చిరంజీవి గురించి హీరో రాజశేఖర్ ఇలా మాట్లాడుతాడు అని మీరు కలలో కూడా ఊహించి ఉండరు

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న కీర్తి ప్రతిష్టల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ప్రపంచవ్యాప్తంగా నలుమూలల ఉన్న ప్రతి తెలుగోడి మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానమే, తన అద్భుతమైన నటన ద్వారా కోట్లాది మంది అభిమానులను ఆయన ఎలా సంపాదించుకున్నారో మన అందరికి తెలిసిందే,ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి ఎదగాలి అని కోరుకునే ప్రతి ఒక్క మనిషికి మెగాస్టార్ చిరంజీవి ఒక్క గొప్ప ఆదర్శం అని చెప్పొచ్చు,సినీ ఇండస్ట్రీ లో కూడా ఆయనకీ అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పనక్కర్లేదు.

కొంతమంది నటులు ఆయనతో పోట్లాడినా సందర్భాలు ఎన్నో ఉన్నా, ఆయన వాళ్ళ ఆ తర్వాత వాళ్ళు సహాయం పొంది పొగిడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి,దానికి ఉదాహరణగా మనం జీవిత రాజశేఖర్ ని తీసుకోవచ్చు, వీళ్లిద్దరు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన్నప్పటి నుండి చిరంజీవి పై వీళ్ళు ఏ స్థాయిలో విమర్శలు చేసేవారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,వాళ్ళు చిరంజీవిని ఎన్ని సార్లు దూషించిన చిరంజీవి ఈనాడు కూడా వాళ్ళను ఒక్క మాట కూడా అనలేదు అనే విషయం వాస్తవం,ఎన్ని విమర్శలు చేసిన రాజశేఖర్ సినిమాకి మెగాస్టార్ ప్రమోషన్ చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.

హీరో రాజశేఖర్ కూడా పలు ఇంటర్వూస్ లో చిరంజీవి తనకి చేసిన సహాయాలు గురించి చెప్పుకున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఒకానొక్క ఇంటర్వ్యూ లో ఆయన చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ‘చిరంజీవి గారితో అప్పట్లో మాకు విభేదాలు ఉన్న విషయం వాస్తవమే, కానీ ఆయన అవేమి మనసులో పెట్టుకోలేదు, మధ్యలో రెండు మూడు సార్లు కలిసినప్పుడు కూడా ఆయన పాతవి ఏమి ఇక మనం మనసులో పెట్టుకోకుండా మనం ఎప్పటిలాగానే స్నేహం గా ఉందాము అని కూడా చెప్పారు,ఒక్క రోజు జీవిత మా అమ్మాయి మెడికల్ సీట్ అడ్మిషన్ కోసం చిరంజీవి గారి ఇంటికి సహాయం కోసం వెళ్ళింది, ఇంటికి వెళ్ళగానే చిరంజీవి గారు ఆమెకి ఎంతో మర్యాదగా అతిధి సత్కారాలు చేసి, ఉపాసన ద్వారా మా అమ్మాయి కి అప్పొల్లో లో మెడికల్ సీట్ అడ్మిషన్ చాలా తేలికగా దొరికేలా చేసారు, ఆయన చేసిన ఈ సహాయం ని నేను ఎప్పటికి మర్చిపోలేను’ అంటూ రాజశేఖర్ తెలిపారు.

రాజశేఖర్ చెప్పిన ఈ మాటలని చూస్తే అప్పట్లో తన అన్నయ్య చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు గుర్తు కు వస్తాయి,మా అన్నయ్యని ని మీరు ఎంత అయినా ద్వేషించండి, కానీ ఆయన మాత్రం మిమల్ని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటారు అని చెప్పిన మాటలు అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ ని సృష్టించాయి ప్రత్యేకముగా చెప్పనక్కర్లేదు, అయితే ఈరోజు రాజశేఖర్ మాట్లాడిన మాటలని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఆరోజు చెప్పిన మాటలు అక్షర సత్యం అని చెప్పక తప్పదు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వం లో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతోకాలం నుండి ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఈ సినిమాలో చిరంజీవి తో పాటు రామ్ చరణ్ కూడా ఒక్క ప్రత్యేక పాత్ర పోషిస్తుండడంతో అభిమానులు తంరీ కొడుకులను ఒక్కే తెర పై చూడడానికి ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు, దానికి తగ్గట్టు గానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కనివిని ఎరుగని రీతిలో జరిగి ఆల్ టైం నాన్ బాహుబలి హైయెస్ట్ బిజినెస్ గా సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ సినిమా కేవలం థియేట్రికల్ రైట్స్ 150 కోట్ల రూపాయలకు అమ్ముడు పొయ్యింది అట, వీటితో పాటు డిజిటల్ రైట్స్ మరియు సాటిలైట్ రైట్స్ ద్వారా ఈ సినిమా మొత్తం బిజినెస్ విడుదలకు ముందే 250 కోట్ల రూపాయలకు జరిగింది అని, ఇది ఇండస్ట్రీ లోనే ఒక్క సంచలన రికార్డు అని ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్త, ఈ ఏడాది మే 13 వ తేదీనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ బీభత్సం వల్ల ఆగిపోయింది, ఇక ఈ సినిమాని ఈ ఏడాది ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు అట, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.