయారు చేసి సినీ పరిశ్రమకు అందించారు.