జనసేన పార్టీ లోకి క్యూ కడుతున్న 5 మంది టీడీపీ నాయకులూ వీళ్ళే

మన ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీల తర్వాత దాదాపు 40 ఏళ్ళ రాజేయ చరిత్ర గలిగిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది తెలుగు దేశం పార్టీ అని చిన్న పిల్లాడిని అడిగిన చెప్తారు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం లో దాదాపుగా పాతికేళ్ళు అధికారం లో ఉన్న ఏకైక పార్టీ కూడా తెలుగు దేవం పార్టీనే, మధ్యలో కొన్ని సార్లు ఘోరంగా పరాజయాలు చవి చూసిన కూడా ప్రతి ఎన్నికలలో తన బలమైన ఓటు బ్యాంకు ని కోల్పోలేదు తెలుగు దేశం పార్టీ,అంతాహి పటిష్టమైన తెలుగు దేశం పార్టీ ఓటు బ్యాంకుకి 2019 ఎన్నికల తర్వాత బొక్క పడిందా అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు, ఇటీవల జరిగిన పంచాయితీ మరియు మున్సిపల్ ఎన్నికలు దానికి ఉదాహరణ అని చెప్పకనే చెప్తున్నారు, తెలుగు దేశం పార్టీ కి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రూపం లో గడిచిన స్థానిక ఎన్నికలలో దారుణమైన నష్టం జరిగింది అని , పరిస్థితి ఇలాగె కొనసాగితే బావిషేట్టులో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయ్యే ప్రమాదం ఉంది అని తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులలో గుబులు నెలకొంది, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో తో పాటు కృష్ణ , వైజాగ్ మరియు గుంటూరు జిల్లాలలో జనసేన పార్టీ వల్ల తెలుగు దేశం పార్టీ కి కోలుకోలేని దెబ్బ తగిలిన విషయం వాస్తవమే.

ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే ఇప్పుడు వైసీపీ కి పోటీగా ప్రధాన ప్రతిపక్ష హోదా ని సొంతం చేసుకున్న పార్టీగా జనసేన పార్టీ సరికొత్త అవతారం ఎత్తింది అని, కృష్ణ , వైజాగ్ మరియు గుంటూరు జిల్లాల్లో అయితే తెలుగు దేశం పార్టీ దీటైన పోటీని జనసేన పార్టీ ఇస్తుంది అని, ఈ ప్రాంతాలలో జనసేన పార్టీ లోకి ఎవరైనా బలమైన లీడర్ చేరితే కచ్చితంగా జనసేన పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించడం తథ్యం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు, ఇప్పటికే జనసేన పార్టీ లో చేరడానికి టీడీపీ నుండి పలువురు నాయకులూ ఈ ప్రాంతాల నుండి సిద్ధంగా ఉన్నారు అని, వీళ్ళు తరుచు పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉంటున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం, వీరిలో వంగవీటి రాధా కూడా ఒక్కరు, ఈయన ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో పలు మార్లు చారఃకాలు కూడా జరిపాడు, సరైన సమయం దొరికితే జనసేన పార్టీ లో చేరడానికి సమయాత్తంగా ఉన్నాడు అట వంగవీటి రాధా, ఈయన తో పాటుగా కొంతమంది ముఖ్య నాయకులూ కూడా జనసేన పార్టీ చేరడానికి సిద్ధం అవుతున్నారు అట.

ఇక రాయలసీమ ప్రాంతం లో మొదటి నుండి తెలుగుదేశం పార్టీ కి ఆయువు పట్టుగా ఉన్న 5 మంది కీలక నేతలు తెలుగు దేశం పార్టీ కి రాజీనామా చేసి జనసేన పార్టీ లో చేరడానికి సిద్ధం గా ఉన్నారు అట, రాయలసీమ ప్రాంతం లో తెలుగు దేశం పార్టీ కి పార్టీ బలం కంటే అక్కడి స్థానిక నేతల బలం మరియు క్యాడర్ పటిష్టమైనది అనే విషయం మన అందరికి తెలిసిందే, అయితే ఇక్కడ సొంత పార్టీ నాయకుల నుండే ఒక్కరిపై ఒక్కరు పరస్పరం విమర్శలు చేసుకోవడం వాన్బటివి మనం రెగులర్ గా చూస్తూనే ఉన్నాము, వీళ్ళు ఇప్పుడు జనసేన మరియు బీజేపీ పార్టీ కూటమి లో చేరడానికి సిద్ధం గా ఉన్నారు అట, వీరిలో ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, వారి పేర్లు బహిరంగంగా బయట పెట్టకపోయినా తెలుగు దేశం పార్టీ వర్గాల్లో ఎవరు వెళ్ళబోతున్నారు అనే క్లారిటీ ఉన్నట్టు సమాచారం, మరి జనసేన ల చేరబోతున్న ఆ 5 మంది టీడీపీ నాయకులూ ఎవరు అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.