చిరంజీవి అల్లుడు గురించి తన కుటుంబం గురించి మనకి తెలియని విషయాలు ?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పకర్లేదు, ఈ ఫ్యామిలీ నుండి అడుగుపెట్టిన ప్రతి హీరో ఇపుడు టాప్ పోసిషన్ లో ఉన్నవారే మరో మెగా ఫ్యామిలీ తో సమానమైన క్రేజ్ ఉన్న నందమూరి మరియు అక్కినేని ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలు గా ఇండస్ట్రీ కి వచ్చిన మెగా ఫ్యామిలీ హీరోల రేంజ్ కి ఎదిగిన వాళ్ళు ఒక్కరు ఇద్దరు మినహా ఎవరు లేరనే చెప్పాలి, నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ తరువాత ఆ ఫ్యామిలీ నుండి ఎంతమంది హీరోలు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఎవరు ఇండస్ట్రీ లో పెద్దగా సక్సెస్ కాలేక పోయారు,ఇక అక్కినేని ఫ్యామిలీ లో అయితే నాగేశ్వర్ రావు మరియు నాగార్జున తరువాత అక్కినేని నాగచైతన్య ఒక్కడే సక్సెస్ అయ్యాడు చిన్న కొడుకు అఖిల్ సక్సెస్ కాలేదు అప్పట్లో సుమంత్ నటించిన కొన్ని సినిమాలు ఒకటి రెండు హిట్ కొట్టిన దానిని కంటిన్యూ చేయలేక మధ్యలో వెళ్ళిపోయాడు.

మెగా ఫ్యామిలీ లో చిరంజీవి నుండి అల్లు అర్జున్ వరకు సాయి ధరమ్ తేజ్ నుండి వరుణ్ తేజ్ వరకు ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు. ఇక ఒక్క అల్లు శిరీష్ మినహా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి ఒక్క హీరో సక్సెస్ అయ్యారు అయితే ఇటీవల చిరంజీవి 2వ కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కూడా ఇటీవలే సినీ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి మనకి తెలిసిందే అయినా హీరోగా పరిచయం అయినా విజేత సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయిన విమర్శకుల ప్రసంశలు మాత్రం అందుకున్నాడు, ఇపుడు రెండవ సినిమాగా సూపర్ మచి అనే సినిమాని చేస్తున్నాడు, ఈ సినిమా ద్వారా పులివాసు అనే దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు, ప్రస్తుతం ఈ షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది కళ్యాణ్ దేవ్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు,ఇపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి.

కళ్యాణ్ దేవ్ శ్రీజ కి చిన్నపాటి బాల్య స్నేహితుడు ఆమె బాల్య స్నేహితుడే తనకి భర్త అవుతారని ఆమె కలలో కూడా ఉహించి ఉండదు అనే చెప్పాలి. చిత్తూర్ జిల్లాకి చెందిన కళ్యాణ్ దేవ్ తల్లిదండ్రులు పేరులు జ్యోతి కానుగంటి మరియు కిషన్ కానుగంటి ఈయన దేశ విదేశాల్లో ఎన్నో వ్యాపారాలు చేసి వందల కోట్లు రూపాయల అష్టులు సంపాదించి తెలుగు రాష్ట్రలో అత్యంత ధనవంతులైన వారిలో ఒక్కరిగా కొనసాగుతున్నారు, ఒక చిత్తూర్ జిల్లాలో వీరికి చాలా ఫ్యాక్టరీ లు ఉన్నాయ్ కూర్చుని తిన్న తరగని అష్టులు ఉన్న కూడా కళ్యాణ్ దేవ్ తన కష్టాన్ని నమ్ముకుని విదేశాల్లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ లో ఉద్యోగం చేసాడు. ఇక చిరంజీవి కూతురు శ్రీజ అప్పట్లో ప్రేమ వివాహం చేసుకుని ఆ తరువాత వాలా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారని తెలుసుకున్న ఆమె బాల్య మిత్రుడు కళ్యాణ్ దేవ్ శ్రీజ ని ఇష్టపడి పెళ్ళిచేసుకుని ఆమెకు తన కూతురు నివ్రితికి కొత్త జీవితం ఇవ్వాలని అనుకున్నారు.

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అల్లుడు అయి మెగా ఫ్యామిలీ లో ఒక్కరు అయ్యారు కళ్యాణ్ దేవ్ కి ఒక చెల్లి ఐశ్వర్య ఉన్నారు. కళ్యాణ్ దేవ్ సినిమాల పట్ల తనకున్న ప్రేమ అతన్ని మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ సినిమాల్లో నటించేలా చేసింది, అతను చాలా కష్టపడి పనిచేశాడు మరియు విశాఖపట్నంలో శిక్షణ పొందాడు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు మురళి శరమ కల్యాణ్ దేవ్ తండ్రిగా నటించారు. ఇక కళ్యాణ్ దేవ్ కి విజేత సినిమాకి బెస్ట్ యాక్టర్ గా సీమ అవార్డు గెల్చుకున్నాడు, ప్రస్తుతం పులి వాసు దర్శకత్వం లో వస్తున్నా సూపర్ మాచి సినిమాలో హీరోయిన్ గా రియా చక్రబోర్తి నటిస్తుంది, అయితే చేసింది రెండు సినిమాలే అయినా ఈ సినిమా కోసం మెగా ఫాన్స్ ఏంటో ఎదురుచూస్తున్నారు, ఇక కళ్యాణ్ దేవ్ తనకి తన ఫ్యామిలీ కి సంబందించిన ఫోటోలు వీడియోలు ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తారు కళ్యాణ్ దేవ్ ఎప్పుడు చాలా యాక్టీవ్ గా ఉంటారు అవి సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.