డైరెక్టర్ తేజ కుటుంబం గురించి మనకి తెలియని అనేక విషయాలు!

టాలీవుడ్ లో ముక్కుసూటిగా మాట్లాడే దర్శకుడు తేజ ఎవరి గురించి మాట్లాడిన ఏ మాత్రం సందేహించకుండా మాట్లాడేస్తారు తేజలో ఉన్న ముక్కుసూటితనమే కొన్ని సార్లు ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయ్ చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చి నువ్వు నేను సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు అయితే తేజ ఎన్నో తమిళ సినిమాలకు లైటింగ్ అసిస్టెంట్ గా పని చేసారు, ఆ తరువాత రవికాంత్ నాగైచ్ దెగ్గర కెమెరా డిపార్ట్మెంట్ గా కూడా పని చేసాడు చిత్రం, నువ్వు నేను, జయం వంటి హిట్ సినిమాలు తీశారు చాలా కాలం తరువాత హీరో రానాతో నేనే రాజు నేనే మంత్రి చిత్రం విజయం సాధించారు తేజ శ్రీవల్లి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కూతురు పేరు ఐలతేజ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటుంది ఈమెకి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

తేజ కొడుకు ఆరోవ్ తేజ అనారోగ్యం కారణం గా మరణించాడు కొడుకు మరణం తరువాత తేజ ఎంతగానో కుంగిపోయాడు రెండవ కుమారుడు అమిత్ చిత్రం సినిమాలో బాలనటుడిగా నటించాడు. ఇక తేజ తమిళనాడులోని మద్రాసులో జస్టి బలరాం కృష్ణ, జస్త రాణి దంపతులకు జన్మించారు, అతని తండ్రి ప్రధానంగా జపాన్‌లోని టోక్యోలో ఉన్న పారిశ్రామికవేత్త ఆ తరువాత అతను నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్‌లో సమర్పించిన డాక్యుమెంటరీల కోసం పనులను చేపట్టాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లోని బాండ్‌వాగన్‌లో చేరాడు. తేజ చిత్రం ప్రేక్షకులకు ఒక సంబరం అనే చెప్పాలి ఎన్నో కష్టాలు పది చిత్ర సీమలో రాణిస్తున్నాడు తేజ అయినా కొత్తగా వచ్చిన హీరో, హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేస్తారు, తేజ కి ఇద్దరు సోదరీమణులు లైటింగ్ అస్సిటంట్ గా చేరారు చాలా కష్టాలు పది ఇంత స్థాయికి వచ్చారని చాలా ఇంటర్వ్యూ లో చెప్పారు.

తేజ కి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో పరిచయం ఏర్పడింది తేజ అప్పటికే కెమెరా అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ తో కలిసి శివ సినిమాకి పని చేసాడు శివ సినిమా పోస్టర్లు డిజైన్ చేసింది తేజ, ఆ తరువాత క్షణం క్షణం కూడా తేజ పని చేసాడు, రక్షణ, మనీ అలా వరసగా తెలుగు లో సినిమాలు చేస్తున్నపుడు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నుంచి పిలుపు రావడం తో బాలీవుడ్ లో కూడా 30 చిత్రాలకు కెమెరా మాన్ గా పని చేసాడు. 170 ప్రకటనలు మ్యూజిక్ వీడియోలు కూడా చేసాడు, శివ సినిమా స్క్రిప్ట్ కి రామ్ గోపం వర్మ తో పాటు తేజ కలిసి పనిచేసాడు. ఈ కారణంగా ఆ సినిమా రిలీజ్ అయ్యి సెన్సషనల్ సృష్టించింది, ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ డేట్స్ దొరికినపుడు తేజ ని సంప్రదించారు చాలామంది సినిమా నిర్మాతలు అయితే తనకి దర్శకత్వం రాదని కెమెరా మెన్ గానే ఉంటాను అని వాళ్లతో చెప్పేవారు.

తేజ బాలీవుడ్ లో కెమెరామెన్ గా ఉన్నపుడు కొన్నిసార్లు దర్శకుడు లేకపోవడం తో కొన్ని సన్నివేశాలు తెరకు ఎక్కించేవారు తేజ ఒక సినిమాకు ఏకంగా 10 రోజులపాటు షూటింగ్ కి డైరెక్టర్ రాకపోవడంతో మొత్తం సినిమాని తేజ తెరకు ఎక్కించాడు, ఆ సినిమా విడుదలై బారి విజయం అందుకుంది. ఇక కెమెరామెన్ కంటే దర్శకుడికి పారితోషకం ఎక్కువ వస్తుందని డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగుంటాడని తేజ భావించారు దీనికి అయినా ఎదురుకున్న కష్టాలు ఒక కారణం సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నపుడు తేజ హైదరాబాద్ లోనే ఎక్కువగా హిందీ సినిమా షూటింగులు పెట్టించేవారు రామోజీ ఫిలిం సిటీ లోనే ఎక్కువ సినిమా షెడ్యూల్స్ ప్లాన్ చేసేవారు అలా రామోజీరావు గారిని కలిసి ఫిలింసిటీ లోనే 30లక్షలు తో చిత్రం సినిమాని ప్లాన్ చేసారు తేజ మొదట ఎవరికీ ఆ కష చెప్పిన ఆసక్తి చూపించలేదు ఆ సినిమా విజయం సాధించింది.