జాతిరత్నాలు సినిమా ఎలా ఉందొ తెలుసా మూవీ రేటింగ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ప్రేక్షకులు ఎపుడెపుడా అని ఎదురుచుసిన జాతిరత్నాలు చిత్రం విడుదల అయ్యింది, ఈ చిత్రం లో నవీన్ పోలిషీటీ,రాహుల్ రామకృష్ణ,ప్రియా దర్శి వంటి స్టర్డామ్ ఉన్న నటులు తో ఈ సినిమా ఈరోజు మన ముందుకి వచ్చింది అయితే రిలీజ్ కి ముందే పాటలు, టీజర్, ట్రైలర్ పోస్టర్ లతో మంచి అంచనాలు పెంచేసింది.. జాతిరత్నాలు స్టోరీ చుస్తే మెదక్ జిల్లా జోగిపేట శ్రీకాంత్ గా నవీన్ పోలిశెట్టి నటించారు, రవి గా రాహుల్ రామకృష్ణ,శేఖర్ గా ప్రియా దర్శి నటించారు అయితే వేల ముగ్గురు అల్లరి చిల్లరగా బాధ్యత లేకుండా తిరిగే యువకులు తన తండ్రి నడిపే లేడీస్ ఎంపోరియం షాప్ లో అయిష్టం పని చేసే శ్రీకాంత్ ఉద్యోగం కోసం తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ కి వస్తారు, ఆ తరువాత చిట్టి హీరోయిన్ ఫారియా అబ్దుల్లాహ్ తో శ్రీకాంత్ ప్రేమలో పడతారు.. ఆ తరువాత ముగ్గురు స్నేహితులు జీవితం లో చోటు చేసుకున్న మార్పులే గురించి ఈ జాతిరత్నాలు కథ అని చెప్పాలి.

ఈ సినిమాలో మంత్రి చాణిక్య పై హత్య ప్రయత్నం జరిపింది ఎవరు ఈ కేసు లో ముగ్గురిని ఎందుకు అరెస్ట్ చేసారు చివరికి ఎలా తప్పించుకున్నారు చిట్టి తో శ్రీకాంత్ ప్రేమాయణం చివరికి ఎలా మలుపు తిరుగుతుంది, జోగిపేటను వదిలి వచ్చిన జాతిరత్నాలు మల్లి చివరికి ఎం చేసారని ఆశక్తికరమైన అంశాలతో ఈ సినిమా తెరకు ఎక్కింది.ఫస్ట్ హాఫ్ ఎనాలిసిస్ చుస్తే కామెడీ ప్రధానంగా సాగే జాతిరత్నాలు ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకునేలా చేసారు శ్రీకాంత్, రవి,శేఖర్ ముగ్గురు కూడా బాగా సంభాషణలతో అద్భుతంగా నవ్వించారు ముఖ్యం గా యూత్ ని బాగా అక్కటుకుంది ఈ సినిమా డైలాగ్స్, పాటలు అన్ని కూడా మంచి ప్లస్ అనే చెప్పాలి.ఇక ఇంటర్వెల్ కి అసలు కథ తిరుగుతుంది మంత్రి చాణిక్య హత్య కేసులో కథ అసలీ మలుపు తిరిగింది శ్రీకాంత్,రవి శేఖర్ లను అరెస్ట్ చేయడం వాలా కోసం చిట్టి వాదించడం కోర్ట్ సన్నివేశాలతో సెకండ్ అలా ముందుకి సాగుతుంది అక్కడ అక్కడ రొటీన్ గా కాస్త సీన్స్ బోర్ కొట్టిస్తుంది.

నటుడు బ్రహ్మానందం తెరకు ఎక్కించిన సన్నివేశాలు అందరిని అక్కటుకునేలా ఉన్నాయ్ మొత్తానికి ప్రేక్షకులకు అదిరిపోయే కామెడీ తో ఎంటర్టైన్ చేస్తుంది. ఇక డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమాను అత్యంత వినోదవర్గంగా మలిచే ప్రయత్నం చేసారు, ఈ కోణం లో దర్శకుడు అనుదీప్ 100 శాతం మార్కులు సాధించారు అనే చెప్పాలి. ఆ ముగ్గురు ఎంత ప్రమాదం లో ఉన్న కూడా ప్రేక్షకులను నవ్వించడం ఏ మాత్రం మర్చిపోలేదు. ఈ విష్యం లో దర్శకుడు రచన, ప్రతిభ బాగా కనిపిస్తుంది ప్రతి సీన్ ని ప్రేక్షకులను నవ్వించేందుకు రాసుకున్నటు కనిపిస్తుంది, మొత్తానికి జాతిరత్నాలు సినిమాతో దర్శకుడు అనుదీప్ తన టైమింగ్, కామెడీ, ఎమోషన్ అన్ని బాలన్స్ చేసి సినిమాని తెరకు ఎక్కించారు అనే చెప్పాలి, ఇక సినిమాలో నటన గురించి చెప్తే నవీన్, ప్రియా దర్శి,రాహుల్ రామకృష్ణ యాక్టింగ్ అద్భుతం అనే చెప్పాలి ఎన్నో సినిమాలో తమ నటన తో ప్రేక్షకులను అక్కటుకున్నారు.

ఈ జాతిరత్నాలు సినిమాలో మాత్రం ముఖ్యం గా చెప్పుకోవాల్సింది నవీన్ గిరించి కామెడీ టైమింగ్ ఉన్న అతి కొద్దిమంది హీరోల జాబితాలో నవీన్ ఒక్కడు అంతలా తన కామెడీ తో అక్కటుకునాడు.. ఇక ప్రియా దర్శి, రామకృష్ణ ఎప్పటిలాగానే అక్కటుకునాడు సీన్స్ లో ఇక అల్లరి అద్భుతంగా ఉండనే చెప్పాలి, ఈ సినిమాలో జాతిరత్నాలు సినిమాలో ఈ ముగ్గురు హీరోలు గురించి కాకుండా హీరోయిన్ ఫరియా గురించి చెప్పుకోవాలంటే చిట్టి పాత్రలో ఏంటో క్యూట్ గా నటించింది చిట్టి తన తనతో ప్రేక్షకులను మెప్పించింది. బాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఈ సినిమాకి ముఖ్యం గా పాటలు కూడా హిట్ అయ్యాయి,ఈ సినిమాకి రధం మంచి సంగీతం అందించారని చెప్పాలి. మొత్తానికి స్వప్న మూవీస్ స్థాయికి తగినట్టు జాతి రత్నాలు నిలిచింది మంచి కథ బలంగా ఉంది కాబ్బటి మంచి రేటింగ్ వచ్చింది అలానే కలెక్షన్ కూడా బాగానే వాసులు అవుతుందని అనే తెలుస్తుంది అయితే ఈ సినిమా ఇంకా సక్సెస్ అవ్వాలని అందరు కోరుకుంటున్నారు.