జబర్దస్త్ షో లో జడ్జిగా రోజా కాకుండా ఇంద్రజ కావాలి అంటున్న అభిమానులు !

ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికి తెలిసిందే ఎంతోమంది కామిడీయన్స్ జబర్దస్త్ ద్వారా సెలెబ్రిటీలుగా మారారు అంటే కాకుండా వెండితెర పై అవకాశాలు కూడా అందుకున్నాడు ఇది ఇలా ఉంటె ఇటీవలే ఇందులో సినీ నటి ఇంద్రజ జడ్జిగా చేసిన సంగతి తెలిసిందే అంటే కాకుండా జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు మరింత దెగ్గరయ్యింది ఇంద్రజ. జబర్దస్త్ లో జడ్జి గా చేస్తున్న సినీ నటి రోజా కొన్ని రోజులు అనారోగ్య కారణంగా షో కి దూరం గా ఉండగా తన స్తానంలో మరో నటి ఇంద్రజ ని చేర్చారు ఇక తొలి చూపులోనే అభిమానులను అందుకుంది వెండితెరపై కూడా అంత గుర్తింపు లేకుండా మొత్తానికి జబర్దస్త్ తో మంచి క్రేజ్ ని అందుకుంది ఇంద్రజ తన అందం, అభినయం తన నవ్వు తోనే కాకుండా కామిడీయన్స్ తో బాగా ఇంటరాక్ట్ అవుతూ మరింత సందడి చేస్తుంది.

ఇది ఇలా ఉంటె తాజాగా ఇంద్రజ కనిపించక పోవడంతో అభిమానులు అయోమయం లో పడ్డారు తాజా ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదల కాగా అందులో జబర్దస్త్ ఎక్సట్రా జబర్దస్త్ లో ఇంద్రజ కనిపించకపోవడంతో అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు రోజా తిరిగి కోలుకుని రావడంతో మల్లి రోజా జడ్జి గా సెట్ అయిపోయింది దీనితో ఇంద్రజ కనిపించకపోయే సరికి రోజా వద్దు ఇంద్రజ ముద్దు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు అంటే కాకుండా మరి కొంతమంది ఫాన్స్ ఇంద్రజ కోసం జబర్దస్త్ చూస్తున్నాం అని మరికొందరు ఇంద్రధనస్సు కనిపించడం లేదు అంటూ ఆమె నవ్వు మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అంటే కాకుండా ఆమెనే జడ్జి గా కొనసాగించాలని ఎవరిని అయితే జనం బాగా ఇష్టపడతారో వాళ్లని ఉంచారా ఇంద్రజ గారిని దయ చేసి కొనసాగించండి అంటూ మల్లెమాలకు తెగ రిక్వెస్ట్ లు చేస్తున్నారు అభిమానులు.

ఈ విష్యం పై మల్లెమాల కూడా ఆలోచిస్తుంది ఇప్పటిదాకా జబర్దస్త్ షో లో నాగాబాబు 2019 లో జబర్దస్త్ ని వదిలి వెళ్లారు ఇక గాయకుడు మనో అతని స్థానంలో ఉన్నారు. ఈ ప్రదర్శనలో జానీ, శేఖర్ కూడా అతిథి న్యాయమూర్తులుగా చాలా సార్లు కనిపించారు. కొరియోగ్రాఫర్ టీవీ జడ్జి జానీ మాస్టర్ మరియు నటి మీనా ప్రముఖ కామెడీ షో జబర్దాస్ లో పాల్గొంటారు అయితే ప్రదర్శన యొక్క మెయిన్ జడ్జెస్ రోజా మరియు నాగబాబు లేనప్పుడు వారు ప్రదర్శనను జడ్జెస్ గా వ్యవరించేవారు. ఈ షోని సంజీవ్ కె కుమార్ దర్శకత్వం వహించారు మరియు తరువాత నితిన్ మరియు భారత్ దర్శకత్వం వహించారు. 2013 సంవత్సరంలో ఈటీవీలో ప్రారంభమైన ఈ షో 400 ఎపిసోడ్‌లకు పైగా టాప్ పోసిషన్ లో నడుస్తుంది. ఇక రోజా కి సర్జరీ కావడంతో విశ్రాంతి తీసుకోవడం కారణంగా ఆమె స్థానంలో ఇంద్రజ జడ్జి గా వ్యవరించారు.

ఇంద్రజ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం సినిమాలో నటించింది పలు టెలివిషన్ షోలో కూడా చేస్తుంది, తమిళ్ సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టి తెలుగు లో హలో బ్రదర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. యమలీల, శుభమస్తు,లయన్, అజ్ఞాతవాసి,బుడుగు, హ్యాపీ వెడ్డింగ్, సాఫ్ట్వేర్ సుధీర్, శతమానంభవతి లో నటించారు ఇప్పటిదాకా ఆమె అన్ని భాషలో చాలా సినిమాలో నటించారు, అల్లుడి అదుర్స్ సినిమాలతో సంవత్సరం తరువాత ఎంట్రీ ఇచ్చారు ప్రస్తుతం తెలుగు లో స్టాండప్ రాహుల్, మలయాళంలో 12 సి లో నటిస్తుంది. ఇపుడు కామెడీ షో జబర్దస్త్ లో చాలా కాలం తరువాత రోజా స్థానంలో ఇంద్రజ ఏప్రిల్ నుండి నెల పాటు జడ్జి గా వ్యవరించింది అయితే ఇపుడు ఇంద్రజ కావాలని అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు మల్లెమాల ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంద్రజ మల్లి జబర్దస్త్ లో వస్తారేమో చూడాల్సిందే .