టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెలుగు హీరోలు రాయడం ,చదవటం రాని వాళ్ళు ఎవరో తెలుసా?

గతం లో మన తెలుగు చిత్రపరిశ్రమను చూసుకుంటే మొత్తం నటులు అందరు తెలుగు వారే ఉండేవారు హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కామిడీయన్లు ఇలా చెప్పుకుంటే పొతే అందరు తెలుగు వాళ్లే ఉండేవారు ముఖ్యం గా తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడేవారు వాళ్ల డబ్బింగ్ వాళ్లే చెపుకునేవాళ్లు అప్పట్లో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్ రావు , కృష్ణంరాజు, శోభన్ బాబు, కృష్ణ, ఇలా చెప్పుకుంటూ పొతే చాలామంది హీరోలు అందరు తెలుగు వాళ్లే ఇక హీరోయిన్లు చూసుకుంటే సావిత్రి, జమునా, భానుమతి ఇలా హీరోయిన్స్ కూడా తెలుగు తనానికి వెలుగుల ఉండేవారు.. ఏకంగా భానుమతి అయితే కవయిత్రి ఆమె అచ్చమైన తెలుగు భాషలోనే మాట్లాడతారు అద్భుతమైన కవితలు రాస్తారు.. ఆమె డబ్బింగ్ చెబుతుంటే అందరు ఆశ్చర్యపోయేవారట తన పాట తానే రాసుకుని ప్రేక్షకులను మేపించేవారు..

ఇక ఎన్టీఆర్ గురించి చెప్పకర్లేదు తెలుగు తనానికి నిలువెత్తు నిదర్శనం అయినా సొంతంగా కధలు రాసేవారు దర్శకత్వం చేసేవారు, ఒక్కసారి డైలాగ్ చెప్తే చాలు ఎన్ని నిముషాలు అయినా టేక్ లేకుండా ఆలా చెప్పేస్తారు అయినా బహుబాషా చిత్రలో కూడా నటించారు, ఇక అక్కినేని నాగేశ్వర్ రావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు కూడా సీనియర్ నటులు అందరు అద్భుతంగా తెలుగు మాట్లాడతారు కానీ ఇపటితరం హీరో, హీరోయిన్లకి తెలుగు మాత్రం అంత రాదు చిత్రసీమలో ముందు ఎంట్రీ ఇచ్చిన హీరోలో చాలామందికి ముఖ్యం గా వారసులు గా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లకి కూడా తెలుగు సరిగ్గా వచ్చేది కాదు కానీ ఇపుడు మాత్రం అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇలా చిత్రసీమలోకి ముందు వచ్చి కాస్త ఇబ్బందులు పడిన నటులు చాలామంది ఉన్నారు..

ప్రిన్స్ మహేష్ బాబు ముందు తెలుగు మాట్లాడానికి అయినా కాస్త కష్టపడేవారు కానీ తరువాత 2 -3 చిత్రాల్లో నటించక అద్భుతంగా తెలుగు మాట్లాడటం నేర్చుకున్నాడు.. ఇక అంటే కాదు మహేష్ బాబు భార్య కూడా బొంబాయి నుండి వచ్చిన అమ్మాయి ఆమెకి తెలుగు రాదు ఇపుడు మహేష్ బాబు అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నాడు. ఇక సహజ నటి జయసుధ ఆమెకు కూడా ముందు అంత తెలుగు వచ్చేది కాదు కానీ తరువాత 5 -6 సినిమాలు నుంచి ఆమె తెలుగు లో అద్భుతంగా మాట్లాడేవారు.. ఇక మంచు లక్ష్మి గురించి చెప్పుకోవాలి ఆమె స్టైల్ ఏ వేరు మాట కూడా అలానే ఉంటుంది.. మంచు వారింట పుట్టి అసలు తెలుగు రాని నటిగా చెబుతారు కానీ ఇపుడు తెలుగు కాస్త బాగానే మాట్లాడుతుంది కానీ ఆమె పూర్తిగా ఇంగ్లీషు లోనే మాట్లాడుతారు అయితే అమెరికాలో ఉంది వచ్చారు కాబ్బటి అక్కడ ఇంగ్లీష్ స్టైల్ ఇక్కడ ఉండేది ఆమెకు కానీ ఇపుడు సినిమాలో ఆమె డబ్బింగ్ కూడా చెప్తారు..

ఇక తెలుగు లో మంచు లక్ష్మి తండ్రి మోహన్ బాబు 500కి పైగా చిత్రాల్లో నటించారు, అయిన తెలుగు ఎంత బాగా మాట్లాడుతారో అందుకే ఆయనకి డైలాగ్ కింగ్ అనే పేరు కూడా ఉంది.. ఇంకా మంచు విష్ణు కూడా అంటే ముందు తెలుగు లో చాలా కష్టపడేవారు తరువాత బాగా నేర్చుకున్నాడు.. ఇంకా మనోజ్ కూడా తెలుగు బాషా పండితుడు మోహన్ బాబు ముగ్గురు పిల్లలో తెలుగు బాగా మాట్లాడేది మనోజ్ అనే అంటారు.. ఇక రామ్ చరణ్ కూడా చిరుత సినిమాలో కూడా తెలుగు అంత వచ్చేది కాదు తరువాత బాగా నేర్చుకున్నాడు.. ఇక అక్కినేని అఖిల్ కూడా ముందు తెలుగు మాట్లాడానికి కష్టపడేవారు పూర్తిగా ఇంగ్లీష్ లోనే మాట్లాడేవారు ఇంట్లో కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు తరువాత సినిమాలో ఇపుడే బాగా తెలుగు నేర్చుకున్నారు.. మొత్తానికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలావరకు పరాయి బాషా హీరోయిన్స్ ఉన్నారు.. తెలుగు అసలు రాదు చాలావరకు డబ్బింగ్ మాత్రమే వీరికి చెబుతారు కానీ గతంలో చూసుకుంటే అందరు మన తెలుగు వాళ్లే ఎక్కువ ఉండేవారు.