జంట కాబోతున్న బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ మోనాల్ త్వరలోనే ముహూర్తం !

తెలుగు బుల్లితెరపై ఎన్నో షోలు వస్తుంటాయి పోతుంటాయి అయితే వాటిలో కొన్ని మాత్రమే విపరీతమైన స్పందను అందుకుని నెంబర్ 1 షోలుగా మారుతాయి అలాంటివాటిలో బిగ్ బాస్ షో ఒక్కటి నాలుగు ఏళ్లగా సక్సెసఫుల్ గా రన్ అవుతున్న ఈ షో ఎంతోమందిని సెలెబ్రిటీలుగా కొందరిని జంటలుగా మార్చేసింది అందులో మోనాల్ గజ్జర్ , అఖిల్ సార్థక్ జోడి ఒక్కటి ఇంట బయట రచ్చ చేస్తూనే ఉన్న వీళ్లు తరచూ ఏదోరకంగా హైలెట్ అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వీళ్ల ఇద్దరి గురించి తాజాగా ఒక ఊహించని మంచి వార్త బయటకి వచ్చింది బిగ్ బాస్ నాలుగోవ సీసన్ ఆరంభం అయినా కొంత కాలానికే అఖిల్, మోనాల్ మధ్య ప్రేమ మొదలైంది అందుకు అనుగుణంగానే వీళ్ల ఇద్దరు హౌస్ లో రొమాన్స్ చేస్తూ రచ్చ చేసేసారు అదే సమయంలో తరచూ తమ ప్రేమను వ్యక్త పర్చుకునేవారు.

ఒకరిని ఒకరు సపోర్ట్ గా ఉంటూ ఎన్నో ఎలిమినేషన్లను తప్పించుకున్నారు ఇలా షోలో ఊహించని విధంగా సందడి చేసారు. బిగ్ బాస్ హౌస్ లో హాల్ చల్ చేసిన అఖిల్ మోనాల్ బయటకి వచ్చిన తరువాత కూడా అదే కొనసాగిస్తున్నారు షో ముగిసిన తరువాత నుంచి ఇప్పటివరకు ఎన్నో సార్లు వీళ్ల ఇద్దరు కలుసుకున్నారు తరచూ పార్టీలు చేసుకోవడం సోషల్ మీడియా లో కామెంట్లు పెట్టుకోవడం వీడియో కాల్స్ మాట్లాడటం చేయడం తో పాటు వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ఈ ఏడాది ప్రేముకుల రోజున పురస్కరించుకుని అఖిల్ తో చేస్తున్న వెబ్ సిరీస్ ని ప్రకటించింది మోనాల్ గజ్జర్ తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అనే టైటిల్ తో వస్తున్న ఈ సిరీస్ ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్ పై భాస్కర్ బంటిపల్లి తెరకు ఎక్కిస్తున్నారు, ఈ విషయాన్ని ఈ ఇద్దరు సోషల్ మీడియాలో పోస్టర్ ద్వారా రిలీజ్ చేసారు.

అఖిల్ ఇటీవలే హీరో గా తన మొదటి చిత్రం ఫస్ట్ టైం అనే సినిమా ప్రకటించారు హేమంత్ నిర్మాతగా దర్శకుడిగా చేస్తున్న ఈచిత్రం లో అనికా విక్రమాన్ హీరోయిన్ గా చేస్తుంది అలాగే మోనాల్ కూడా పలు షోలతో బిజీ గా ఉంది. ఈ నేపథ్యం లో ముందుగా వీటి పైనే వీళ్లు ఫోకస్ చేయడంతో అసలీ వెబ్సెరీస్ ఉంటుందా లేదా అని దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి వెబ్సెరీస్ ఇంకా మొదలు అవకపోవడానికి కారణం ఏంటి అని యాంకర్ అడగగా దీనికి మోనాల్ కి చాలా ఆఫర్లు ఉన్నాయ్ నాకు కూడా ఈ సినిమా డేట్స్ ఫుల్ అయ్యాయి వాటివల్లే మా ఇద్దరికి సెట్ అవ్వడం లేదు ఇద్దరికీ డేట్స్ సర్దుబాటు అయినపుడు ఆ సిరీస్ పూర్తీ చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు. ఈ సిరీస్ కోసం ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి వెబ్సెరీస్ విష్యంలో మోనాల్ ,అఖిల్ ఇద్దరు యూ టర్న్ తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది అంటే ఇక పై ఈ సిరీస్ మొదలయే అవకాశాలు లేదనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యం లో మోనాల్ ఇటీవలే డాన్స్ ప్లస్ షో ని పూర్తీ చేసుకుంది దీనితో ఈ సిరీస్ మొదలు అవబోతుంది అని న్యూస్ లీక్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి వెబ్సెరీస్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది లొక్డౌన్ తరువాత వీళ్లు ఇద్దరు దీనికోసం కలిసి పని చేయబోతున్నారు అని ఒక న్యూస్ ఫిలిం నగర్ లో వైరల్ అవుతుంది అంటే కాదు దీనిపై వీళ్ల ఇద్దరు సోషల్ మీడియా వేదికగా త్వరలోనే ప్రకటన చేయబోతున్నారని కూడా టాక్ వినిపిస్తుంది. మోనాల్ ,అఖిల్ కలిసి మరోసారి నటించడం అభిమానులకు పండగే ఈ సిరీస్ ఎపుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.