టిక్ టాక్ స్టార్ దుర్గారావు కి అదిరిపోయే బంపర్ ఆఫర్ బిగ్ బాస్ 5 సీసన్ లో ఎంట్రీ ఆనందంలో ఫాన్స్ !

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 తెలుగు సీసన్ ముగిసి ఇంకా రెండు నెలలు కూడా పూర్తీ కాలేదు, అపుడే సీసన్ 5కి సంబంధించిన వార్తలు మొదలైపోయాయి, ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు టీమ్ సెలెబ్రిటీల వేతలో ఉన్నారని గత కొద్దీరోజులుగా వార్తలు వస్తున్నాయి. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్,యాంకర్ రవి,హైపర్ ఆదిలను ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ సంప్రదించినట్టు సమాచారం అయితే ఈ జాబితాలో ఇపుడు టిక్ టాక్ దుర్గారావు చేరారు అని వార్తలు వస్తున్నాయి..టిక్ టాక్ ద్వారా తెలుగు రాష్ట్రలో పాపులర్ అయినా సోషల్ మీడియా సెన్సేషన్ దుర్గారావు తెలుగు సినిమా పాటలకు తనదైన స్టైల్ లో డాన్స్ లు చేస్తూ వాటిని వీడియోలుగా చేసి టిక్ టాక్ లో పెట్టేవారు..

దుర్గారావు స్టెప్పులకు ఫిదా అయినా నెటిజన్లు ఎగబడి చూసేవారు అయినా వీడియోలను విపరీతంగా ఆదరించారు బాగా అలానే తాను ఫేమస్ కూడా అయ్యాయి, దీనితో ఎక్కడో రాజముండ్రి సమీపంలో పల్లెటూరు నుంచి టిక్ టాక్ వీడియోలు చేసిన దుర్గారావు, ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ టిక్ టాక్ దుర్గారావు అయిపోయారు.. పలాస సినిమాలోని నాది నేకిలిస్ గొలుసు పాటతో దుర్గారావు పాపులర్ అయిపోయారు.. ఆ తరువాత వందల టిక్ టాక్ వీడియోలు తీసి సెన్సషనల్ గా ఫేమస్ అయ్యారు దుర్గారావు అభిమానులను సంపాదించుకున్నారు అయితే అనుకోకుండా టిక్ టాక్ బాన్ అవ్వడంతో దుర్గారావు ఇక వీడియోలు తీయడం వీలు పడలేదు,అయినప్పటికీ యూట్యూబ్ ఇంటర్వ్యూ లతో మల్లి అభిమానులను ముందుగు వచ్చారు..

ఈ మధ్య సినిమాలోనూ ఆయనకి అవకాశాలు వస్తున్నాయి, ఇటీవలే వచ్చిన క్రాక్ సినిమాలో ఒక పాటలో స్టెప్పులు వేశారు,ఇపుడు జగపతిబాబు ఎఫ్సీయూకె సినిమాలో కనిపించబోతున్నారు, ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో జగపతిబాబు తో కలిసి దుర్గారావు వేదిక పై డాన్స్ చేసారు మరి ఇంత క్రేజ్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్ దుర్గారావు ను బిగ్ బాస్ టీమ్ వదులుతారో అందుకే అయినా ఇమేజ్ ని వాడుకోవాలని చూస్తున్నారట.. ఇప్పటికే దుర్గారావు ని సంప్రదించారని సమాచారం, ఒకవేళ దుర్గారావు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఇప్పటివరకు ఎవరు చూడని కొత్త రకం వినోదం మనం చూడచ్చు,ఈ అవకాశం దుర్గారావు లైఫ్ స్టైల్ ని కూడా మార్చచు, టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులర్ అయినప్పటికీ దుర్గారావు ఆర్థికంగా పెద్దగా స్థిరపడలేదు..

బిగ్ బాస్ ద్వారా వచ్చే రెమ్యూనిరేషన్ అయినా ఇపుడు ఆర్థికంగా ఉండటానికి ఉపయోగపడుతుంది అని ఈ టిక్ టాక్ ద్వారా అయినా 3 లక్షల దాక సంపాదించారు, చిన్నప్పటినుండి యాక్టింగ్ అంటే ఇష్టం తో టిక్ టాక్ వీడియోల ద్వారా సోషల్ మీడియా లో ఎంట్రీ ఇచ్చారు, దుర్గారావు కి సొంతగా నాట్య మండలి కూడా ఉంది.ఈటీవీ లో ప్రసారం ఆయె ఢీ డాన్స్ షో లో కూడా దుర్గారావు పెరఫార్మసి ఇచ్చారు. ఇక సినిమాలో ఎంట్రీ ఇస్తే కాస్త ఆర్థికంగా కూడా స్థిరపడతారని తెలుస్తుంది అయితే ఇవన్నీ నిజంగా జరగాలంటే ముందు బిగ్ బాస్ సీసన్ 5 లోకి టిక్ టాక్ దుర్గ రావు వెళ్లడం అనేది నిజం అవ్వాలి దాని కోసం ఫాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు అని తెలుస్తుంది..