జనసైనికుల దెబ్బకి నా పరిస్థితి ఇలా అయిపోతుంది అనుకోలేదు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి ఎలా మలుపు తిరుగుతుందో మనం గమనిస్తూనే ఉన్నాము, 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇటీవల పంచాయితీ ఎన్నికలు జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే,ఈ ఎన్నికలలో అందరూ ఊహించినట్టుగానే అధికార పార్టీ వైసీపీ కి తిరుగులేని పంచాయితీ స్థానాలు వచ్చాయి, 13000 వేలకు పైగా ఉన్న సర్పంచి స్థానాల్లో 10 వేలకి పైగా సర్పంచి స్థానాలు కవిసం చేసుకొని చరిత్ర సృష్టించింది వైసీపీ పార్టీ, ఇక ఈ పంచాయితీ ఎన్నికలలో ఎవ్వరు ఊహించనిది ఏమైనా ఉండ అంటే అది జనసేన పార్టీ ఒక్క రేంజ్ లో పుంజుకోవడమే,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా తెలుగు దేశం పార్టీ కంటే జనసేన పార్టీ చాలా ప్రాంతాలలో అధిక సర్పంచి స్థానాలను కైవసం చేసుకోవడం ఆ పార్టీ కి మింగుడుపడలేని విషయం అనే చెప్పాలి,స్థానికంగా ప్రతి ఒక్క ప్రాంతం బలమైన క్యాడర్ మరియు పటిష్టమైన నాయకత్వం ఉన్నా కూడా, అసలు సంస్థాగతం గా ఒక్క బలమైన నాయకుడు లేదు జనసేన పార్టీ కంటే తక్కువ స్థానాలు వచ్చాయి అంటే ఆశ్చర్యానికి గురి అవ్వాల్సిన విషయమే, ముఖ్యంగా తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి, కృష్ణ ,గుంటూరు మరియు విశాఖపట్నం వంటి ప్రాంతాలలో తెలుగు దేశం పార్టీ కి జనసేన పార్టీ రూపం లో చావు దెబ్బ తగిలింది అనే చెప్పాలి, చాలా స్థానాల్లో తెలుగు దేశం పార్టీ మూడవ స్థానం కి కూడా పడిపోవడం అనేది శోచనీయం.

కేవలం ప్రతిపక్ష పార్టీ కి మాత్రమే కాదు, అధికార వైసీపీ పార్టీ కి కూడా కొన్ని చోట్ల చుక్కలు చూపించింది జనసేన పార్టీ, అందులో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన రాజోలు అనే నియోజకవర్గం గురించి, 2019 సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ తరుపున రాపాక వరప్రసాద్ ఈ స్థానం నుండి శాసనసభ్యుడిగా ఎన్నిక అయ్యాడు, జనసేన పార్టీ తరుపున ఏం ఎల్ ఏ గా గెలిచినా ఏకైక వ్యక్తి కూడా ఇతనే,కానీ అసెంబ్లీ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి రాపాక వరప్రసాద్ జగన్ భజన చెయ్యడం మొదలు పెట్టాడు, జనసేన పార్టీ తరుపున గెలిచి జగన్ కి సపోర్ట్ చేస్తూ జనసేన పార్టీ కి తీరని నష్టం చెయ్యాలని చూసాడు, రాపాక పవన్ కళ్యాణ్ కి పొడిచిన వెన్నుపోటు ని మనసులో గుర్తుపెట్టుకున్న రాజోలు ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో రాపాక వరప్రసాద్ కి చావు దెబ్బ కొట్టారు, 40 కి పైగా పంచాయితీ స్థానాలు ఉన్న రాజోలు నియోజక వర్గం లో 25 స్థానాలను జనసేన పార్టీ కట్టబెట్టి రాపాక వరప్రసాద్ కి మింగుడు పడనివ్వకుండా చేసారు, పంచాయితీ ఎన్నికలలో రాపాక వరప్రసాద్ వైసీపీ పార్టీ తరుపున ప్రతీ ఒక్క గ్రామం లో ప్రచారం చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.

అయితే ఈ ఎన్నికల ఫలితాల పై రాపాక వరప్రసాద్ తన సన్నిహితుల సమక్షం లో వాపోయాడు అట,’చాలా పెద్ద పొరపాటే జరిగిపోయింది,జనసేన పార్టీ లో ఉంటూ వైసీపీ పార్టీ కి సపోర్ట్ చేసి నా రాజకీయ జీవితానికి నేనే సమాధి కట్టుకున్నాను, జనసేన పార్టీ కి ఈ స్థాయిలో ప్రజాధారణ పెరుగుతుంది అని కలలో కూడా ఊహించలేదు, వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ తరుపున పోటీ చేస్తానో లేదో తెలియదు,సొంత నియోజక వర్గం లో ఇంత నెగటివిటీ ఉంటె జగన్ గారు నాకు సీట్ ఎలా ఇవ్వగలరు, ఇక జనసేన పార్టీ తరుపున పోటీ చేసే అర్హత కూడా నేను కోల్పోయాను, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావట్లేదు’ అంటూ రాపాక వరప్రసాద్ తన్న సన్నిహితుల సమక్షం లో వాపోయినట్టు రాజోలు మొత్తం కోడై కూస్తూ ఉంది, పాపం రాపాక వరప్రసాద్, జనసేన పార్టీ లోనే ఆయన కొనసాగి ఉంటె రాబొయ్యే ఎన్నికలలో ఆయన బంపర్ మెజారిటీ తో గెలిచేవాడు, పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఈ స్థాయిలో ఎదుగుతాడు అని ఊహించి ఉండదు పాపం. అందుకే ఈ గతి పట్టింది, ఇక ఏ రాజకీయ పార్టీ తో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తే 500 ఓట్లు కూడా రావు, 2014 వ సంవత్సరం లో రాపాక కి వచ్చి ఓట్లు అక్షరాలా 400 మాత్రమే, మళ్ళీ రాపాక కి అదే పరిస్థితి పట్టనుందా?,ఏమో మరో మూడేళ్లు వేచి చూడాలి.