జబర్దస్త్ కామిడీయన్స్ ఎవరు ఎం చదువుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు ?

బుల్లితెర మీద ఎన్ని కామెడీ షోస్ వచ్చిన సరే ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పకర్లేదు, ఇది ఎప్పటికి ఎవర్గ్రీన్ షో ఈటీవీ రేటింగ్ చాలా వరకు జబర్దస్త్ వచ్చే సమయం లోనే వస్తున్నాయి అంటే దాని బట్టి అర్ధం చేసుకోవచ్చు జబర్దస్త్ షో క్రేజ్ రేంజ్ ఏంటి అనేది తెలుగులో ఒక కామెడీ రియాలిటీ షో ఇంత అద్భుతమైన సక్సెస్ అవుతుందని ఎవరు ఉహించి ఉండరు కూడా అంటే కాదు ఇపుడు జబర్దస్త్ కామిడీయన్స్ జీవితాలు కూడా ఒక రేంజ్ లో మారిపోయాయి, ఒకే ఒక్క షోతో స్టార్స్ అయిపోయారు అంటే కాదు ఈ కామెడీ షో ద్వారా చాలామంది కొత్త కామిడీయన్స్ కూడా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు ఒక్కసారిగా వీరి జీవితాలు మారిపోయాయి డబ్బులు క్రేజ్ బాగానే సంపాదించారు కొంతమంది సినిమాలో హీరోలు గా వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఈ షో లో ఇంతగా మనందరినీ ప్రేక్షకులను నవ్విస్తున్న జబర్దస్త్ కామిడీయన్స్ ఎం చదుకున్నారో ఎవరికి తెలీదు. బుల్లితెర లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇంటర్మీడియట్ వరకు చదుకున్నాడు, ఆ తరువాత కుటుంబ పోషణ కోసం అయినా చదువు మానేసి మ్యాజిక్ షోలు చేస్తుండేవారు, ఇక స్కిట్ మొదలైనప్పటి నుంచి పూర్తయేవరకు తనదైన పంచ్ డైలాగ్స్ తో అందరిని బాగా నవ్వించే హైపర్ అది బీటెక్ పూర్తీ చేసాడు, ఇక ఆటో రామ్ ప్రసాద్ తన మార్క్ ఆటో పంచ్లతో అందరిని నవ్విస్తూ ఉండే రామ్ ప్రసాద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదివాడు, ఇక గెటప్ శ్రీను యాక్టర్ ,మిమిక్రి ఆర్టిస్ట్ ఈయన ఇంటర్మీడియేట్ వరకు చదుకున్నారు, ఇక ముక్కు అవినాష్ బిగ్ బాస్ కోసం జబర్దస్త్ కి గుడ్ బాయ్ చెప్పి వదిలేసినా అవినాష్ ఎంబీఏ చదుకున్నాడు. ఇక చలాకి చంటి డిగ్రీ చదువుతూ మధ్యలో చదువు ఆపేసారు.

వర్ష తో లవ్ ట్రాక్ నడిపిస్తూ ఫేమ్ అవుతున్న ఇమ్మానుయేల్ డిగ్రీ పూర్తిచేశారు, ఇక రాకెట్ రాఘవ జబర్దస్త్ తో పాటు సినిమాలో కూడా తన సత్తా ఛాయా రాఘవ డిగ్రీ చదువుకున్నాడు ఆ తరువాత టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తీ చేసాడు కానీ ఇండస్ట్రీ లో ఇష్టం లో జబర్దస్త్ లో అడుగు పెట్టాడు, ఇక బులెట్ భాస్కర్ డిగ్రీ బి.కామ్ చేసారు, మహేష్ డిగ్రీ పూర్తీ చేసారు, నరేష్ డిగ్రీ చదువుతూ మధ్యలో ఆపేసారు. కెవ్వు కార్తీక కూడా డిగ్రీ పూర్తీ చేసారు, సునామి సుధాకర్ కూడా డిగ్రీ చదివారు. జబర్దస్త్ నుండి బయటకి వెళ్లిన చమక్ చంద్ర ఇంటర్మీడియట్ వరకు చదివారు. ఇక డైరెక్టర్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న అదిరే అభి ఇంజనీరింగ్ చదివారు. అయితే వీలంతా చదివింది తక్కువే అయినా సినిమా ఆర్టిస్ట్స్ కి సమానం గా రెమ్యూనిరేషన్ భారీగానే ఉంటుందని చెప్పచు ఒకో స్కిట్ కి దాదాపు 20 వేల దాక తీసుకుంటారని తెలుస్తుంది.

కామెడీ పంచ్లతో అందరిని అక్కటుకుంటున్న ఈ కామిడీయన్స్ ఒకో స్కిట్ కి వేలలో అందుకుంటారు, ఇక వీలంతా సినిమాలో కూడా అవకాశాలు దక్కించుకున్నారు ఇప్పటికే సుడిగాలి సుధీర్ కి జబర్దస్త్ ద్వారా వోచిన క్రేజ్ కి పలు షోలలో యాంకర్ గా కూడా తన సత్తా చాటుకున్నాడు అలానే ఢీ షో లో టీమ్ లీడర్ గా అందరిని అక్కటుకున్నాడు ప్రతి షో లో తన మాటలతో అందరిని నవ్విస్తారు అంత పేరు తెచ్చుకున్న సుధీర్ రెమ్యూనిరేషన్ ఒకో ప్రోగ్రాం కి దాదాపు లక్షల్లో ఉంటుంది అనే చెప్పాలి, ఇక అలానే గెటప్ శ్రీను కి కూడా సినిమాలో మంచి అవకాశాలు వస్తున్నాయి అయితే వీరంతా జబర్దస్త్ తో పాటు పలు సినిమాలో కూడా నటిస్తున్నారు పెద్ద స్టార్స్ తో కలిసి నటిస్తున్నారు, రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వీరు ముగ్గురు కలిసి 3 మంకీస్ సినిమా లో నటించారు, జబర్దస్త్ షో అందరికి మంచి గుర్తింపుని ఇచ్చింది అనే చెప్పాలి.