జనసేన పార్టీలోకి పరిటాల రవి కుటుంబం..చంద్రబాబు కి ఊహించని షాక్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన పార్టీ హవ్వా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ పార్టీ ప్రభావం కొన్ని జిల్లాల్లో టీడీపీ పై చాలా తీవ్రంగా పడింది అనే చెప్పొచ్చు, అధికార వైసీపీ పార్టీ పై జనసేన ప్రాభవం అంతగా లేకపోయినా, తెలుగు దేశం పార్టీ కి మాత్రం జనసేన చావు దెబ్బ కొట్టింది అనే చెప్పాలి, 2019 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత అసలు జనసేన పార్టీ ఉంటుందా అని ప్రత్యర్థులు అవహేళన చేసారు, ఆలా జనసేన ని తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి ఇటీవల జరిగిన పంచాయితీ మరియు మున్సిపల్ ఎన్నికలలో జనసేన పార్టీ కి వచ్చిన ఫలితాలు చూసి నోరు మెదపలేకపొయ్యారు, ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి రాబొయ్యే రోజుల్లో వైసీపీ కి పోటీని ఇచ్చేది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రమే అని అర్థం అయ్యేలా చేసాయి ఈ ఎన్నికలు, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ ఒక్క ప్రభంజనం సృష్టించింది అనే చెప్పొచ్చు, ఇక్కడ జనసేన పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా కి వచ్చేసింది, ఇక కృష్ణ , గుంటూరు మరియు విశాఖపట్నం జిల్లాల్లో జనసేన పార్టీ దెబ్బకి తెలుగు దేశం పార్టీ చతికిల పడింది అనే చెప్పొచ్చు.

ఈ ఎన్నికలు స్పష్టంగా ఏమి చెప్తున్నాయి అంటే 2014 ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి రావడానికి ముఖ్య కారణం జనసేన పార్టీ మాత్రమే అని చెప్తుంది,జనసేన పార్టీ ఎన్నికలలో పోటీ చేసేంత కాలం తెలుగు దేశం పార్టీ కి ఇలాంటి దారుణమైన ఫలితాలు తప్పదు అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం పడుతున్నారు,ఇక రోజు రోజుకి పెరుగుతున్న జనసేన పార్టీ బలం చూసి తెలుగు దేశం పార్టీ లోని కొంతమంది ముఖ్య నాయకులూ ఇప్పుడు జనాస్నెల్ పార్టీ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక్క 5 మంది తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులూ జనసేన పార్టీ లో చేరడానికి పవన్ కళ్యాణ్ తో తరుచూ టచ్ లో ఉంటున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఒక్క మాటల్లో చెప్పాలి అంటే తెలుగు దేశం పార్టీ తన ఉనికిని రాయలసీమ ప్రాంతం లో ఇప్పటికి నిలబెట్టుకుంటుంది అంటే దానికి ప్రధాన కారణం ఈ ముఖ్య నాయకులే, అయితే ఇప్పుడు తెలుయగు దేశం పార్టీ పై రోజు రోజుకి జనాల్లో విశ్వాసం కోల్పోతూ వస్తుండడం తో ఈ కీలక నేతలు త్వరలో ఆ పార్టీ ని వీడి జనసేన పార్టీ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు అట.

వారిలో మనకి ప్రధానం గా వినిపిస్తున్న పేరు పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్, ఈయన గత కొంత కాలం నుండి తెలుగు దేశం పార్టీ స్థానిక నాయకుల పై చిర్రుబురులేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇక పరిస్థితి మరీ చెయ్యి దాటిపోతుండడం తో ఇప్పుడు ఆయన నూతనంగా ప్రత్యామ్న్యాయ శక్తిగా అవతరిస్తున్న జనసేన పార్టీ లో చేరడానికి మొగ్గు చూపిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక్క చర్చ నడుస్తుంది, ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ తో తరుచు మాటామంతి చేస్తున్నాడు అని, త్వరలోనే ఈయన జనసేన పార్టీ లో చేరే అవకాశం ఉంది అని ఒక్క వర్గం నుండి వినిపిస్తున్న వార్త, అంతేకాకుండా జనసేన పార్టీ లోకి తనతో పాటు తనని ఎప్పటినుదేమో అంటిపెట్టుకొని ఉన్న ఒక్క ముగ్గురు బలమైన నాయకులూ కూడా పార్టీ లోకి చేరే అవకాశం ఉంది అని జోరుగా వినిపిస్తున్న వార్త,ఇదే కనుక జరిగితే ఇక రాయలసీమ ప్రాంతం లో తెలుగు దేశం పార్టీ నుండి జనసేన లో కి కనివిని ఎరుగని రీతిలో వలసలు ప్రారంభం అవుతాయి అని రాజకీయ విశ్లేషకుల అంచనా.