జెర్సీ సినిమా ఒరిజినల్ స్టోరీ ఎవరిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్ని సూపర్ హిట్లు ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటికి చరిత్రలో గుర్తు ఉండిపొయ్యేలా ఉంటాయి, ఈ సినిమాలు మన మనస్సుకి ఎంతగానో హత్తుకునేలా ఉంటాయి, ఎన్ని సార్లు చూసిన అసలు బోర్ కొట్టదు, అలాంటి క్లాసికల్ హిట్ సినిమాలలో ఒక్కటి న్యాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా, 2019 వ సంవత్సరం లో విడుదల అయినా ఈ సినిమా ఎంత పెద్ద ఘన విజయం అసాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అటు బాక్స్ ఆఫీస్ పరంగా గా ఈ సినిమా ఎంతతి విజయం సాధించిందో, విమరస్కుల ప్రశంసలను కూడా అందుకుంది, హీరో నాని ని అందరూ ఎందుకు న్యాచురల్ స్టార్ అంటారో ఈ సినిమా చూస్తే అర్థం చేసుకోవచ్చు, అర్జున్ అనే పాత్ర లో న్యాచురల్ స్టార్ నాని చేసిన నటన ఎప్పటికి ఎవ్వరు కూడా మర్చిపోలేరు, ఇప్పుడు ఈ సినిమాని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో తీసాడు, తెలుగు లో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్నురి , హిందీ లో కూడా దర్శకత్వం వహిస్తున్నాడు, అయితే ఈ జెర్సీ కథ కల్పితమా ? లీకపోతే నిజంగానే జరిగిందా అనేది ప్రతి ఒక్కరిలో నిన్న మొన్నటి వరుకు ఉన్న సందేహం,అయితే ఇటీవల దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది.

ఈ జెర్సీ సినిమా స్టోరీ ప్రముఖ ఇండియన్ క్రికెటర్ రమణ్ లాంబా జీవిత కథకి పోలి ఉంటుంది, ఈయన అప్పట్లో 32 ఒన్డే ఇంటర్నేషనల్ మ్యాచులు మరియు ఒక్క నాలుగు టెస్టు మ్యాచులు ఆడారు, అప్పట్లో రమణ్ లాంబా స్టేడియం లోకి క్రికెట్ బాట్ పట్టుకొని న్బడిచి వస్తుంటే ప్రత్యర్థుల్ గుండెలు వణికేవి, ఇతనికి తెలిసిన టెక్నీక్స్ మరియు అన్ని ఫార్మాటులలో ఇతని ఆడే షాట్స్ ని చూసి అప్పటి క్రికెట్ దిగ్గజాలు సైతం ఆశ్చర్యపొయ్యేవారు, కానీ దురద్రపు శాతం కొద్దీ ఇతను ఇతర క్రికెటర్స్ తో సమానంగా పాపులర్ కాలేకపోయారు, చాలా మందికి ఇప్పటికి రంబ అంటే ఎవరో తెలియదు,ఇక ఇతను అనధికారిక వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ఐర్లాండ్ జట్టుకి ప్రాతినిధ్యం వహించారు, ఈయన ప్రాతినిధ్యం లో అప్పటి వరుకు లోఫేసు లో ఉన్న ఐర్లాండ్ జట్టు ఒక్కసారిగా టేబుల్ లోకి టాప్ పోసిషన్ లోకి వచ్చింది ,అలా ఈయన సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి.

ఇక 1998 వ సంవత్సరం ఫిబ్రవరి 20 వ తారీఖున ధాఖలోని బంగ్ బందు స్టేడియం లో అబ్రాహాని క్రీడా చక్ర అనే ప్రముఖ సంస్థ నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ లో ఆడుతున్నాడు రమణ్ లాంబా, ఈ మ్యాచ్ ఆయన జీవితానికి ముగింపు పలుకుతుంది అని ఎవ్వరు అనుకోలేదు,రమణ్ లంబ తన బ్యాటు తో మెరుపు దాడులు చేస్తున్న సమయం అది, సరిగ్గా మూడు బాల్స్ లో 6 పరుగులు కొడితే మ్యాచ్ గెలిచినట్టే, రెట్టింపు ఉత్సాహం తో బాటింగ్ చెయ్యడానికి క్రీజు లో సిద్ధం గా ఉన్నాడు రమణ్ లాంబా, అలా ఆడబోతున్న సమయం లో మెహ్రాబ్ హుస్సేన్ అనే బౌలర్ వేసిన బంతి నేరుగా రమణ్ లాంబా తలకి తగిలింది, అంతే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు రమణ్ లాంబా, అలా ఇంటర్నల్ గా బ్రెయిన్ లో హేమిరేజ్ ఏర్పడి కోమాలోకి వెళ్ళిపోయాడు రమణ్ లాంబా, ధాఖలోని ఒక్క ప్రముఖ హాస్పిటల్ లో రమణ్ లాంబా ని చేర్చి చికిత్స ఇవ్వగా, ప్రాణాలతో పోరాడి ఆయన మూడు రోజుల తర్వాత తన తుది శ్వాసని విడిచాడు, ఇతని స్టోరీ ని ఆధారంగా తీసుకొని జెర్సీ సినిమా తీశారు అని అందరూ అంటూ ఉంటారు, కానీ ఈ చిత్ర బృందం లో ఒక్కరు కూడా విషయం అధికారికంగా ప్రకటించలేదు, అధికారికంగా ప్రకటించకపోయినా రమణ్ లంబ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొనే జెర్సీ సినిమాని తీశారు అని టాక్ వినిపిస్తుంది.