తన లైఫ్ లో జరిగిన సంఘటనలు గురించి బయటపెట్టి ఏడ్చేసిన సమీరా రెడ్డి !

సినిమా ఇండస్ట్రీ అన్నాక చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు అందరికి విజయం లభించాలని ఏమి లేదు.. కొందరు సక్సెస్ అవ్వలేక వెళ్లిపోతారు మరికొందరు మరో భాషలో పాపులర్ అవుతుంటారు.. అలాంటి కొందరిలో హీరోయిన్స్ లో సమీరా రెడ్డి ఒక్కరు.. తెలుగు లో 3 సినిమాలో హీరోయిన్ గా నటించారు.. అవేమి విజయం సాధించలేవు ఆ తరువాత బెంగాలీ, హిందీ, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించింది.. అక్కడ పాపులర్ హీరోయిన్ అయిపోయింది కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లో సినిమాలకి దూరం అయింది. ఇటీవలే సమీరా ఇంటర్వ్యూ లో సంచలన విషయాలని తెలిపింది. 2005 లో ఎన్టీఆర్ హీరో గా నటించిన నరసింహుడు అనే సినిమాలో సమీరా రెడ్డి హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ లో పరిచయం అయింది ,ఈ సినిమా పై బర్రిగా అంచనాలు పెట్టుకున్నారు కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యి డిసాస్టర్ గా మిలిగిలింది..

ఆ తరువాత చిరంజీవి గారితో జై చిరంజీవ సినిమాలో కూడా సమీరా హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు, ఆ తరువాత 2006 లో ఎన్టీఆర్ తోనే అశోక్ సినిమాలో నటించింది… ఈ సినిమా కూడా ఆశించిన విద్ధంగా విజయం సాధించలేదు దీనితో చేసిన 3 సినిమాలు ప్లాప్ అవ్వడం తో సమీరా తెలుగు పరిశ్రమకు దూరం అయ్యారు..తెలుగు సినిమాలకి గ్యాప్ ఇచ్చి హిందీ ,బెంగాలీ, కన్నడ ,తమిళ చిత్రాల్లో నటించి తన టాలెంట్ ని నిరూపించుకుంది..అయితే తన కెరీర్ మంచిగా ఎదుగుతున్న సమయం లో సమీరా సినిమాలు చేయడం మానేసింది.. ఆ తరువాత 2014 సంవత్సరం లో అక్షయ్ వర్డ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.. ఆ తరువాత నుండి సినిమాలకి పూర్తిగా దూరం గా ఉంటుంది ..

ఇపుడు సమీరా కి ఇద్దరు పిల్లలు కొడుకు హన్స్ వర్డ్,కూతురు నీరు వర్డ్ గుయించి పంచుకుంది తల్లిగా అవ్వడం చాలా సంతోషం గా ఉందని ఆనందం గా ఉండాలని తెలిపింది..ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి దానికి ఎవరిని నిందించటలేదని అది ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటె అది అలా జరుగుతుందని చెప్పుకొచ్చారు … ఇంకా మాట్లాడుతూ ఎవరైనా తల్లి అయినా తరువాత కూడా అందం గా కనిపించడం కొంతమందికే సాధ్యం అని చెప్పుకొచ్చింది మల్లి నేను సన్నగా అయ్యి అందంగా కనిపించడానికి సమయం పడుతుంది అన్నారు.సమీరా గర్భవతి గా ఉన్నపుడు ఒక ఫోటో ని పోస్ట్ చేస్తే కడుపుతో ఉన్నాను అని చూడకుండా దారుణంగా ట్రోల్ చేసారు అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేసారు..

పిల్లలని కనాలని అనుకునేవారు సారికంగా,మానసికంగా వచ్చే మార్పులకు సిద్ధం గా ఉండాలన్నారు.. ఆ సమయం లో కోపం , ఫ్రస్ట్రేషన్ , చిరాకు వంటివి ఎక్కువగా వస్తాయి అని అందుకు సిద్ధపడాలని అన్నారు. ఆ సమయం లో తన భర్త అక్షయ్ ఎంతో ఓర్పుగా ఉంటూ తనకి అండగా నిలబడ్డారు అని తనకి కావాల్సింది చేస్తూ సంతోషం గా ఉండేలా చూసుకున్నారని. తన వల్లే ఇపుడు ఎంత సంతోషం గా ఉంటున్నాం అని తాను తన భర్త గురించి గొప్పగా చెప్పుకొచ్చారు… సమీరా ఎక్కువగా ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టీవ్ గా కనిపిస్తారు తన పోస్ట్ అన్ని ఫాన్స్ కోసం షేర్ చేస్తారు. ఇక కొన్ని ఏళ్ల తరువాత అయినా సమీరా రెడ్డి తిరిగి ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇవ్వాలని ఆమె ఫాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు…