చిరంజీవి చేసిన సహాయం గురించి బాలకృష్ణ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

మన టాలీవుడ్ లో నిన్నటి తరం మరియు నేటి తరం లో నెంబర్ 1 హీరో ఎవరు అంటే ఎవ్వరైనా కళ్ళు మూసుకొని మెగాస్టార్ చిరంజీవి అని చెప్పక తప్పదు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన చిరంజీవి అంచలంచలుగా ఎదుగుతూ ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మెగాస్టార్ గా ఎదిగాడు,కేవలం సినిమాల పరంగానే కాదు సేవ కార్యక్రమాల పరంగా కూడా ఆయన లక్షలాది మందికి ఆదర్శంగా నిలిచారు,బ్లడ్ బ్యాంకు మరియు ఐ బ్యాంకు ద్వారా ఎన్నో సంవత్సరాల నుండి ఆయన సేవలు అందిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

ఇక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయం లో ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది,రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంక్స్ స్థాపించి కరోనా తో పోరాడుతున్న ఎన్నో వేల మందికి అఆయన ఉచితంగా ఆక్సిజన్ ని సరఫరా చేసారు, ఇందుకోసం ఆయన దాదాపుగా 40 కోట్ల రూపాయిలు ఖర్చు చేసారు, దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వాక్సినేషన్ డ్రైవ్స్ ని కూడా నిర్వహించాడు, ఇలా ఒక్కటే రెండా ఎన్నో లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు చేసారు ఆయన.

ఈ విపత్కర సమయం లో ప్రభుత్వాలు ఎలా స్పందించిన కూడా సినీ నటులు మాత్రం సహాయం చెయ్యడానికి పోటీ పడి మరీ ముందుకు వచ్చారు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు,మెగాస్టార్ చిరంజీవి లాగానే నందమూరి బాలకృష్ణ కూడా తన బసవ తారకం హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవ కార్యక్రమాలు చేసాడు,ఇక తానూ చేస్తున్న సేవ కార్య క్రమాలు గుర్తించి నేను ఇచ్చిన పిలుపుని ఆహ్వానిస్తూ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు అందరు బసవ తారకం హాస్పిటల్ కి భారీ స్థాయిలో విరాళాలు అందచేశారు అని, వారిలో నా మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు అని బాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు.

నన్ను నమ్మి ఈ స్థాయిలో విరాళాలు అందించిన అందరికి నేను కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను,మీరు ఇచ్చిన విరాళాలు ప్రతి ఒక్క పైసా ఆపద లో ఉన్న వారిని ఆదుకునేందుకు ఉపయోగిస్తాను అని ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తెలిపారు, గతం లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి కూడా ఈయన పాతిక లక్షల రూపాయిలు విరాళం అందించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ విషయం ని స్వయంగా చిరంజీవి గారే తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు, ఇలా వీళ్లిద్దరు కేవలం బాక్స్ ఆఫీస్ పరంగానే కాకుండా సేవ కార్యక్రమాలు చెయ్యడం లో కూడా పోటీ పడుతున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన కొరటాల శివ దర్శకత్వం లో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆగష్టు నెలలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త, ఈ సినిమాలో చిరంజీవి తో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,మెగా అభిమానులు అందరు తండ్రి కొడుకులను ఒక్కే తెర పై చూడడానికి ఎంతో ఆసక్తిగా చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు.

వాస్తవానికి ఈ సినిమాని మే 13 వ తేదీన విడుదల చేస్తునట్టు గతం లో ఆ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసిన సంగతి మన అందరికి తెల్సిందే, అయితే అనుకోకుండా కారా సెకండ్ వేవ్ ఎవ్వరు ఊహించని స్థాయికి వెళ్లిపోవడం తో ఈ సినిమా అనుకున్న తేదికి రాలేకపోయింది, ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళం లో సూపర్ హిట్ అయినా లూసిఫెర్ రీమేక్ లో నటిస్తున్నాడు, దీనితో పాటు ఆయన తమిళ్ లో సూపర్ హిట్ అయినా అజిత్ వేదలమ్ సినిమాని కూడా రీమేక్ చేయనున్నాడు, ఈ రెండు సినిమాలు త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనున్నాయి.