చిరంజీవి గారితో ఛాన్స్ వదులుకున్న అని సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ శాంతి అసలు కారణం ఏంటి ?

ఒక్కప్పుడు తెలుగు తేరాపై మెరిసిన హీరోయిన్ లో విజయ శాంతి క్రేజ్ వేరేలా ఉండేది తొలిగా గ్లామరస్ హీరోయిన్ గా అందాలని ఆరబోసి ఆమె తరువాత యాక్షన్ సినిమాలో సైతం దుమ్ము లేపేసింది కర్తవ్యం సినిమాతో జాతీయ ఉత్తమనటి అవార్డు సొంతం చేసుకుంది. విజయ శాంతి ని అభిమానులు లేడీ అమిత బచ్చన్ అని పిలిచేవారు. 2006 లో నాయుడమ్మ తరువాత పూర్తిగా సినిమాలకి దూరం అయింది. రాజకీయాల్లో బిజీ గా మారిపోయారు.ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సరిలేరు నీకెవరు సినిమా లో చాలా ఏళ్ళ తరువాత తేరా మీద మల్లి కనపడ్డారు ఈ సినిమాలో విజయశాంతి మహేష్ బాబు పక్కన సపోర్టింగ్ రోల్ లో నటించారు ఆ పాత్రకు మంచి క్రేజ్ రావడం తో వరుస ఆకాశాలు ఆమెకు వచ్చాయి చాలా మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలో నటించాలని ఆమెను ఇంటికి వెళ్లి మరి కోరారు.

మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో విజయ్ శాంతి నటిస్తున్నారు వార్తలు వచ్చాయి ఒక్కపుడు వీళ్ల ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి హిట్స్ ఇచ్చాయి. స్వయం కృషి,యముడికి మొగుడు,మంచి దొంగ సంఘర్షణ, దేవాంతకుడు, ఛాలెంజ్, మెకానిక్ అల్లుడు,కొండవీటి రాజా,పసివాడి ప్రాణం ఇలా ఇంకా చాలా సినిమాలో నటించారు.40 ఏళ్లగా ఇండస్ట్రీ లో ఉంది 180 సినిమాలకి పైగా నటించారు,తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషలో నటించి, కర్తవ్యం సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ గా 6 సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ ,నంది అవార్డ్స్ , నేషనల్ అవార్డు, తమిళ నాడు స్టేట్ అవార్డు, ఒసేయ్ రాములమ్మ సినిమాకి నంది అవార్డులు మరియు సినిమా ప్రెస్ అవార్డు లు గెల్చుకున్నారు.

విజయశాంతి రెమ్యూనిరేషన్ కోటి రూపాయలు ఆ కలం లో ఎవరికీ అందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకున్నారు.వరంగల్ లో జన్మించి మద్రాస్ లో పెరిగారు విజయ్ శాంతి పిన్ని విజయ్ లలిత గారు కూడా అలనాటి సినిమా నటి. ఎన్టీఆర్ గారితో కూడా నటించింది. విజయశాంతి గారితో పోటీగా ఒకపుడు శ్రీదేవి,సుమలత కలిసి నటించారు. విజయ్ శాంతి కి శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ బిసినెస్ మెన్ తో పెళ్లి అయింది వారిద్దరికీ పిల్లలు లేరు. ఇపుడు కాస్త సినిమాలకి కాస్త దూరం అయినప్పటికీ నిర్మాతగా మరియు రాజకీయాల్లో బిజీ గా ఉన్నారు. చిరంజీవి గారు నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వం లో రాన్నున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్,కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు అయితే ఈ సినిమాలో విజయ్ శాంతి గారు కూడా నటిస్తున్నారు అని వార్తలు వచ్చాయి దీని పై తాజాగా ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు రాములమ్మ.

ప్రస్తుతం తాను రాజకీయాల్లో బిజీ గా ఉన్నారని మల్లి సినిమాలో నటిస్తున్నాను అని వస్తున్న వార్తలు నిజం లేదని అని తెలిపారు కానీ మెగాస్టార్ సినిమాలో ఆఫర్ రావడం మాత్రం నిజమే కానీ సినిమాలో నటించాను అని కచ్చితంగా చెప్పేసారు తనకి ఇపుడు సినిమాలు కన్న రాజకీయాలు ముఖ్యం అన్ని అన్నారు ప్రజాసేవలో ఉండటం ఏ తనకి ఇష్టం అని చెప్పేసారు ఈ వాక్యాలతో కొంతకాలం గా తనపై వస్తున్న రూమర్స్ అన్నిటికి విజయశాంతి ఒకసారిగా చెక్ పెటేసారు అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ కి చేరిన సంగతి మన అందరికి తెలిసిందే.అయితే సినిమాలో ఇపుడు నటించట్లేదని అర్ధం అవుతుంది .