టాలీవుడ్ హీరోల కన్నా వాలా భార్యలు ఎక్కువ సంపాదిస్తున్నారు ఏంటో తెలుసా?

టాలీవుడ్ లో ఇపుడు మన స్టార్స్ చాలామంది బిసినెస్ మైండ్స్ తో ఆలోచిస్తున్నారు సినిమాలో హీరోగా చేయడమే కాదు ఆ సినిమాకి రెమ్యూనిరేషన్ తీసుకోకుండా సినిమాలో షేర్ తీసుకుంటున్నారు కేవలం సినిమాలు మాత్రమే కాకుండా రకరకాల వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు మన హీరోలు ఇలా ఉంటె వారి కంటే మేము తక్కువ కాదు అంటున్నారు వారి భార్యలు వారు కూడా వ్యాపారాలు చేస్తూ మన హీరోస్ తో పోటీగా సంపాదిస్తున్నారు ఇంకా చెప్పాలంటే కొంతమంది హీరోస్ కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. రామ్ చరణ్ వరస సినిమాలు చేస్తూ సినిమాలకి కోట్లలో రెమ్యూనిరేషన్ తీసుకుంటుంటే తన భార్య ఉపాసన అపోలో చారిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే బి. పాజిటివ్ కి మ్యాగజిన్ కి చీఫ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఆమె సంపాదన రామ్ చరణ్ రెమ్యూనిరేషన్ కంటే ఎక్కువగానే ఉంటుంది .

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క సినిమాలతో బిజీ గా ఉంటూనే యాడ్స్, AMB మూవీస్, ఇక రీసెంట్ గా ది హంబెల్ గో అనే బట్టల వ్యాపారం కూడా మొదలు పెట్టారు అయితే మహేష్ బాబు తన సినిమాలతో తాను బిజీ గా ఉంటె వాటి వ్యవహారాలు అన్ని చూసుకోవడంలో అయినా భార్య నమ్రత బిజీ గా ఉంటారు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోస్ లో ఒక్కరిగా ఉంటూ బాగానే సంపాదిస్తున్నారు అయితే అయినా భార్య స్నేహ రెడ్డి స్పెక్ట్రమ్ అనే మ్యాగజిన్ కి చీఫ్ ఎదిర్ గా ఉన్నారు అలానే తన తండ్రి సైంట్ ఇన్స్టిట్యూట్ బిసినెస్ కూడా చూసుకుంటారు. ఇక రీసెంట్ గా పికాబూ అనే సెలబ్రిటీ ఫోటోగ్రఫీ బిసినెస్ ని కూడా స్టార్ట్ చేసారు. నాచురల్ స్టార్ నాని సంవత్సరానికి రెండు,మూడు సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు అలానే రీసెంట్ గా నిర్మాత గా కూడా మారదు విశ్వక్ సేన్ నటించిన సినిమాలకి నిర్మాత మన హీరో నాని అనే చెప్పాలి.

ఇక నాని భార్య అంజనా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తీ చేసిన ఆమె అర్.కే. మీడియా లో కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. బాహుబలి సినిమాకి కూడా అంజనా డిజైనర్ గా పని చేసారు. యాక్టర్ మరియు డైరెక్టర్ అయినా రాహుల్ రవీందర్ తెలుగు లో తమిళ్ లో సినిమాలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు అయితే రాహుల్ కంటే కూడా అయినా భార్య చిన్మయి సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ తన భర్త తో కన్నా ఇంకా ఎక్కువగా సంపాదిస్తుంది తెలుగు లో సమంత కి డబ్బింగ్ చెప్పేది చిన్మయి అని మనకి తెలుసు. ఒకప్పటి హీరో గా వెలుగు వెలిగిన అల్లరి నరేష్ కి ఇపుడు పెద్దగా సినిమాలు లేవు గతం లో సంవత్సరానికి 2,3 సినిమాలు చేస్తే ప్రస్తుతం సంవత్సరానికి ఒక్క సినిమా కూడా అవకాశం లేదు. ఇక తన భార్య విరూప వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తూ ఈవెంట్ మ్యానేజర్ గా లక్షల్లో సంపాదిస్తుంది. హీరో నందు సినిమాలు చేస్తుంటే భార్య గీత మాధురి పాటలు పడుతూ భర్త తో సమానం గా సంపాదిస్తుంది.

యాక్టర్ రాజీవ్ కనకాల గతం లో పోలిస్తే ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలే చేస్తున్నాడు అయితే అయినా భార్య తెలుగు టాప్ యాంకర్ సుమ మాత్రం షోస్, ఈవెంట్స్ అంటూ ఫుల్ బిజీ గా ఉంటూ తన భర్త కంటే ఎక్కువగా లక్షల్లో సంపాదిస్తుంది. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలతో బిజీ గా ఉంటె అయినా భార్య తబిత లాండ్రీ బిసినెస్ చేస్తూ ఈ వ్యాపారం లో ఆమె బాగా సంపాదిస్తుంది. నాగచైతన్య సంవత్సరానికి ఒక సినిమానే చేస్తుంటే అయినా భార్య హీరోయిన్ సమంత మాత్రం తెలుగు లో తమిళ్ లో సంవత్సరిని 3 ,4 సినిమాలతో అదరకొడుతుంది, ఇక ఇటీవలే ఏకం అనే ప్లే స్కూల్ ని కూడా స్టార్ట్ చేసింది అలానే వీటితో పాటు కొన్ని యాడ్స్ షోస్ కూడా చేస్తూ బిజీ గా ఉన్నారు, నాగచైతన్య కంటే ఎక్కువ సంపాదిస్తుంది, రాజమౌళి డైరెక్షన్ లో బిజీ గా ఉంటె అయినా భార్య రామ కాస్ట్యూమ్ డిజైర్ గా చేయడం తో పాటు ప్రొడక్షన్ కి సంబందించిన వ్యవహారాలు చూసుకుంటారు.