తన తమ్ముడి వస్తున్నా తప్పుడు ప్రచారాలపై మెగాస్టార్ సీరియస్

మన తెలుగు మీడియా కేవలం రెండు ప్రధాన పార్టీల మధ్యనే తిరుగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఎన్నో దశాబ్దాల నుండి ఎన్ని మారిన ఇది మాత్రం మారలేదు, ఈ రెండు పార్టీలకు చెందిన మీడియా వర్గాలకు రాష్ట్రం లో మూడవ ప్రత్యామ్నాయం రావడం ఏ మాత్రం ఇష్టం ఉండదు, ఎన్నో ఉన్నతమైన ఆశయాలతో మార్పు కోరుకొని మెగాస్టార్ చిరంజీవి వంటి వాడు పెట్టిన ప్రజా రాజ్యం పార్టీ సైతం ఈ కుట్రలు కుతంత్రాల మధ్య నిలబడలేక పోయింది,రాజకీయాల్లో అందరిలాగా అవినీతి చేయడం చేత కాక వేరే అవకాశం లేక కాంగ్రెస్ పార్టీ లో విలీనం చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది నాటే మన రాష్ట్రం లో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు, ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీద కూడా ఇలాగే విష ప్రచారాలు చేసి ఆ పార్టీ కి తీరని నష్టం చేసేందుకు మీడియా ప్రయత్నం చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, కానీ పవన్ కళ్యాణ్ వీటి అన్నిటిని ఎదుర్కొని పోరాడుతూనే ఉన్నాడు.

ఇక గత కొద్దీ రోజుల నుండి అటు చిరంజీవి మీద ఇటు పవన్ కళ్యాణ్ మీద మీడియా చానెల్స్ అన్ని మరో సరికొత్త అసత్యపు వార్తలతో మరియు ప్రత్యేక కథనాలతో హోరెత్తిస్తుంది,అదేమిటి అంటే బీజేపీ పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి కేంద్ర మంత్రి కాబినెట్ లో చోటు దక్కింది అని, త్వరలోనే బీజేపీ పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ కి మంత్రి పదవి ఇవ్వనున్నారు అని వార్తలు జోరుగా ప్రచారం చెయ్యడం ప్రారంభించాయి,ఇక చిరంజీవి మీద అయితే త్వరలోనే మెగాస్టార్ కి వైసీపీ పార్టీ రాజ్య సభ సీటు ని ఇవ్వనుంది అని,త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన చెయ్యనున్నారు అనే వార్తలు జోరందుకున్నాయి , అయితే ఈ వార్త ఆ చెవిన ఈ చెవిన పడి నేరుగా మెగాస్టార్ చిరంజీవి చెవిన పడింది, అయితే ఈ వార్తలపై ఆయన చాలా తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నా నాపై ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం మీడియా వ్యవస్థకే సిగ్గు చేటు, నా పై నా తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ఇంకా ఎన్నాళ్ళు ఇలా అసత్య కధనాలు ప్రచురిస్తారు అంటూ మెగాస్టార్ ఆవేదన చెందాడు.

అయితే మెగాస్టార్ తన పై వస్తున్నా తప్పుడు ప్రచారాలను పట్టించుకోకుండా తన సినిమాల సంగతి చూసుకుంటూ , కరోనా విలయ తాండవం చేస్తున్న సమయం లో వేలాది మందికి తనకి తోచిన సహాయం చేస్తూ ముందుకి పోతున్నారు, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యి విడుదలకి సిద్ధం గా ఉన్నది, వాస్తవానికి ఈ సినిమా గత నెల 13 వ తేదీన విడుదల కావాల్సి ఉంది, కానీ కరోనా కారణంగా విధించిన లాక్ దేవన్ దృష్ట్యా విడుదల వాయిదా పడింది, మరి కొత్త విడుదల తేదీని ఇప్పటి వరుకు అధికారికంగా ప్రకటించకపోయినా ఆగస్టు నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అని ఫిలిం నగర్ లో గట్టిగ వినిపిస్తున్న టాక్.